23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది? – భండారు శ్రీనివాసరావు

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది? – భండారు శ్రీనివాసరావు
( 24-09-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 


‘విధులకు గైర్హాజరు అవుతే తెలంగాణా వస్తుందా?’ అని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కోర్టు సిబ్బందిని ప్రశ్నించినట్టు పేపర్లలో వచ్చింది.

సకల జనుల సమ్మె జరుగుతున్నా రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మరో పక్క కితాబు ఇచ్చారు. ఇంకో అడుగు ముందుకు వేసి, వొత్తిళ్ళ ద్వారా కేసీఆర్ తాననుకున్నది సాధించాలనుకుంటే అదెలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు. పరిస్థితులు ప్రశాంతంగా వుండి తమకు అనుకూలంగా వున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటామని అన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది.

రాష్ట్రంలో తెలంగాణా సాధనకోసం దాదాపు వారం రోజులనుంచి దశలవారీగా సకల జనుల సమ్మె సాగుతున్న నేపధ్యంలో వెలువడిన ఈ రకమయిన వ్యాఖ్యానాలకు ఎవరికి వారు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు పార్టీ ప్రతినిధిగా కాకుండా వ్యక్తిగత హోదాలో చేశామని మరో రోజు సమర్ధించుకోవచ్చు. ఆ సంస్కృతి ఈ నాటి రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ, సకలజనుల సమ్మె ఓ పక్క ఉధృతంగా సాగుతున్న సమయంలో, భావోద్వేగాలు బాగా పెచ్చరిల్లి వున్న తరుణంలో - ఈ రకమయిన వ్యాఖ్యలు వెలువడ్డాయంటే కొద్దో గొప్పో అధిష్టానం మద్దతు లేకుండా ఆమె తన మనసులోని భావాలు బయట పెట్టి వుంటారని అనుకోవడానికి లేదు.

సకల జనుల సమ్మె అనుకోకుండా మొదలయింది కాదు. దీనిని గురించి కడు వివరంగా ఉద్యమకారులు చాలా ముందస్తు సమాచారం ఇచ్చే దాన్ని మొదలు పెట్టారు. అయితే, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తమ రివాజు ప్రకారం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టులేదు. కానీ రాష్ట్రంలోని తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడుపడని వ్యవహారంగా తయారయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇతమిద్ధంగా తన విధానాన్ని స్పష్టం చేయకపోయినా, అంత సానుకూలంగా వెంటనే స్పందించే అవకాశాలు మృగ్యమని అప్పడప్పుడు ఢిల్లీ నుంచి వెలువడే ఈ మాదిరి ప్రకటనలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు మధ్య మధ్య వారి నాయకులు చేసే ప్రకటనలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. సకల జనుల సమ్మె విజయవంతంగా, ఉధృతంగా సాగుతోందని బాజా భజాయించి చెప్పగల పరిస్థితులు వున్న నేపధ్యంలో మరోసారి కేసీఆర్ నిరాహారదీక్షకు పూనుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ నెలాఖరులో హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చి ఇక్కడి పరిస్తితులను అంచనావేసి పార్టీ అధినాయకురాలికి ఇచ్చే నివేదికే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఆజాద్ కు కొట్టిన పిండి. ఆయన హైదరాబాద్ పర్యటనలో కొత్తగా తెలుసుకుని నాయకురాలికి నివేదించే అంశాలు కొత్తగా ఏముంటాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. సీమాంధ్ర నాయకులతో ఆయన ఇప్పటికే అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. తెలంగాణాకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.

‘ఇలా’ చేయడంవల్ల తెలంగాణా వస్తుందా? అని ఎద్దేవాగా అడగడంలో బహుశా అంతరార్ధం ఇదేనేమో.వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. ‘ఊ’ కొడుతూ కధ వింటున్న పిల్లలు ‘ఊ’ అంటారు. ‘ఊ’ అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న. అది అర్ధం కాని పిల్లలు ‘ఆ!’ అంటారు. ‘ఆ!’ అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (20-09-2011)

49 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గదేం మాకు తెల్వద్, మాది మాగ్గావాలె.
తెలంగాన ఎప్పుడొస్తుంది సారూ?

