30, జూన్ 2021, బుధవారం
29, జూన్ 2021, మంగళవారం
84 ఏళ్ళ క్రితం ఎన్నికల ప్రచార కరపత్రం
1937 అంటే స్వాతంత్రానికి పదేళ్లు పూర్వం బ్రిటిష్ హయాములో జరిగిన ఎన్నికల్లో పంచిన ప్రచార పత్రం.
ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. ని కడుపుబ్బ నవ్వించిన 104 కాల్ సెంటర్ ఉద్యోగిని
సంతకం ఖరీదు అయిదు రూపాయలు – భండారు శ్రీనివాసరావు
ఇంచుమించుగా యాభయ్ ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..
28, జూన్ 2021, సోమవారం
చూసయినా నేర్చుకుందామా?- భండారు శ్రీనివాసరావు
27, జూన్ 2021, ఆదివారం
ఆడవారికి అంకితం – భండారు శ్రీనివాసరావు
యావత్ ప్రపంచంలో అతి గొప్ప సంపద సృష్టిస్తోంది ఆడవాళ్ళు. సందేహపడనక్కరలేని వాస్తవం ఇది.
ఎప్పుడో
మూడేళ్ల క్రితం నేను పాల్గొన్న ఓ టీవీ
చర్చ వీడియో ఎవరో పంపగా చూశాను. వారికి కృతజ్ఞతలు.
ఆడవాళ్ళ
మీద అత్యాచారాలు అనే అంశంపై చర్చ. దురదృష్టం, ఆ చర్చలో ఒక్క మహిళ కూడా లేరు. అలా కావాలని
చేయరు. పత్రికల్లో వచ్చే వార్తల మీద చర్చ కాబట్టి, పాల్గొనే వాళ్ళను అంతకు ముందు రోజే
నిర్ణయించుకుని పిలుస్తారు.
సరే!
విషయానికి వస్తే ..
మన
దేశంలోనే కాదు,
మొత్తం ప్రపంచదేశాల్లో అత్యధిక సంఖ్యలో పనివాళ్లు పనిచేస్తోంది వంటిళ్ళలో
ఆడవాళ్ళు. అదీ జీతం భత్యం లేకుండా. పైగా ఒక ఉద్యోగం కాదు. తల్లి, వంటలక్క, పనిమనిషి, ఆయా, స్కావెంజర్, ఇలా ఎన్నో రకాల పనులు ఒంటి చేత్తో
చేస్తోంది ఆడవాళ్ళు మాత్రమే. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా. వీరి కష్టానికి ఖరీదు
కట్టే షరాబు లేడు.
అటువంటి
వారిపై అత్యాచారాలు అనే మాటపై ఇలా ప్రతిసారీ చర్చలు జరగకుండా వుండే రోజుకోసం ఎదురు
చూద్దాం.
ఇదే
నేను ఈ వీడియోలో ఒకటి, రెండు నిమిషాల్లో చెప్పింది.
అవకాశం
ఇచ్చిన ఛానల్ వారికి కృతజ్ఞతలు.
ధన్యవాదాలు
చెప్పాల్సిన మరో మిత్రుడు
Video LINK
https://www.facebook.com/100009070493506/videos/2823189941326661/
26, జూన్ 2021, శనివారం
నాసికాశాస్త్రం – భండారు శ్రీనివాసరావు
ముక్కు వుంది చీదడానికే అని అదేపనిగా చీదేయకండి. ముక్కుతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయని ఓ ముక్కు శర్మగారు సెలవిస్తున్నారు. తలనొప్పిని అయిదే అయిదు నిమిషాల్లో ఎగరగొట్టే మహత్తర శక్తి ముక్కుకు వుందన్నది ఆయన మాటల తాత్పర్యం.
ఇంతకీ విషయం
ఏమిటంటే -
ముక్కుకు రెండు
రంధ్రాలు వుంటాయి. ఈ నిజం తెలుసుకోవడానికి ముక్కు శర్మగారు అవసరం లేదు. కానీ ఆయన
చెప్పేది ఇంకా వుంది. ఆ రెండు రంధ్రాల్లో ఎడమవైపుది చంద్రుడి స్థానం అయితే, కుడి వైపుది
సూర్యుడి స్థానం. బాగా తలనొప్పిగా వున్నప్పుడు కుడి రంధ్రాన్ని ఓ అయిదు నిమిషాల
పాటు మూసివుంచి ఒక్క ఎడమవైపు రంధ్రం ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటే తలనొప్పి
గాయబ్.
అంతేనా అంటే అంతే కాదు అంటున్నారు ముక్కు శర్మగారు.
బాగా
అలిసిపోయినప్పుడు ఎడమవైపు రంధ్రాన్ని చేతి వేలితో మూసి, కుడి వైపు రంధ్రం
నుంచి శ్వాస పీల్చి చూడండి. ఇక చూడండి, రిఫ్రెష్ బటన్
నొక్కినట్టు మనస్సు పాతిక లైకులు చూసినంత హాయిగా తాజాగా అయిపోతుంది (ట)
ప్రయత్నించి
చూస్తే పోయేదేమీ లేదు ఓ అయిదు నిమిషాలు టైం తప్ప.
స్టార్ట్ ....వన్
టూ త్రీ....
తోకముక్క: నెట్లో
ఈ సమాచారం ఇంగ్లీషులో పంపిణీ చేసిన దేవినేని మధుసూదన రావు గారికి కృతజ్ఞతలు.
దాన్ని స్వేచ్చగా తెలుగులోకి మార్చిన భవదీయుడికి (అంటే నేనే) అభినందనలు.