31, ఆగస్టు 2018, శుక్రవారం

నాన్నకి ప్రేమతో....



క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం గురించి చెబుతూ ఆయన వెనక్కి తిరిగి నీళ్ళ బాటిల్ అందుకోబోయే సమయంలో రెప్పపాటులో ప్రమాదం జరిగిందని అంటూ ఆ సీను రిప్లే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపి, ‘అసలు మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.
పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు.
రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం. అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.
‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా.
వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు.


కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి.

15 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హరికృష్ణ గారు అంటే చాలామందికి అభిమానం. అయితే ఆయనకు స్మారక స్థూపం 500 గజాలు స్థలం ఎందుకు.ఇంత అతి అవసరమా. దేశమంతా సమాధులతో నింపుతున్నారు. వాజపేయి ఆస్తికలు కోట్లు ఖర్చు పెట్టి దేశమంతా చల్లడమేమిటి. ధూ నీయవ్వ. అధికారాన్ని ఇష్టమొచ్చినట్టు దుర్వినియోగం చేస్తున్నారూ గదంట్రా.

అజ్ఞాత చెప్పారు...

మూడు వందల అడుగుల పటేల్ బొమ్మ వందలకోట్లు పెట్టి కడుతున్నారు. ధూ నీయవ్వ అవసరమంట్రా.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఒకటి రెండు నదుల్లో కాక ... వాజపేయి గారి అస్థికల్ని దేశంలోని ... అనేక నదీజలాల్లో ... కలిపారు గానీ చల్లిసట్లు లేదు.
ఒక ఆసక్తికరమైన కార్యక్రమం 1964 మే నెలలో జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించిన తరవాత జరిగింది ... వారి చితాభస్మాన్ని ఆయన మనవడు రాజీవ్ గాంధీ ఒక చిన్న విమానంలో పైకి తీసుకువెళ్ళి ఆకాశం నుండి దేశంలో పలు ప్రాంతాల్లో చల్లారు. ఆ పని నెహ్రూ గారు తన వీలునామాలో వెలిబుచ్చిన కోరిక ప్రకారం చేశారుట (సంబంధిత భాగాన్ని ఈ క్రింద చదవచ్చు). దేశాన్ని మొత్తం స్మశానం చేశాడు గదయ్యా అని ఆనాటి సామాన్యజనం కొందరు గొణుక్కోవడం నేను విన్నాను. పైన మొదటి అజ్ఞాత అన్నట్లు ఇటువంటి విషయాల్లో అతి ఎక్కువ అయిపోతోంది, రాజకీయ / కుల లెక్కలు వేసుకుంటున్నారు. లేకపోతే స్మారకచిహ్నం నిర్మించవలసినంత విశిష్టమైన వ్యక్తా హరికృష్ణ ?

“ ..... I am making this request that a handful of my ashes be thrown into the Ganga at Allahabad to be carried to the great ocean that washes India's shore.

The major portion of my ashes should, however, be disposed of otherwise. I want these to be carried high up into the air in an airplane and scattered from that height over the fields where the peasants of India toil, so that they might mingle with the dust and soil of India and become an indistinguishable part of India.”

https://www.nytimes.com/1964/06/04/archives/excerpts-from-the-will-of-prime-minister-nehru.html

https://www.nytimes.com/1964/06/13/archives/planes-scatter-nehru-ashes.html

K.S.Chowdary చెప్పారు...

స్మారకచిహ్నం నిర్మించవలసినంత విశిష్టమైన వ్యక్తా హరికృష్ణ ?
కాదా మరి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే కట్టేసుకోవాలి. ఇది పొలిటికల్ రూల్, అధికారంలో లేని జగన్ గారే రాష్ట్రమంతా తండ్రి విగ్రహాలు పెట్టించారు. నెహ్రూ గారి బూడిద ప్రజల నెత్తిపై జల్లారు. అటువంటప్పుడు హరికృష్ణ గారికి లేకపోవడమేమిటి? ఆయన సి.యం.ల ఫ్యామిలీయే కదా? ఇంతకంటే అర్హత ఏమి కావాలి? ఫ్యూచర్లో విగ్రహాలకు స్థలం లేకపోతే మనమంతా ఇల్లులు ఖాళీ చేసి పోవాల్సిందే! ఖాళీ చేయకపోతే ఖబర్దారే

Prasanna చెప్పారు...