గియ్యకుంటే దంచుడే దంచుడు, తలలు నరుక్కోవడం, ర్క్తాలు పారించడం, భూకంపాలు, సునామీ, తుఫానులు, భాగో-జాగో, అలాయ్-భలాయ్, ఆటా-పాట, వంటా-వార్పు, గానా-బజానా , సంబురాలు, డప్పు కొట్టుడు ... చేస్తం, గప్పుడు సెగ ఢిల్లీ దాకా తగిలి జేజమ్మ దిగి వస్తది. :))

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Snkr- జనం తలచుకుంటే సాధ్యం కానిదేముంది? కానీ అంతా రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టి ఆకులు పట్టుకుంటే లాభమేమిటి?

అజ్ఞాత చెప్పారు...

తెలంగాణా కేవలం రాజకీయ పరమైన చర్యలు (ఎన్నికలు, దీక్ష వగైరా) వల్ల రాదని డిసెంబర్ 10 న తేలిపోయింది. ఉద్యమం ద్వారానే తెలంగాణా వస్తుంది. ఎద్దేవా చేసే వారికి ఈ విషయం మళ్ళీ ఇంకొక రోజున గుర్తు చేస్తాం.

న్యాయ మూర్తి గారికి highcourt bench కోసం ఆంధ్ర advocateలు చేసిన సమ్మె గురించి తెలయక పోవడం విడ్డూరం :)

అజ్ఞాత చెప్పారు...

నిజమేనండి రాష్ట్రంలో మెజారిటీ 'జనం' అనుకుంటే అవుతుంది.
పాపం జనాలు అనుకోవడానికేమిలేండి, రూపాయకు కెజి బియ్యం, లీటరు కిరోసిన్, లీటరు వంటనూనె, కిలో చికెన్, ఉచిత విద్యుత్ కూడా కావాలనుకుంటారు... తప్పులేదు. మన పెజాస్వామ్యం గొప్పది.

'ఇచ్చేది అమ్మే, తెచ్చేది?!' ... ఇది ముందు తేలొద్దూ? :)

Praveen Mandangi చెప్పారు...

తెలంగాణా ఇవ్వకపోతే కాంగ్రెస్‌ని ఎలా సమాధి చెయ్యాలో తెలంగాణా ప్రజలకి తెలుసు. కాంగ్రెస్‌కి తెలంగాణా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే బాన్స్‌వాడ ఉప ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టింది.

అజ్ఞాత చెప్పారు...

సకల జనులు సమ్మె చేస్తే తెలంగాణా వస్తుందా?
రాదు.
ఒత్తిడికి మేం లోంగం.
రాజీ నామాలతో తెలంగాణా వస్తుందా ?
రాదు.
( రాజీ నామాలతో వచ్చిన తెలంగాణా పోతుంది కానీ )
ఎం చేసినా తెలంగాణా రాదు.
ఆంద్ర కాంగ్రెస్ నేతలు ఏదో వోట్ల కోసం తెలంగాణా కు మేం అనుకూలమే అని
అన్నారు, వోల్లెక్కల వాగ్దానాలు చేసారు ... వాటిని పట్టుకుని నిజమని ఆశపడితే ఎట్లా.
తెలంగాణా నేతలు ఒక నేతలేనా ...!
ఆంద్ర బడా బాబుల మోచేతి నీళ్ళు తాగుతూ కుక్కల్లా పడి వుండే తెలంగాణా నేతలు
ఆడే దొంగ నాటకాల తొ తెలంగాణా చచ్చినా రాదు.
ముందు వాళ్ళ ను బొంద పెడితే తప్ప తెలంగాణాకు మోక్షం లెదు.
Rajesh Hyd

సురేష్ చెప్పారు...

ఒక రాష్ట్రం విడగొట్టాలంటే ఒక ప్రాతిపదిక కావాలి. ఇక వ్యతిరేకత ఉంటే మరింత తప్పనిసరి. వెనుకబాటుతనం, వివక్ష, దోపిడి వంటివి ఉత్త అపోహలే అని ఇటీవల శ్రీకృష్ణ కమిటీ తేల్చి చెప్పింది. భాష ప్రయుక్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికా లేకుండా ఎలా విడగొట్టడం? నాయకులు తిట్టుకుంటున్నారనా? జీతాలు పెంచేసుకోవచ్చనా? తోచినంతమందికి ఉద్యోగాలు ఇచ్చేసుకోవచ్చనా? ఓ వ్యక్తి నిరాహార దీక్ష చేస్తున్నాడనా? కొంతమంది చనిపోయారనా? అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరుకుతారనా? బందులూ గట్రా చేస్తున్నారనా? సహేతుకమైన కారణాలని వెతికి తీయాల్సిన బాధ్యత దాన్ని ఢిల్లీ దగ్గర వినిపించే బాధ్యత ఈ ప్రాంత నాయకులది. అది మాని ఇంట్లో కూర్చుని ఆ ప్రొఫెస్సర్ చేత బందులూ గట్రా చేయిస్తే తెలంగాణా రాదు, ప్రజలకి కోపమొస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

