17, అక్టోబర్ 2016, సోమవారం

పరమ రోత టీవీ ప్రోగ్రాం


పూర్వం వీధి నాటకాల్లో కేతిగాడు అనేవాడు రంగ ప్రవేశం చేసి తన వెకిలి చేష్టలతో గ్రామీణ ప్రజల్ని నవ్వించేవాడు. ఈటీవీలో ఓ ప్రోగ్రాం వస్తోంది. దాన్ని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. ఈ ప్రోగ్రాం, పేరేమిటో తెలియదు కాని, ఇందులో ఒకరా ఇద్దరా అనేకమంది కేతిగాళ్ళు. వీళ్ళ చేష్టలు, ఆకారాలు వెకిలిగా, వికృతంగా వున్నాయి. దీనికి తోడు ఆ కార్యక్రమానికి జడ్జీలుగా వచ్చిన ప్రసిద్ధ నటీనటులు పగలబడి నవ్వుతుండడం చూసి మరింత రోతగా అనిపించింది. దీన్ని నేను ఇంతవరకు చూడలేదు, కానీ వింటూ వస్తున్నాను. రామోజీ రావు గారు తమ ఛానల్లో వచ్చే ప్రతిదీ చూసి ఓకే చేస్తారని చెబుతుండగా విన్నాను. నేను విన్నది నిజం కాదేమో అనిపిస్తోంది ఇది కొన్ని సెకన్లపాటు చూసిన తరువాత.

6 కామెంట్‌లు:

శశి కుమార్ చెప్పారు...

శ్రీనివాస గారు,
హహ!! ఆ కార్యక్రమం జబ్బర్దస్త్ ఖతర్నాక్ కామెడి షో. మొదట్లో బాగానే ఉండేది, కాని రాను రాను ఛండాలంగా తయారైంది.
అందులో మగవారు ఆడవాళ్ళ వేషాలతో వస్తారు, చూసి భరించలేము!!

నిజంగానే ఆ కార్యక్రమం రోత కాదు కాదు పరమ రోతగా మారిందండి.

అజ్ఞాత చెప్పారు...

టి ఆర్ పి ఎక్కువ ఉన్న ప్రోగ్రామ్. అంటే చాలా మంది చూస్తున్నారని, మీరేమో బాగాలేదు, వెకిలిచేష్టలు అని తేల్చేస్తున్నారు.
నిజంగా ఆ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది.
జనరేషన్ గాప్ అని అనిపించడం లేదు మీకు ???

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హ హ్హ హ్హ హ్హ, భలే ఉదాహరణ ఎంచుకున్నారు శ్రీనివాస రావు గారు 😀. ఈ ప్రోగ్రాం కన్నా భయంకరమయిన ప్రోగ్రాం - వెకిలితనం యొక్క భయంకరమయిన లెవెల్ - తగల్లేదు (నేనూ ఈ ప్రోగ్రాం చూడను. విన్నదాన్ని బట్టి చెబుతున్నాను). దీంట్లో వేసే నటులు వేరే ఛానెల్లో కూడా చొరబడినట్లున్నారు. "ఈటీవీ ప్లస్" ఛానెల్లో కూడా వీళ్ళు కనిపిస్తారు, అందువల్ల ఆ ఛానెల్ చూడడం కూడా బంద్.
"బోల్డన్ని కబుర్లు" (లలిత TS గారు) బ్లాగులో శ్యామలీయం గారు ఈ మధ్య ఓ సినిమా గురించి అన్నట్లు ఈ ప్రోగ్రాముల్ని కూడా "హారర్" గా వర్గీకరించాలేమో 🙂.

voleti చెప్పారు...

1.వర్తమాన కాలానికి వర్ధమాన జనాలకి తగిన కార్యక్రమం..
2 నటులకు..యాంకర్లకు అవసరం కంటే ఎక్కువ డబ్బులు..కీర్తి సంపాదించి పెట్టే కార్యక్రమం..
3.హాస్యం కనిపించని కామెడీ(?)కార్యక్రమం..
4.సెన్సారు కటింగ్ లేని నీచ కార్యక్రమం...
5.పిల్లలతో కూడా శృంగార సంభాషణలు చెప్పించి...డాన్సులు వేయించారు మొన్న దసరా రోజున ..

అజ్ఞాత చెప్పారు...

One feels like vomiting on seeing this sickening show. Ramoji should feel ashamed of himself for promoting jabardast. Atrocious peogram

Zilebi చెప్పారు...ఈటీవీ మాటీవీ
యేటీవీ యైన నేమి యేతావాతా
పోటీ జిలేబి‌‌ పోటా
పోటీ!మా యేబియెన్ను పోకకు పోటీ !

జిలేబి