21, ఆగస్టు 2018, మంగళవారం

టీవీ చర్చలు అవగాహన కలిగించేలా వుండాలి – భండారు శ్రీనివాసరావురాత్రి ఒక టీవీ అమరావతి బాండ్లు గురించిన చక్కటి అంశాన్ని చర్చకు తీసుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగ్గురూ ఘనాపాటీలే. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపించడమో, తమకు తెలిసిన దాన్ని వివరించడమో చేస్తే బాగుండేది. ఎంతసేపటికీ ఎదుటివాళ్ళ వాదాన్ని పూర్వపక్షం చేయడానికే సమయాన్ని వినియోగించుకున్నట్టు అనిపించింది. టీవీలు చూసేవారిలో ఆయా పార్టీల అభిమానులకు వారి భాషణలు ఆనందం కలిగించి ఉండవచ్చు. కానీ విషయం పట్ల అవగాహన పెంచుకోవడానికి కొంతమందయినా టీవీ చర్చలు చూస్తారు. వారికి మాత్రం నిరాశ మిగిలిందనే చెప్పాలి. చర్చకు ముందు మనసులో మెదిలిన సందేహాలు మరిన్ని పెరిగాయి కానీ నివృత్తి కాలేదని గట్టిగా చెప్పొచ్చు.  

12 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ఈసారి చర్చలకు వెళ్ళేటప్పుడు కాసిన్ని చేపలు, కాసిన్ని కూరగాయలు తీసుకెళ్లి వేదికముందు పరచండి.ఎఫెక్ట్ బాగా వస్తుంది!!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

దాదాపు రోజూ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొనే భండారు శ్రీనివాసరావు గారేనా ఇటువంటి పోస్ట్ వ్రాసింది (ఈయన స్వయంగా అరుపులూ కేకలూ దూషణలూ చెయ్యరు లెండి, అది వేరే సంగతి)? నేను ఇదివరలో ఒకసారి ఇక్కడే అడిగాను చర్చ దారితప్పుతుంటే ఆ టీవీ యాంకరుడు ఏమీ మానిటర్ చెయ్యడేమీ అని. మానిటర్ చేసే ఉద్దేశం ఉన్నట్లు లేదనిపిస్తుంది చూస్తుంటే. టీవీ ఛానళ్ళకు రేటింగులే పరమావధి కదా 🙁.

ఈ కార్యక్రమాలు బాగుపడే సూచనలు లేవు కాబట్టి పైన సూర్య గారిచ్చిన సలహా అనుసరించెయ్యడం బెస్ట్ 😀.

శ్యామలీయం చెప్పారు...

ప్రజలందరికీ ఇప్పటికే ఈ టివీరాజకీయ చర్చలపైన తగినంత అవగాహన కలిగిందనటంలో సందేహం అక్కరలేదండీ.
ఈచర్చలలో మధ్యవర్తిపాత్రను పోషిస్తున్నట్లు కనిపించే యాంకరులు కేవలం మంటలు ఏమాత్రం చల్లారకుండా చూచుకోవటం అనేదే బాధ్యతగా వ్యవహరించటానికి కూర్చునే పెద్దమనుషులు (పెద్దమనుషు లంటేనే బుధ్ధులన్ని వేరురా!). విన్నకోటవా రన్నట్లుగా ఈ టీవీల వాళ్ళందరకీ తమతమ ఛానెళ్ళ రేటింగులే పరామావధి. ఈ కార్యక్రమాలు బాగుపడే సూచనలు లేవు కాని మరింత దరిద్రంగా తయారయ్యే సూచనలైతే ఉన్నాయి (ఎలక్షనులు వస్తున్నాయట మరి). సూర్యగారన్నట్లు చేపలు తీసుకువెళ్ళటంలో ఇబ్బంది ఉందో లేదో తెలియదు కాని చేపలబజారు దుర్గంధం కన్నా ఈ చర్చలు దేపే దుర్గంధం వంద రెట్లు అన్నది తెలిసి కూడా అలా చేయటం అవసరం కాదేమో ఆలోచించండి. ఎవరో ఒకరిద్దరు సౌజన్యారావు పంతుళ్ళు అప్పుడప్పుడూ ఆ చర్చల్లో అమాయకంగా పాల్గొన్నా మిగిలిన వారంతా గుంటనక్కలే కాబట్టి కూరగాయలు తీసుకెళ్ళటం దండగ అవుతుందేమో కూడా అలోచించ ప్రార్థన.

Jai Gottimukkala చెప్పారు...

మహానుభావుడు పైడి తెరేశ్ బాబు ఎప్పుడో అన్న విషయం మళ్ళీ గుర్తుకొస్తుంది:

"కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము"

అజ్ఞాత చెప్పారు...

తెల్లారి లేస్తే టీవీ చర్చలలో పాల్గొనే బండారు వారికి తెలియకనా?? సాక్షి టీవీ మాత్రం ఉపయోగకర చర్చలు చేసేస్తొందా? అందరివీ జగన్నాటకంలో పాత్రలే :)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: నేను టీవీ ల గురించి వ్యాఖ్యానించలేదు. మంచి అంశాన్ని చర్చకు తీసుకున్నారని కూడా రాసాను. చిన్న పోస్ట్ పూర్తిగా చదివి వ్యాఖ్యానిస్తే బాగుంటుందేమో ఆలోచించుకోవాలి.

అజ్ఞాత చెప్పారు...

I don't think anyone watches these falthu discussions on TV nowadays.

Bonagiri చెప్పారు...

విషయం పట్ల అవగాహన పెంచడానికైతే పార్టీ నాయకులని ఆహ్వానించకూడదు. సీనియర్ పాత్రికేయులని, ఆ సబ్జక్ట్‌లో నిష్ణాతులని పిలిచి చర్చిస్తే ఉపయోగం ఉంటుంది. కాని అలాంటి కార్యక్రమాలకి రేటింగులు రావు కాబట్టి అలా చెయ్యరు. ఈ విషయంలో ETV న్యూస్ కొంచెం బెటర్, కాని వాటిని ఎంతమంది చూస్తారో నాకు డౌటే!

అజ్ఞాత చెప్పారు...

శ్యామల్ సార్. ఒక డౌటు. చేపలు అంత దుర్వాసన వస్తుంది అయినా ఎలా తింటున్నారు ప్రజలు.

అజ్ఞాత చెప్పారు...

తెలుగు ఛానెల్లు చేసే అతి ఎవ్వరూ చేయరు. కేరళ లో వరదలు తమిళనాడు బుచికి రాజకీయాలు ఒకటేమిటి అన్నిటి మీదా పుయ్యామ్ పుయ్యామ్ చర్చలు. అదే వేరే భాష ఛానెల్స్ లో తెలుగు వాడిని పట్టించుకోరు.ఒక వైపు జబర్దస్త్ బిగ్ బాస్ లాంటి జుగుప్సా పోగ్రామ్స్. ఇంకోవైపు దిక్కుమాలిని దరిద్రగొట్టు సీరియళ్లు. ధూ నీయవ్వ. టీవీ చూడలనంటేనే కంపు.

సూర్య చెప్పారు...

అదేదో సినిమాలో డైలాగ్ "అమ్మేసేయ్యండి బాస్!"

సూర్య చెప్పారు...

అది ప్రజలనడగండి. ఆయన్నడిగితే ఎలా. ఇదిగో ఇలాగే చర్చలు పక్కదారి పట్టేది!