29, నవంబర్ 2011, మంగళవారం

ఒక మహర్షి అస్తమించాడుకీర్తిశేషులు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారు 


ఈ రోజు నిజంగా దుర్దినం. స్వార్ధాన్ని జయించిన ఒక వ్యక్తి ఈ స్వార్ధ సంకుచిత ప్రపంచం నుంచి నిష్క్రమించాడు. తొమ్మిదిపదుల వయస్సు దాటిన  తరువాత  కాలు విరిగి కోలుకుంటున్నారు అన్న దశలో అందరిని హతాశులను చేస్తూ అస్తమించాడు. జీవన మార్గంలో అనేకమందికి నడక నేర్పిన మనిషికి నడక దూరమవడం విధి వైపరీత్యం. తన జీవితాన్ని చమురుగా మార్చి ఎన్నో ఇళ్ళల్లో దీపాలు వెలిగించిన ఆ మహా జ్యోతి ఆరిపోయింది. ఆఖరి చూపులు అందడం కోసం హడావిడిగా విజయవాడ  వెడుతూ ఆ మహానీయుడుకి అర్పిస్తున్న అశ్రు నివాళి.  
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
(29-11-2011)

2 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

మహనీయుల ఆత్మలు ఎప్పుడూ శాంతంగానే ఉంటాయి. కాని మనలాంటి సామాన్యులు కూడా భువికేగిన మాన్యుల ఆత్మలు శాతించాలని ప్రార్ధించటం, వారిమీద మనకున్న అపారమైన గౌరవాన్ని సూచిస్తుంది. తుర్లపాటి హనుమంతరావుగారి ఆత్మ శాంతించాలని, ఆ దేవదేవునిలో ఐక్యం అయ్యి ఉండాలని భావిస్తూ, మిమ్మల్ని ఒక కోరిక కోరతాను. శ్రీ తుర్లపాటి హనుమంతరావు పంతులుగారి గురించి, సవివరమైన వ్యాసం ఒకటి వ్రాయగలరు. వికీ స్టైల్లో, ప్లాస్టిక్ లాగ కాకుండా,'రు' ఉండాల్సిన చోటనల్లా 'డు' వ్రాయకుండా ఆ వ్యాసం ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శివరామ ప్రసాదు కప్పగంతు - మీ అపారమయిన అభిమాన పురస్కార స్పందనకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాస రావు