ఇప్పుడు ఈ పాడె మొయ్యడం, స్మారకం కట్టించడం లాంటి బిల్డప్ ఇవ్వకపోతే రేపు ఆ పార్టీ పాడెక్కడం ఖాయం. హరిక్రిష్ణ చెల్లెలు భా.జ.పా లో ఉన్నదని మర్చిపోకూడదు, ఇవేమీ చెయ్యకుండా ఉంటే జూ.NTR బాజపా వైపు వెళ్ళే ఛాన్సుంది. గతకొన్నేళ్ళుగా జూ. NTR, హరిక్రిష్ణ లపరిస్తితి తెలుగుప్రజలకు తెలియందికాదు. చినబాబుని గద్దెనెక్కించడానికి వాళ్ళకి చేసిన అన్యాయం అందులో లోగుట్టు ప్రజలకు తెలియదనుకుంటే పొరపాటు. అయినా ప్రజలెందుకు హరిక్రిష్ణని సపోర్ట్ చెయ్యలేదంటే ఆనాడు వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబు పాత్రెంతో ఆయన పుత్రరత్నాల పాత్రా అంతే. ఇప్పుడు ఆ పాడె మొయ్యకపోతే జూ. NTR ని దూరంచేసుకుని తన పుత్రరత్నానికి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ పని చేయడం వలన రెండు రకాలుగా చంద్రబాబుకి ఉపయోగం
1. జూ. NTR ని కూల్ చెయ్యడం తద్వారా పార్టీ చీలిక, లేదా లోకేశ్ కి వ్యతిరేకత ని తగగ్గించడం
2. ఒక వేళ అతను కూల్ అవ్వకపోతే, "అతని తండ్రికి నేనెంతో చేశాను కానీ జూ. NTR క్ఱుతజ్నతతో లేడని" ప్రచారం చెయ్యడం, తద్వారా కొంత సింపతీ పొందడానికి ప్రయత్నించడం.
శవరాజకీయాలు ప్రతినాయకుడూ చేసేవే అది బాబు అయినా జగన్ అయినా, దొందూ దొందే.

Jai Gottimukkala చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు:

ఆసక్తికర సమాచారం సేకరించారు, థాంక్స్!

నెహ్రూ మరణం గురించి కైఫీ అజమీ పాట తప్ప ఇంకేమీ తెలీని నాకు "mingle with the dust and soil of India and become an indistinguishable part of India" అన్న కొత్త విషయం తెలిసింది. ఆయన వీలునామాలో తన వ్యక్తిగత హేతువాద భావాలకు ఒకవైపు పరంపరాలపై ఉన్న గౌరవానికి మరోప్రక్క మధ్య ఘర్షణ కనిపిస్తుంది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

జై గారూ థాంక్స్.
ఈ విషయంలో నెహ్రూ గారికి ద్వైధీభావం (dichotomy) ఉండిందా అని మీరు అనుమానించినది నిజమేననిపిస్తుంది. ఎంత ఆధునికులమనుకున్నవారికైనా వయస్సు పెరిగేటప్పటికి మనసులో ఇటువంటి ఘర్షణ చోటుచేసుకుంటుందా అనిపిస్తుంది.

ఈ ఉదంతం నాకు 1964 నుండీ తెలిసినదేనండీ. ఇప్పుడు సేకరించినదల్లా ఆనాటి వార్తాకథనానికి లింక్ ... ఇప్పుడు ఆన్లైన్ సౌలభ్యం వచ్చింది కాబట్టి 🙂. నెహ్రూ గారి మరణం గురించి రేడియోలోనూ పత్రికల్లోనూ వార్తలు, ఆయన అంతిమయాత్ర కు ఆల్ ఇండియా రేడియో లో ఆనాటి ప్రసిద్ధ వ్యాఖ్యాత Melville de Mellow గారి (భారతీయుడే) (మహాత్మా గాంధీ గారి అంతిమయాత్ర కు ప్రత్యక్ష్య వ్యాఖ్యానం ఈయనే ఇచ్చారట) అన్ని కిలోమీటర్ల దారిపొడుగూతా ప్రత్యక్ష్య వ్యాఖ్యానం ... కళ్ళకు కట్టినట్లు వర్ణించేవాడు ... గుర్తున్నాయి.

సారీ, నేను చేసిన నా ముందరి వ్యాఖ్యలో చిన్న పొరపాటు దొర్లింది ... ఈ సంఘటన జరిగి 54 సంవత్సరాలు దాటింది కదా. దాని తరువాత మరెన్నో సంఘటనలూ చూశాం. ఆ మేర వయసూ పెరిగింది. వెరసి కాస్త కన్ఫూజన్ అయింది 🙁. అసలు సంగతేమిటంటే ... నెహ్రూ గారి చితాభస్మాన్ని పైనుండి వెదజల్లింది రాజీవ్ గాంధీ కాదు గానీ భారతీయ వాయుసేన వారి విమానాలూ హెలికాప్టర్లూ. అయితే తరువాతి కాలంలో ఇందిరా గాంధీ గారి విషయంలోనూ ఇటువంటిదే జరిగింది (1984) .... ఈ ఉదంతంలో రాజీవ్ గాంధీదే పాత్ర; తన తల్లి చితాభస్మాన్ని విమానంలో నుండి హిమాలయ పర్వత సానువుల్లో చల్లాడు.

