‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం!’
‘దోషులు ఎంతటివారయినా అరెస్టు చేసితీరుతాం!’
‘ప్రజల ప్రాణాలు కాపాడడం పాలకులుగా మా ప్రాధమిక
కర్తవ్యం’
‘ఇలాటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’
‘పేలుళ్ళలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్ష రూపాయలు.
గాయపడిన వారికి యాభై వేలు’
‘క్షతగాత్రులు త్వరగా కోలుకోవడానికి మెరుగయిన వైద్యసాయం
అందిస్తాం’
‘నిఘా వైఫల్యం’
‘ ప్రజల ప్రాణాలు కాపాడలేని ఈ అసమర్ధ
ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు’
‘తక్షణం రాజీనామా చేయాలి’
‘చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్
గ్రేషియా చెల్లించాలి’
..........ఈ మాటలు ఎక్కడో, ఎప్పుడో విన్నట్టుంది
కదూ.
ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఇలాటి మాటలు
పరిపాటే.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళలో అసువులు బాసిన వారు ఈ
వ్యర్ధప్రలాపాలు వినే అవకాశం ఎట్లాగో లేదు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స
పొందుతున్నవారి చెవినపడ్డా నవ్వుకునే పరిస్తితిలో వుండి వుండరు.
గతంలో జరిగిన ఈ మాదిరి దుర్ఘటనల్లో గాయపడి
అంగవైకల్యంతో అలమటిస్తున్నవాళ్ళు ఈ మాటలు వింటూ ఎన్ని శాపనార్ధాలు పెట్టుకుంటున్నారో
తెలవదు.
దేవుడే ఈ దేశాన్ని రక్షించాలి.
దేవుడి పేరుతోనే ఇవన్నీ
జరుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? (22-02-2013)NOTE: Courtesy image owner