23, జూన్ 2024, ఆదివారం

క్వాలిటీ టైం



నెహ్రూ ప్రధమ ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో అనేక అంశాల మీద మేధావుల నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం ఒక పద్దతి పాటించేవారని ఆయన దగ్గర పనిచేసిన మత్తయ్ రాసుకున్నారు. (నెహ్రూ వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఇంకా చాలా రాశారు అనుకోండి. అవి ఇక్కడ అప్రస్తుతం)
దేశవ్యాప్తంగా నెహ్రూకు సలహాలు ఇవ్వగలిగిన స్థాయి కలిగినవారిని ఎంపిక చేసుకుని ప్రధాని కార్యక్రమాలకు అనువుగా వుండే రోజుల్లో, ఒక్కొక్కరినీ విడివిడిగా ఢిల్లీకి ఆహ్వానించేవారు. బ్రేక్ ఫాస్ట్ బల్ల మీద భేటీ జరిగేది. ఒక అంశం అని కాకుండా కబుర్లు చెప్పుకునేరీతిలో సంభాషణ సాగేది. బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసేలోగా ఏదో ఒక అంశంపై నెహ్రూకు అవసరమైన సమాధానం లేదా సమాచారం ఆ వ్యక్తి నుంచి అందేది. అవగాహన కలిగేది. ఇతరులు ఎవరూ వుండరు కాబట్టి , ఎలాంటి అంతరాయాలు లేకుండా వారిరువురూ నిష్కర్షగా చర్చించుకునే వీలుండేది. దాపరికాలు లేకుండా మాట్లాడుకునే అవకాశంవుండేది.
దీన్ని ఇప్పటి ఆధునిక కార్పొరేట్ పరిభాషలో క్వాలిటీ టైం అంటారుట

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

మోడీ గారు ఈ టెక్నీకు ని కాపీకొట్టి ఫాలో అవుతున్నారని విన్నామండీ సరియేనా ?

అజ్ఞాత చెప్పారు...

@Zilebi మీ గురించి .. మీ అసలు నామము, ఊరు లాంటి వివరాలు కాస్త చెపుతారా .. ఎందుకు ఇంకా దాగుడుమూతలు ..

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈసారికిలా “పోని”య్యండి అని “జిలేబి” గారి ఉద్దేశమేమో? 🙂