సురేష్
మనది ఒక రాష్ట్రం కాదు
దొంగ వొప్పందాలతో మోసపూరితంగా ఒక గూటికిందకు చేర్చబడ్డ రెండు రాష్ట్రాలు !
మొదటి నుంచీ తెలంగాణా వేరు ఆంద్ర వేరు
ముందు అది గుర్తించు.
ఇతర రాష్ట్రా ల పరిస్థితి వేరు మన రాష్ట్రం పరిస్థితి వేరు.
దొంగ వొప్పందాలు , అమలు కాని హామీలు, మోసపూరిత జీవోలు, అమ్ముడు పోయే కమిటీలు కమిటీలు లాబీయింగులు , వంచనలు
ఇంకా ఎంతకాలం తెలంగాణాను దోచుకు తింటారు.
తెలంగాణా తన అస్తిత్వాన్ని తను కోరుకుంటోంది.
ఆంద్ర పెట్టుబదిదార్లు, రాజకీయ ముసుగులో వున్నా బందిపోటుదొంగలు, ప్రజాస్వామిక విలువలు ఏమాత్రం లేని గోముఖ వ్యాఘ్రాలు ఇక ఎంతోకాలం తెలంగాణా రాష్ట్ర పునరుద్ధరను ఆపలేవు
తెలనగాన రాష్ట్ర ఏర్పాటు తధ్యం
Rajesh, Hyd

సురేష్ చెప్పారు...

@ అజ్ఙాత: మీరు చెప్పినవన్ని అపోహలే అని కమిటీ తేల్చాకా మళ్ళీ అవే ప్రస్తావించి ప్రయోజనమేమిటి? నాకు నచ్చని వాళ్ళందరూ దొంగలే, నాకు నచ్చనివన్నీ దొంగవే అనే పోకడ, ఒక వూళ్ళో నడుస్తుందేమో గానీ ఢీల్లీలో నడవదు. ఇవన్నీ నాయకులు మనలాంటి వాళ్ళకి చెప్పే కబుర్లు. ఇప్పటికైనా వాళ్ళు ఇలా పసలేని వాదనలు కాకుండా, పఠిష్టమైన వాదనలని ఢిల్లీలో వినిపించినప్పుడే తెలంగాణా సాధ్యం. లేకపోతే బీజేపీ వొచ్చినా విడగొట్టడం కష్టం.

అజ్ఞాత చెప్పారు...

సురేష్ బాగా చెప్పారు. ఈ ఎదవలు చూపించే సహేతుక కారణాలు:
1) ధర్మ పెబువు నిజాం మమ్మల్ని పాలించిండు, మిమ్మల్ని బిటీసోల్లు పాలించిన్రు.
2) మేం బిరియాని తింటాము, మీరు గోంగూర తింటారు
3) మేము ఉర్దూ కల్తీ చేసి మాట్లాడతాం, మీరో....
4) మా బాస, గోస వేరు
5) మీకు బతుకమ్మ ఆడటం వచ్చా?
6) మాకు పోతరాజులున్నారు, మీరు దసరా పులేషాలేస్తారు
7) మాకు సెంటిమెంటుంది, మీకు లేదు

ఇవి చాలవూ, లాగిపెట్టి/ఈడ్చి నాలుగు రాష్ట్రాలు ఇవ్వడానికి?!

అజ్ఞాత చెప్పారు...

