24, అక్టోబర్ 2016, సోమవారం

ఈ భోగం ఎన్నాళ్ళు?

రాత్రంతా సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు సంచరిస్తున్నట్టుగా చప్పుళ్ళు. తెల్లారి బాల్కానీనుంచి కిందికి చూస్తే నల్ల తివాచీ పరిచినట్టు కొత్త రోడ్డు. 


కాంట్రాక్టర్ ఎవడో మంచివాడులాగా వున్నాడు, ఎవరికీ ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో పని పూర్తిచేశాడు. మూడు పొరల్లో వేశాడు. పైకి దిట్టంగానే కానవస్తోంది.
‘అయినా ఈ భోగం ఎన్నాళ్ళులే, గట్టిగా ఒక వాన పడిందాకనే’ అంటున్నాడు పక్క పోర్షన్ ఆయన. ఎవరి అనుమానాలు వాళ్ళవి. అందుకే లోగడ చెప్పుకున్నట్టు ప్రతి రోడ్డు పూర్తి చేయగానే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పేరు, పర్యవేక్షణ చేసిన అధికారి వివరాలు, ఫోను నెంబర్లు, రోడ్డు ఖర్చు, వేసిన తేదీలతో సహా అక్కడే రోడ్డు పక్కన బోర్డులు పెట్టిస్తే ఆ రోడ్డు మంచి చెడుల బాధ్యులను నిర్ణయించినట్టు అవుతుంది. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు.

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఓ వానపడేంత వరకు "ఈ భోగం" ...... 🙁🙁

Zilebi చెప్పారు...
ఈ భోగమ్మెన్నాళ్ళో!
నాబోరుండో జిలేబి నాన్నా ళ్ళైనన్ !
ఓ బోర్డిట నుంచవలెను
కాబోలు విషయము తెలియ కాంట్రాక్టరుడిన్ :)

జిలేబి