23, ఆగస్టు 2012, గురువారం

అక్షర సత్యాలు




అక్షర సత్యాలు





చక్కటి గాలి కోసం కిటికీలు తెరుచుకోండి
ఏసీల వాడకాన్ని నిలిపివేయండి
ఇంధనాన్ని ఆదా చేసే సీ.ఎఫ్.ఎల్. బల్బులను, ఐ.ఎస్.. మార్కు ఫ్యాన్లనే వాడండి.
(ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న విలేకరుల సమావేశంలో కరెంట్ కొరతపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన సలహాలు – ఆంధ్ర జ్యోతి మొదటి పేజీ వార్త – 23-08-2012)
(వ్యాఖ్య) నిజమే. ఇవన్నీ అక్షర సత్యాలే. కాని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నోటి నుంచి రావాల్సిన మాటలేనా అన్నదే సందేహం. (23-08-2012)  

2 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

తన బాధ్యత ఆలస్యంగానైనా గుర్తించిన ముఖ్య మంత్రిని అభినందించాలి. విచ్చలవిడి విద్యుత్ వినియోగాన్ని కట్టడి చెయ్యాలి. ముఖ్యంగా టి వి ల కోసం, ఇంటర్ నెట్ కోసం ఎంతెంత విద్యుత్ అనవసరంగా వృధా అవుతున్నది. ఆపైన సెల్ ఫోన్ల చార్గింగ్ కి? ఈ విషయంలో ముఖ్యమంత్రి అనవసర రాజకీయ భేషజాలకు పోకుండా ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పారు. ఆయన ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. సమస్యను సమస్యగా గుర్తిస్తే కదా ఆ సమస్యను అధిగమించటం అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యేది. రాత్రిళ్ళు పట్టణాల్లో హోర్డింగ్ లకు పెద్ద పెద్ద లైట్లా, రైతులకు కరెంటు కట్లా ఇదెటువంటి బాధ్యత? మీడియా కూడా తన వంతు "బాధ్యత" గా , వారి టి వి ప్రసారాలను రోజుకు రెండు లేదా మూడు గంటలకు కుదించాలి. ఈ ఇరవైనాలుగు గంటల "గానా బజానా" (న్యూస్ చానెళ్ళతో కూడా కలిపే అంటున్నాను) మనకు ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా అవసరమంటారా. ఊరికే నిరసనలు, విమర్శలతో సమస్యలు పరిష్కారం కావు. ప్రజలు కూడా బాధ్యతతో ప్రవర్తించాలి, సమస్య వచ్చినప్పుడు చెప్పిన మాట విని క్రమశిక్షణ పాటించాలి. ఈ కింది లింకు ఒక్కసారి నొక్కి చూడగలరు.

http://saahitya-abhimaani.blogspot.in/2012/04/blog-post_22.html

చంద్ర చెప్పారు...

దప్పికైనప్పుడు బావి తవ్వడం మొదలు పెడితే ఎలా అనేవారు. కనీసం దప్పిక అయినప్పుడైనా మొదలు పెట్టకపోతే ఇంకెప్పుడు?
ఒక యూనిట్ ఆదా చేస్తే 1.2 యూనిట్లు ఉత్పతి చేసినట్లు అని ముఖ్యమంత్రి గారే చెప్పారు. విద్యుత్ పంపిణి నష్టాల గురించి చాల conservative estimate అది. వాస్తవ నష్టాలు ఇంకా చాల ఎక్కువగా నే ఉన్నాయి.
విద్యుత్ సమస్యకు దీర్ఘకాల ప్రణాళిక కావాలి. దాంట్లో పంపిణి నష్టాలను తగ్గించడం, ప్రజల్లో విద్యుత్ ఆదా ను ప్రోత్సహించడం, removable energy కి ప్రోత్సాహం ఇవ్వడం ఇలాంటి కర్తవ్యాలు ఉండాలి.

ఎంత పెద్ద ప్రయాణం అయినా చిన్న అడుగుతోనే మొదలైనట్లు, విద్యుత్ సమస్య ను గుర్తించడం అనేది విద్యుత్ సమస్య పరిష్కారం దిశగా మొదటి అడుగు అయితే బాగుంటుంది.
సింపుల్ గా ఏసి లు ఆపుకోండి, టీవీ లు తక్కువ చూడండి అని చెప్పడం పరిష్కారం కాదు.