సురేష్
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక, దాని సీక్రెట్ ఎనమిదో చాప్టర్ మీకు సహజంగానే ఉత్తేజం ఇస్తాయి.
దానిని తెలంగాణలో ఎవరూ చిత్తు కాగితాల్లా భావించి ఎప్పుడో చెత్త బుట్టలో పారేశారు.
కేంద్ర ప్రభుత్వం కూడా దాని పక్కన పెట్టి ఆజాదు తో సంప్రదింపుల కొత్త నాటకానికి తేరా లేపింది.
1956 కు ముందు నుంచీ ఇప్పటి వరకూ దిల్లీలో దగా పడ్డ తెలంగాణా మాటకు చిల్లి గవ్వ విలువ లేదు.
బలిసిన మీ నేతల లాబీయింగ్ ముందు మా తెలంగాణా లత్తకోరు నేతల లాబీయింగ్ బలాదూరే. !
కానీ ఇప్పుడు ఇక తెలంగాణా ప్రజలే నడుం బిగించి మా నేతలను , ధిల్లీ ని శాసిస్తున్నారు.
ఎప్పటికైనా ప్రజలదే విజయం. చూస్తూ వుండండి
ఒర్ చకరా మూతి వంకరా .
ఎవడ్రా ఎదవలు. ఎం పిచ్చి రాతలు రా .
ఇవాలా తెలంగాణా లో సకల జనులు ఉద్యమిస్తున్నా ఈ చెత్త వాగుడేమిటి
ఫూల్
ఈ కుక్క మొరుగుడు ఎంతకాలం మొరుగుతావ్ ఎం సాధిస్తావు.
Rajesh hyd

సుజాత వేల్పూరి చెప్పారు...

Snkr..:-))

John చెప్పారు...

‎'సకల జనుల సమ్మె' చేస్తున్నామురా బై, అంటే పనులు మానేసి గోళ్ళు గిల్లు కుంటూ కూర్చుంటామన మాట..
ఒరేయ్ నువ్వు మన ఉ రు కి కరెంట్ తీసేయ్, నువ్వు మంచి నీళ్ళు ఆపెయ్, RTC వాళ్ళకు బస్సులు వొద్దని చెప్పండి, మీ పిల్లల్ని స్కూళ్ళ కి పంపింఛొద్దు, మన ఆడోళ్ల ని వంటలు మానేసి 'బతుకమ్మ' ఆడుకొ మనండి, మీరు ఉద్యోగాలు మానేసి 'గో టి బిళ్ళ' ఆడుకోండి.. దెబ్బకి డిల్లీ లో 'జేజమ్మ' దిగి వొస్తుంది.....
"అన్నా..ఇవన్ని చేస్తే తిండి, చదువులు, పనులు లేక మనము సన్నసుల్లా తయారవుతాము కానీ.. డిల్లీ లో 'జేజమ్మ' కి ఎం ఫిక్ ర్..??"

అజ్ఞాత చెప్పారు...

@సురేష్:

ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్ష కంటే మించిన ఏ ప్రాతిపదిక లేదు. విడి పోతామని ముక్త కంఠంతో ఘోషిస్తున్న ప్రజలను బలవంతంగా తుపాకీ నీడలకింది కలుపుకుందామనే ఈ మూర్ఖ ప్రయత్నం మానుకోవడం అందరికి ఉత్తమం.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాన విడిపోతం అని ఒక వైపువాళ్ళే చెబుతున్నారు, అదీ అభివృద్ధి చెందిన రాజధానిని తీసుకుని విడిపోతాం అంటున్నారు, వదిలేసి, త్యాగం చేసి విడిపోతాం అంటే పట్టుకునేవాళ్ళు ఎవరూ వుండరు. చైనా ఫండ్స్ తింటున్న చాలామంది దేశద్రోహులు విడగొట్టే పని మీద వున్నారు. కాశ్మీరు, పంజాబ్, గూర్ఖాలాండ్, విధర్బ, బోడోలాండ్ ... ఇట్లా విడిపోతానికి చాలామంది వున్నారు. రౌతు ఎదవ అయితే గుర్రం ముందుకాళ్ళమీద పరుగెత్తుతానండం మామూలే. ఏ పోలీసు చర్యతో ఇండియాలోకి విలీనం చేయబడ్డారో, అదే పోలీసుచర్యకే ఈ సెంటిమెంటుకు తగిన పరిష్కారం దొరుకుతుంది, అదే జరగబోయేది.