Jai Gottimukkala చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు:

మీ పరిజ్ఞ్యానం & జ్ఞ్యాపకాలు రెండూ అమోఘం! దశాబ్దాల కిందటి విషయాలను పూసగుచ్చినట్టు చెప్పడంలో మీకు మీరే సాటి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

🙏 జై గారూ.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్రసన్న గారూ, మీ విశ్లేషణ సబబే. అన్నిటికీ రాజకీయ కారణాలే.

అజ్ఞాత చెప్పారు...

కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అనుమతించకూడదు. There is absolutely no necessity for early polls. EC and supreme court should intervene and stop this. Even though I like kcr and ktr I don't support this. they should not be allowed to foist elections now. They have a great opportunity of simultaneous polls. Let better sense prevail.

అజ్ఞాత చెప్పారు...

Rajeev's ashes were also immersed in all rivers

nmrao bandi చెప్పారు...

@prasanna ...


బాబు గారు మోయ, జూసి, బామ్మర్ది పాడెయా
బాబు గార్ని తెగ మోసే భజనపరుల మీడియా
బాబు గారి ఘన సిత్రాలెన్నెన్నో సూడయా
బాబు గారి నటనానికి భరతరత్న ఏదయా !

బాబు గారు బాబు గారె తెలుసుకోండి బాబయా
బాబు గార్ని తలదన్నగ మించినోడు లేడయా
బాబు గారు లాభమెంచు సూత్రాలే వేరయా
బాబు గార్ని నిర్వచించు పత్రాలే లేవయా !

(హ‌రికృష్ణ మృతి...బాబును మోసిన మీడియా..|| Asthram || పాలిటిక్స్ ... youtube
https://www.youtube.com/watch?v=qx3aLIPMOII)


Prasanna గారు,
ఎన్టీఆర్ బీజేపీ చేరిక సంగతేమో గానీ, హరికృష్ణ గారు మాత్రం వైస్సార్సీపీ లో చేరే అవకాశం బాగా ఉన్నదన్న ఊహాగానాలు తెగ షికార్లు చేశాయ్. గమనిస్తున్న అంశాల్ని బట్టి అలా కూడా జరిగి ఉండేదేమోనన్న సందేహం నాకు గట్టిగానే ఉండేది. ఆ విధమైన గడ్డు పరిస్థితి ఈ సందర్భంగా టీడీపీ కి తప్పినట్లే.

'ప్రజలెందుకు హరిక్రిష్ణని సపోర్ట్ చెయ్యలేదంటే ..." -
ఎందుకనంటే ఆయనకు మార్కెటింగ్ స్కిల్స్ లేకపోబట్టి, బమ్మిని తిమ్మిగా చేయగలిగే వంకర తెలివి తేటలు లేకపోబట్టి. ముక్కు సూటి మనిషి కాబట్టి. అత్యాశ లేకపోబట్టి. నమ్మిన వాళ్ళను నట్టేట్లో ముంచే బుద్ది లేకపోబట్టి. ప్రజలే రోజూ కూడా నటనలే నమ్ముతారు కాబట్టి. వాళ్ళకేది మంచో చెడో తెలుసుకునే విచక్షణ లేకపోబట్టి. ఇంకో విషయం గమనార్హం - ఎన్టీఆర్ గార్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గార్ని, ఎన్టీఆర్ గారే నయవంచకుడని, రకరకాలుగా ఆయన గుణగణాల్ని వర్ణించి చెప్పినప్పటికిన్నీ ప్రజలు గానీ, అభిమానులు గానీ, అవన్నీ త్రోసి రాజని, ఎన్టీఆర్ కుటుంబీకులను గాక చంద్రబాబు గార్ని ఆదరించడం, అనుసరించడాన్ని మనమే విధంగా జీర్ణించుకోవాలి!?

మీరన్నట్లు శవరాజకీయాలు చేయడంలో మాత్రం దొందూ దొందన్న మాట అక్షర సత్యం.

Jai Gottimukkala చెప్పారు...

@nmrao bandi:

హరికృష్ణ పార్టీ పెట్టుకొని చేయి కాల్చుకొని దాదాపు ఇరవై ఏళ్లయింది. మళ్ళీ దుస్సాహసం చేసే వారు కాదేమో.

నందమూరి & దగ్గుబాటి కుటుంబీకులే కాదు, చంద్రబాబు సొంత తమ్ముడు కూడా పార్టీ వదిలేసారు. జరిగిన నష్టం సున్నా.

प्रवीण చెప్పారు...

చంద్రబాబు పార్టీలో తనకి మాత్రమే వ్యక్తిపూజ చేసే ఒక గుంపు (కోటరీ)ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్.టి.ఆర్. కుటుంబంలో ఒక్కడు కూడా చంద్రబాబుని నమ్మకపోయినా అతనికేమీ నష్టం లేదు. నాదెండ్ల భాస్కరరావుకి అలాంటి కోటరీ లేదు కాబట్టే అతని పార్టీ మూతపడి అతను కాంగ్రెస్‌లో చేరిపోయాడు.