11, జూన్ 2019, మంగళవారం

అణకువ కూడిన అధికారంఖమ్మంలో మా మేనకోడలి కుమార్తె వివాహానికి వెళ్లి హైదరాబాదు వచ్చాము. ఉదయం పదిగంటల ప్రాంతంలో ఫోను.
‘వైస్ ప్రెసిడెంట్ గారి పీఎస్ ని విక్రాంత్ ని. సారు మాట్లాడుతారు’
‘ శ్రీనివాసరావ్ ! చూడు మొన్న మీరు వచ్చి కలిసి గోరాశాస్త్రి గారి శతజయంతి కార్యక్రమానికి రమ్మన్నారు. ఇరవై నాడు పెట్టుకోమని చెప్పాను. పార్లమెంట్ సమావేశాలు వున్నాయి. రాజ్యసభ శనివారం ఎక్స్టెండ్ అయితే ఇబ్బంది. ఆ తరువాతి వారం పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా!’ అన్నారు అవతల నుంచి వెంకయ్యనాయుడు గారు.
నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ మాట ఆయన ఫోను చేసి మరీ చెప్పక్కర లేదు. ఆయన పియ్యే ఫోను చేసిచెప్పినా సరిపోయేది.
ఆయనే తిరిగి  అన్నారు ‘మా వాళ్ళు మీతో కో ఆర్డినేట్ చేస్తారు. డేట్ ఫిక్స్ చేసి రెండ్రోజుల్లో చెబుతారు’
అలా చెప్పడం వెంకయ్యనాయుడి గారి హుందాతనం.
రేడియో రోజులు జ్ఞాపకం వచ్చాయి. అసెంబ్లీలో ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆయన రాష్ట్రంలో ఎక్కడ ప్రెస్ తో మాట్లాడినా హైదరాబాదు మాకు ఫోను చేసి చాలా క్లుప్తంగా చెప్పేవారు. మేము రేడియో వార్తల్లో యెంత ఇవ్వగలమో అంతే చెప్పేవారు. సాయంత్రం వార్తలు విని ‘బాగానే వచ్చింది’ అంటూ మళ్ళీ ఫోను చేసి చెప్పేవారు. చేసేవారు. ‘మరో పాయింటు వుంది, అది రేపు ఉదయం వార్తల్లో కలిపి ఇవ్వడానికివీలుంటుందా’ అంటూనే అది కూడా  చెప్పేవారు.
ఉదయం వార్తల్లో అది కూడా వస్తుందని నేను వేరే చెప్పక్కర లేదనుకుంటా.  


1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

చూస్తూ ఉండండి. ఏదో రోజు ట్రంప్ గారినుంచి కూడా ఫోన్ వస్తుంది☺️