మొదట రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి, NSA clearence ఇవ్వాలి, Central Home minstry Okay చేయాలి, ఆతరవాతే పార్లమెంటులో బిల్లు అమోదించబడుతుంది. అంతవరకూ రోడ్లమీద, పట్టాలమీద పడి వంటా-వార్పు అనేది మీకుతప్పదు, చూసి 'థూ' అనుకోవడం మాకూ తప్పదు. జాగర్త, ఆ సికింద్రాబాద్, నాంపల్లి పట్టాల మీద నడిచేదే చూసుకు నడవాలి, మరి మీరు వంటలు చేసుకుంటారంటే అతి జుగుప్త్సాకరమైన విషయం.

Praveen Mandangi చెప్పారు...

కింది అజ్ఞాతా, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్‌గా హైదరాబాద్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన ఢిల్లీ నగరంలోనూ నెలకి కేవలం 1500 సంపాదించే మురికివాడ వాసులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదరికం ఇంకెంత ఎక్కువగా ఉంటుందో ఊహించుకో.

Praveen Mandangi చెప్పారు...

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించినది. అసెంబ్లీలో దాని గురించి బిల్ పాస్ చేసే అధికారం అసెంబ్లీకి లేదు. నీకు చట్టాల గురించి బొత్తిగా తెలిసినట్టు లేదు.

Praveen Mandangi చెప్పారు...

దొంగ నాటకాల రాయుడైన చిదంబరం తెలంగాణా ఇవ్వడం ఇష్టం లేకే అసెంబ్లీలో తీర్మానం పెట్టమన్నాడు కానీ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పరచడానికి రాజ్యాంగం రూపొందించిన mandateలో అసెంబ్లీ తీర్మానం అనేది లేదు అని చిదంబరానికి తెలుసు.

అజ్ఞాత చెప్పారు...

{నెలకి కేవలం 1500 సంపాదించే మురికివాడ వాసులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదరికం ఇంకెంత ఎక్కువగా ఉంటుందో ఊహించుకో}
అంటే ఏమంటావ్, 1500రూ లోపుల కాలనీలన్నీ రాష్ట్రాలుగా చేసేయమంటావా? తలాతోక లేకుండా మాట్లాడుతున్నావు ఎవరయ్యా నీవు? నీ బుర్ర కాకెత్తుకెళ్ళ, ఎవడోయ్ నీకు చదువుచెప్పిన గాడిద? పేడరికం వుంటేనే కదా మీలాంటి పరాన్న జీవులు, పేడపురుగులు బ్రతికేది?

Praveen Mandangi చెప్పారు...

పైపై హంగులు చూసి దాన్నే అభివృద్ధి అనుకునేవాళ్ళకి సామాజిక అభివృద్ధి గురించి ఏమి అర్థమవుతుంది?

అజ్ఞాత చెప్పారు...

సామాజిక అభివృద్ధి దేశ సమస్య, సమాజం సమస్య. మీలాంటి వాళ్ళ మానసిక అభివృద్ధి మాటేమిటి? మీలాంటీ మావోటపోరీలను కని అలా బ్లాగుల్లో వదిలేసిన వారి సామాజిక బాధ్యత ఏమిటి? 100 తెలంగాణాలొచ్చినా అది తీరుద్దా?

అజ్ఞాత చెప్పారు...

అభివ్రుద్ధి అంటే ప్రతొక్కళ్ళూ ధనవంతులవ్వాలనే పిచ్చి రూల్ పెట్టుకోని విడిపోతే మనదేశాన్ని వెయ్యి ముక్కలు చెయ్యొచ్చు.Development is relative just like many otherthings in life. హైదారాబాద్ లో కనిపించని అభివ్రుద్ధి కోస్తాలో కనిపించిందా తెలంగాణా వాదులకి?
Ths movement is basically a hate movement. Xenophobia. Tryng to find reason or rationle is foolish in this movement.

Praveen Mandangi చెప్పారు...

నెలకి 1500 రూపాయలు సంపాదించేవానికి జీవితంలో కనిష్ఠ అవసరాలే అందవు. అతను ధనవంతుడవ్వడం సంగతి లేని దేవునికే తెలుసు.

Praveen Mandangi చెప్పారు...

అభివృద్ధి ఫలాలు మాకే అందాలి కానీ మీకు అవసరం లేదు అని వాదించే సమైక్యవాదుల కోసం తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ని త్యజించాలంటారు, అంతే కదా.

అజ్ఞాత చెప్పారు...

