17, మే 2024, శుక్రవారం

గతం గుర్తులు



నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట.
ముఖ్యమంత్రి అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు తన పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ఆయన వెస్పా స్కూటర్ మీద చిక్కడ పల్లి నుంచి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి బాగా పొద్దు   పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.
(ఇప్పుడు సాక్షి పత్రిక ఎడిటర్ వి.మురళి ఆ హెడ్డింగు పెట్టారు. అప్పట్లో ఆయన ఆ పత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు)

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆమధ్య ఎప్పుడో మా ఊర్లో రోజులు మారిపోయాయి అంటే రోజులేమి మారలేదు ప్రజలే మారిపోయారని, కరెక్టేనేమో

Zilebi చెప్పారు...

ఎన్ని మార్లు మీరు రాసినా మళ్లీ మళ్లీ చదివింప జేసే వృత్తాంతం.

అజ్ఞాత చెప్పారు...

Blogger Zilebi అన్నారు...
ఎన్ని మార్లు మీరు రాసినా మళ్లీ మళ్లీ చదివింప జేసే వృత్తాంతం.

This must be one of those rare occasions where you spoke
leaving the mask aside.

Zilebi చెప్పారు...

-This must be........

తెలుగులో చెప్పండి :)


అజ్ఞాత చెప్పారు...

కొందరు పండితులు తమ బ్లాగులో వ్యాఖ్యలు తీసివేస్తారు. ఇతరుల బ్లాగుల్లో స్వేచ్చగా కామెంట్లు పెడతారు. ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యాతలు ఏమి రాయాలో ఆ బ్లాగు ఓనర్లు ఏ వ్యాఖ్యలు ప్రచురించ వలెనో
కూడా సలహా ఇస్తారు. ఇదే ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే.

అజ్ఞాత చెప్పారు...

శ్యామకృష్ణ మాట వినుము శర్మా

అజ్ఞాత చెప్పారు...

శ్యామలీయపు మాటయె చద్దిమూట

అజ్ఞాత చెప్పారు...

భళి భళి!! ఇదియంతయు బ్లాగ్బాహుబలి జిలేబకావళి (అవ)లీల సుమా !!!!!?????

అజ్ఞాత చెప్పారు...

తెలుగులో చెప్పండి :)

"ఆహా “జిలేబి” గారు, ఎంత కాలానికి ఒక డొంకతిరుగుడు లేని మాట చెప్పారు 👌🙂.