25, మార్చి 2019, సోమవారం

వై ఎస్ వస్తే రాష్ట్రం రావణకాష్టమే!


2004లో ఎన్నికలు ముగిశాయి. వై ఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. ప్రత్యర్ధి శిబిరం టీడీపీ తో  పాటు కాంగ్రెస్ లోని కొన్ని వర్గాల్లో కలవరం. వైఎస్ ముఖ్యమంత్రి అయితే ఎలా! ఈ రాష్ట్రం ఏమైపోతుంది. పార్టీలు సరే. అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా ఇదే కలవరపాటు. ఆందోళన.
పాత జానపద చిత్రాలలో రాజుగారి సైనికులు వూళ్ళపై పడి దోచుకునేవారు. ఆడవారిని చెరపట్టేవారు. ఇలాంటి సన్నివేశాలు దర్శనమిస్తాయని నోళ్ళు నొక్కుకున్నారు.  
కానీ తర్వాత ఏం జరిగింది. రౌడీ మూకలు వీధుల్లో స్వేచ్చావిహారం చేయలేదు. ఇళ్ళపై పడలేదు. ముఠాకక్షలు, కార్పణ్యాలు ప్రబలలేదు. హత్యలు, మాన భంగాలు జరగలేదు. అధికారులను వేధించలేదు. అసలు కర్ఫ్యూ అనేది గతకాలపు ముచ్చట అయింది. పై పెచ్చు అనేక కొత్త కొత్త ప్రజా  సంక్షేమ పధకాలకు ఆయన పాలనా కాలం ఒక సాక్ష్యంగా నిలిచింది.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాడు. ఎందుకంటే మనది రాజ్యాంగానికి కట్టుబడి నడిచే వ్యవస్థ కనుక.
ఈ మధ్య ఓ ఇష్టాగోష్టి సమావేశంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు ఈ సంగతి చెప్పారు.
కాబట్టి ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిందే. అంతే  కాని జానపద చిత్రాల్లో మాదిరిగా దుందుడుకు ధోరణితో పాలించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విధంగా సాగుతున్న ప్రచారానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని ఆయన చెప్పిన మాటల తాత్పర్యం.    

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిందే. అంతే కాని జానపద చిత్రాల్లో మాదిరిగా దుందుడుకు ధోరణితో పాలించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు"

బాగా సెలవిచ్చారు. ఇప్పుడు తెలంగాణాలో నిజంగానే 'జానపద చిత్రాల్లో మాదిరిగా దుందుడుకు ధోరణితో పాలించడం' జరగటం లేదని నమ్మగలం అంటారా?

చాలా జాగ్రత్తగానే రాజ్యాంగబధ్ధంగానే నెలలపాటు మంత్రివర్గం ఏర్పాటు చేయకుండానే ముఖ్యమంత్రిగారే ప్రభుత్వాన్ని నడిపించటం జరిరిగంది. రాజ్యంగవిరుద్దం ఏమీ లేదు ఒక్క మహిళకూ మంత్రిపదవిని ఇవ్వకుండా ఉండటలో కదా. అలాగా తన గతప్రభుత్వంలో అత్యధికమైన సమర్థతతో పనిచేసిన మంత్రివర్యునికి ఈసారి మొండిచేయి చూపి సోదిలోకి లేకుండా ఆవలికి నెట్టివేయటంలో రాజ్యాంగద్రోహం కూడా ఏమీ లేదు. ఇలా రాజ్యాంగబధ్ధంగానే నియంతృత్వపాలన సాగించటమూ మనప్రజాస్వామ్యంలో భాగమే కదా.

ఐతే ఈనియంతృత్వాన్ని దుందుండుకు తనం అన కూడడని మీ పై సూత్రీకరణ స్పష్టం చేస్తున్నదన్న మాట.

అవునండీ, కళ్ళముందు కనిపిస్తున్నవాటికి సిధ్ధాంతప్రాతిపదిక లేదు కాబట్టి కళ్ళుమూసుకొని 'గజం మిధ్య, పలాయనం మిధ్య' అన్నట్లు జనం నిబ్బరంగా ఉండాలన్న మాట.

సూర్య చెప్పారు...

మంత్రివర్గ విస్తరణ గురించి రాజ్యాంగంలో ఏం రాసున్నది అనేదాన్ని బట్టి నిర్ణయించాలి. ఒకవేళ ముఖ్యమంత్రి తనకు నచ్చినపుడే విస్తరణ చేయగల సౌలభ్యం ఉంటే కేసీఆర్ నిర్ణయం రాజ్యాంగబద్ధం అవుతుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: ఆ సూత్రీకరణ నాదని చెప్పానా! ఆ అభిప్రాయం ఆ సీనియర్ ఐ ఏ ఎస్ అధికారిది (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రెటరి)

Jai Gottimukkala చెప్పారు...

"ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా ఇదే కలవరపాటు"

ఈ వాక్యాన్ని "ముఖ్యంగా *ఒక వర్గానికి చెందిన* ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా ఇదే కలవరపాటు" అని సవరిస్తే సరిపోతుంది.

hari.S.babu చెప్పారు...

ఏతావతా చెప్పొచ్చేదేమిటంటే,

కరణం మాటల్లో ఎంతయినా దొరుకుతాడు గానీ రాతలో మాత్రం చచ్చినా దొరకడన్నట్టు ఒకప్పుడు ఎవరో అలా అన్నారని ఇప్పుడు బాబుగారు జగన్ వస్తే ఏదో జరిగిపోతుందని అన్న సందర్భంలో గుర్తు చేసారు, అంతే[:-)

జర్నలిస్టయిన భండారువారు తనుగా ఏమీ చెప్పలేదు,{:-(

Rajesh చెప్పారు...

But when you quote him and leave it like that people assume you agree with it ...

సూర్య చెప్పారు...

ఆయన తనకు తానుగా చెప్పేది తనకు తానుగా తానేమీ చెప్పలేననే!!

hari.S.babu చెప్పారు...

Mr. james bond,
నాకు నేనుగా చెప్పేది కూడా నాకు నేనుగా ఆయన్ని ఖండించలేననే - అందరం తెలుగువాళ్ళమే కదా{:-)