"నీ బుర్ర కాకెత్తుకెళ్ళ" - అతడి బుర్రను ఆల్రెడీ కాకెత్తుకు పోయింది. పైనున్న టొపారం, మోకాళ్లు, అరికాళ్లు అన్నీ ఖాళీయే! ఖాళీగా రికామీగా ఇలా బ్లాగుల్లో తిరుగుతూ ఉంటాడు.

అజ్ఞాత చెప్పారు...

నువ్వెందులో ప్రవీణుడివో నాకు తెలియదు కానీ ప్రతిదానికి నీకు నచ్చిన అర్థం లాగి అసంధర్భ వ్యాఖ్యలు చెయ్యటంలో మాత్రం నిన్ను మించినవాడు లేడు. అంతా మాకే కావాలని సమైక్యవాదులెప్పుడన్నార్రా చీకాకుళం చిన్నోడా?
అయిన అడిగిందానికి జవాబు చెప్పవే..హైదరాబాదులో లేని అభివ్రుద్ధి కోస్తాలో నీకెక్కడ కనిపించింది? అలాగే పేద వాళ్ళెవరూ నీకు కోస్తాలో కనిపించలేదా?

మాటల్తో కాకా అంకెల్లో చూపెట్టు.
అసలు డెవెలొప్మెంట్ అనే మాటని తెలంగాణా వాదులే వదిలేసి చాలా కాలమైంది. నువ్వెందుకు పట్టుకోని వేళ్ళాడతావ్?
తెలంగాణా ది తెలుగు కాదని వాళ్ళే అనుకుంటున్నారు. సరిగా విను. వాళ్ళ భాష తెలంగణా అట.
There is no salvation or mercy for those who are suffering from inferiority, hatred and xenophobia.

Praveen Mandangi చెప్పారు...

కేవలం హైదరాబాద్‌ని అభివృద్ధి చేసి దాన్నే రాష్ట్ర అభివృద్ధి అని నమ్మించిన నాయకులకి కోస్తా ఆంధ్రలోనైనా, తెలంగాణాలోనైనా పేదవాళ్ళు కనిపించరు. అభివృద్ధి చెందిన జిల్లా అయిన కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో గంటకి ఇరవై రూపాయల కోసం మగవాళ్ళతో పడుకునే అమ్మాయిల గురించి ఒక ఇంగ్లిష్ పేపర్‌లో వార్తొచ్చింది. కేవలం కడుపు నింపుకోవడానికి వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నంత పేదరికం కోస్తా ఆంధ్రలో ఉంది. కేవలం హైదరాబాద్‌నే అభివృద్ధి చేసి దాన్నే రాష్ట్ర అభివృద్ధి అని నమ్మిస్తే గుడివాడ లాంటి పట్టణాలలో దుర్భర జీవితాలు గడుపుతున్న వేశ్యల జీవితాలు గానీ గుంటూరు దర్గా దగ్గర గాజులు అమ్ముకునేవాళ్ళ జీవితాలు గానీ మారిపోతాయా?

అజ్ఞాత చెప్పారు...

నీ తలకాయ్! అందరూ అనేమాట అదే కదరా?సూర్య చంద్రుల్లాగా పేదరికమనేది యూనివర్సల్. ఒక్క తెలంగాణాలోనే ఉన్నట్టు వాగుడెందుకు.
ఇంతకీ ఎమి చెప్పదల్చుకున్నావు నువ్వు?

అజ్ఞాత చెప్పారు...

..అన్నట్టు ఫోటో బావుంది ప్రవీణు. వాటిల్లో నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో రాదూ?

Praveen Mandangi చెప్పారు...

పేదరికం కోస్తా ఆంధ్రలోనూ ఉంది. కేవలం హైదరాబాద్‌నే అభివృద్ధి చేసి దాన్ని మాత్రమే రాష్ట్ర అభివృద్ధి అని నమ్మితే పేదరికం పోదు అన్నాను కానీ తెలంగాణాలో పేదరికం లేదు అని అనలేదు. పేదరికం ఇప్పుడు యూనివర్శల్ కావచ్చు కానీ చరిత్ర గమనంలో అది ఎటర్నల్ కాబోదు.

అజ్ఞాత చెప్పారు...

