8, మే 2017, సోమవారం

స్లో పాయిజనింగ్

“ఆటో కంటే చౌక తెలుసా? ఒక్కోసారి ఫ్రీ రైడ్. దిగిన తరవాత ఏమీ ఇవ్వక్కర లేదన్నాడు డ్రైవర్. ఇంటి దగ్గరకే వచ్చి ఎక్కించుకుంటారు, దింపమన్న చోట దింపేస్తారు, యెంత హాయిగా వుందో ఇప్పుడు. ఈ ఊబెర్లు, ఓలాలు అన్ని ఊళ్ళల్లో పెడితే యెంత బాగుంటుందో!” ఇలా సాగుతున్నాయి నగర మధ్యతరగతి పౌరుల ఆలోచనలు. నేనూ వీరిలో ఒకడినే.
కానీ, వ్యాపారి అనేవాడు ఏ లాభం లేకుండా వరదన పడిపోడని సామెత. మాల్స్ సంస్కృతి ప్రబలిన తర్వాత చిన్న చిన్న దుకాణాలకు ఊపిరి అందడం లేదు. అమెరికా లాంటి దేశాల్లో చిల్లర వ్యాపారాలు ఎప్పుడో హరీ అన్నాయి. అలాగే ఇవీ. ముందు చౌక ధరలతో ఆకర్షించి అలవాటు పడేలా  చేస్తారు. మరో దారి లేకుండా చేసిన తరువాత వారేం చెబితే అదే మాట చెల్లుబడి అవుతుంది. అప్పుడు రేట్లు పెంచినా అడిగేవాడు వుండడు. ప్రత్యామ్నాయం లేకుండా పొతే అడగడానికి నోరు పెగలదు.
ఈరోజు బయటకు వెళ్ళడానికి ఊబెర్ బుక్ చేద్దామని అనుకున్నాను. “ఈరోజు రేట్లు పెరిగాయి, సహకరించండి” అని ఓ చిన్ని హెచ్చరిక.
ఊబెర్, ఓలాలు వచ్చిన కొత్తల్లో రేట్లతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే ఒక్కసారిగా పెద్దగా పెంచరు. కార్పొరేట్ కల్చర్ కదా! వారి పద్దతులు వారివి.

ఎవరో చెప్పగా విన్నాను. ‘స్లో పాయిజనింగ్’ అంటే ఇష్టమని.       

1 వ్యాఖ్య:

మానసం చెప్పారు...

నిజమేనండీ. అదే కదా మరి మార్కెటింగ్. రెండేళ్ళ క్రితం ఉన్న రేట్లకి ఇప్పటి వాటికీ అసలు సంబంధమే లేదు. అయిదు నిమిషాల్లోనే రేటు 3 రెట్లు అయిపోతుంది ఒక్కోసారి.