..హైదారాబాదు అభివ్రుద్ధే రాష్ట్ర అభివ్రుద్ధి అని ఎవరన్నారు? కాదు కాబట్టే కదా కేవలం ఒక ప్రాంతమే వెనకబడింది..కాబట్టి విడిపోతాం అంటే అది అసంబద్ధం, అహేతుకం అనేది.

Praveen Mandangi చెప్పారు...

మీ సమైక్యవాదులు తెలంగాణా వెనుకబడలేదని చెప్పడానికి అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణాలో ఉందంటున్నారు కదా. ఒకవేళ హైదరాబాద్ కోస్తా ఆంధ్రలో ఉన్నా ఇక్కడ కోట్లాది మంది జీవితాలు బాగుపడవు.

అజ్ఞాత చెప్పారు...

.. ఇంతకీ హైదారాబాదు అభివ్రుద్ధి చెందిందంటావా? కాదని కాసేపటి క్రితమే గా అన్నావ్?
ఊరికినే అడిగాన్లే..మనసు పాడు చేసుకోకు ప్రవీణు.నీ మాటలు నీకే అర్థం కావు..ఆ మాత్రం మాకు తెలవదా ఏంటి?

ఇంతకీ ఆ ఫోటోలో నువ్వెవరు? గుర్రానివా? పక్కనున్న గడిదవా? పైనున్న టొపీవా?

Praveen Mandangi చెప్పారు...

గుడ్డి గుఱ్ఱాలకి పళ్ళు దోమే సమైక్య గాడిదలకి మనుషులు గాడిదలలాగే కనిపిస్తారు.

అజ్ఞాత చెప్పారు...

.. సమైక్యవాదులు నీకు గాడిదల్లాగా కనిపిస్తే నువ్వు వాళ్ళకి ఇంకోలా ఎలా కనిపిస్తావులే ప్రవీణూ.
ఒక ప్రశ్నకే సమాధానమిచ్చావ్? ఇంతకె హైదరాబదు మన రాష్ట్రంలో అన్నిటికన్నా అభివ్రుధి చెందిందా, లేదా. తేల్చు ముందు.

Praveen Mandangi చెప్పారు...

రాష్ట్రంలో హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించదు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ హైదరాబాద్ మేడి పండు కోసమే కదా సమైక్యవాదులు వీధి పోరాటాలు చేస్తున్నది.

అజ్ఞాత చెప్పారు...

.....అందుకే నీ మాటలకి అర్థం ఉండదనేది. మరిందాకా హైదరాబాదులో అడుక్కుతినేవాళ్ళులేరా అని ఎందుకు సాగదీశావ్?
ఇప్పుడు మరి చెప్పు. అభివ్రుద్ధి అంతా హైదరాబాదులో వుంటే, అది పోతే మిగిలిన ప్రాంతాల వారికి నష్టం కాదా? అందులో ఏమన్యాయం కనిపించిదని నోటికొచ్చింది వాగుతున్నావ్?Dear MMK.

Praveen Mandangi చెప్పారు...

పట్టణంలో ఇంజినీరింగ్ కాలేజ్ కడితే పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకి త్రాగు నీరు వస్తుందా అని ఒక టివి కార్యక్రమంలో ఒక మహిళ అడిగింది. గుడివాడ లాంటి పట్టణాలలో కూటికి గతిలేక ఒళ్ళు అమ్ముకునేవాళ్ళు హైదరాబాద్ మేడి పండుని చూసి సంతృప్తి చెందుతారనుకుంటున్నావు కదా.

అజ్ఞాత చెప్పారు...

....అలా అని ఎవరనుకుంటున్నార్రా, పిచ్చోడా?
రాజధాని అందరిదీ అంటే, గుడివాడలో నీళ్ళొస్తాయా అంటూ వాగుతావు. రాజధానిని పోగొట్టుకోవటం ఎవరికిష్టముంటుంది? దాని అభివ్రుద్ధిలో అందరం భాగస్వామ్యులమే కాబట్టి వొదులుకోము..ఏమిటంత అన్యాతం కనిపించింది నీకు దాంట్లో?

Praveen Mandangi చెప్పారు...

నీ లాంటి గుడ్డి గుఱ్ఱానికి పళ్ళు తోమే రకాలే 'మా ప్రాంతంలో అభివృద్ధి జరగపోయినా ఫర్వా లేదు, రాజధాని అభివృద్ధి చూసి సంతృప్తి పడిపోతాం' అనుకుంటారు.

Praveen Mandangi చెప్పారు...

రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యకుండా హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసి ఆ ఒక్క నగరం యొక్క అభివృద్ధిని చూసి రాష్ట్ర ప్రజలందరూ సంతృప్తి పడాలంటే ప్రజలు సంతృప్తి పడడానికి వెర్రి వెంగళప్పలా?

అజ్ఞాత చెప్పారు...

....హైదరాబాదు బాగుంటే చాలు మాకేమి ఒరగకపోయినా పరవాలేదని ఎవరాన్నార్రా, మూర్ఖుడా..ముందు దానికి జవాబు చెప్పు. నీకు నువ్వే ఊహించుకోకు. అలాగే హైదరాబాదు అభివ్రుద్ధే రాష్ట్ర అభివ్రుద్ధన్న గన్నయ్యవడో చెప్పు. అసలు నీకు సమశ్యేమిటో కాస్తైనా అర్థమఔతోందా?

నువ్వే ఊహించుకుంటావ్,నువ్వే ప్రశ్శ్నలేసుకుంటావ్ కానీ సమధానం మాత్రం సమైక్యవాదులకంటావ్. ఎలా చావాల్రా నీతో!
జాగర్తగా విను..నీ పైరెండు సమాధానాలే ప్రశ్నకో తేల్చుకో ముందు.ఇక్కడున్నవాళ్ళెవరూ నిన్నాప్రశ్నలడగలేదు.

అజ్ఞాత చెప్పారు...

అనానిమస్సు ఇక ఆపుతారా? ఆ మెంటల్లీ రిటార్డ్ ఫెలోను ఎందుకలా కదుపుతారు? ఆడితో ఒకరిద్దరు తెలంగాణా బ్లాగర్లు మినహా ఎవరైన సీరియస్‌గా చర్చిస్తున్నారా? ఆయన్నలా అచ్చోసి వదిలేయండి.

అజ్ఞాత చెప్పారు...

అనానిమస్సు ఇక ఆపుతారా? ఆ మెంటల్లీ రిటార్డ్ ఫెలోను ఎందుకలా కదుపుతారు? ఆడితో ఒకరిద్దరు తెలంగాణా బ్లాగర్లు మినహా ఎవరైన సీరియస్‌గా చర్చిస్తున్నారా? ఆయన్నలా అచ్చోసి వదిలేయండి.

Praveen Mandangi చెప్పారు...

రాష్ట్రం గంగలో మునిగినా ఫర్వాలేదు, హైదరాబాద్ అభివృద్ధిని చూసి అందరూ సంతృప్తి పడాలనుకోవడం సమైక్యవాదుల స్టైల్ కాదా? కేవలం హైదరాబాద్ మీద ఆశతో రాష్ట్రాన్ని విభజించకూడదు అని వాదిస్తున్న మీకు అభివృద్ధి గురించి ఏమి అర్థమవుతుంది?

అజ్ఞాత చెప్పారు...

"..చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు" అనుత్తగనే అన్లేదు.మూర్ఖ ప్రవీణా పైన అజ్ఞాత చెప్పినట్టు నిన్ను అచ్చోసి ఒదిలేసాను ఫో..!

Praveen Mandangi చెప్పారు...

నువ్వూ, మీ సమైక్యాంధ్ర గజ్జి కుక్కల గురువు మలక్‌గాడూ ఎలాగూ అచ్చోసిన ఆంబోతులే కదా. తన ప్రాంతానికి చెందిన ఒక ఉప ప్రాంతంవాళ్ళనే చీకాకులం అడవులు అని తిడుతుంటాడు. వాడి వెనకాల ఉండేవాళ్ళకి అంతే ప్రాంతీయ గజ్జి ఉంటుంది.

అజ్ఞాత చెప్పారు...

@agnaatha: baabu meeku praveenu gurchi teleedu, aayana KDR ki KCR ki Lagadapati ki TG venkatesh ki advani ki vijayashanti ki crossing chesthe puttina maha rod, ayana edi chepthe adi vedam.

baagaa cheppaanu kada praveenu.

sambasivarao.nulu చెప్పారు...

"కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది".......ఈరోజు జరిగిందదే....బాగాచెప్పారు భండారువారు...