ఎయిర్ టెల్ మొబైల్ బిల్లు కట్టాలని మా ఇంటికి దగ్గరలో జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో వున్న వాళ్ళ ఆఫీసుకు వెళ్లాను. అక్కడికి
వెళ్ళడం కొత్తాకాదు, అక్కడి అనుభవం
కొత్తాకాదు. మొత్తం ఎయిర్ కండిషన్డ్ ఆఫీసు. ఎయిర్ లైన్స్ ఆఫీసును తలదన్నేలా చక్కటి అందమైన యూనిఫారాల్లో
అయిదారుగురు అమ్మాయిలు కంప్యూటర్ల వెనుక గేములుఆడుకుంటూ వున్నట్టు కానవస్తారు. బిల్లు కట్టాలని అడగగానే, జవాబు చెప్పడానికి
కూడా ఓపిక లేనట్టు ఒక మూలన వున్న ఆటో
బిల్లింగ్ పేమెంట్ మిషన్ వైపు చేయి చూపిస్తారు. ఆ మిషన్ దగ్గరికి వెడితే అది యక్ష
ప్రశ్నలు వేసి అసలు పేమెంటు చేసే సమయానికి ‘సర్వర్ డౌన్’ అంటుంది. ఇదేమిటని ఆ అమ్మళ్ళని అడిగితె, ‘సర్వర్ డౌన్ అయితే మేమేం చేస్తాం,
వెయిట్ చేయండి’ అంటూ నోటితో కాకుండా సైగలతోనే జవాబు చెబుతారు. నోరు తెరిస్తే నోటి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు.
పది నిమిషాలు గడిచినా సర్వర్ డౌన్ విషయంలో
ఏమీ తేడా లేదు. అక్కడి ఉద్యోగినుల వైఖరిలో
కూడా తేడా లేదు.
ఓ పది నిమిషాలు చూసి, అద్దాల తలుపులు
తెరుస్తూ, మూస్తూ వున్న వాచ్ మన్ ని పిలిచాను. అక్కడ వున్నవాళ్ళందరూ (కావాలనే
పనిచేసేవాళ్ళు అనడం లేదు) వినేట్టు అతడితో చెప్పాను.
“ఇదిగో నా బిల్లు మొత్తం. ఆ సర్వర్ మళ్ళీ ఉపయోగంలోకి వస్తే ఈ డబ్బు కట్టు.
ఒకవేళ కట్టక పోయినా నేనేమీ బాధపడను, ఎందుకంటే బిల్లు కట్టడానికి వచ్చిన వాళ్ళను ఈ ఆఫీసు వాళ్ళు పెడుతున్న బాధకంటే అదేమీ
ఎక్కువకాదు.” అంటూ బిల్లు డబ్బులు అతగాడి చేతిలో పెట్టి చక్కా వచ్చేశాను.
వాచ్ మన్ మంచి
వాడిలాగా వున్నాడు. బిల్లు కట్టినట్టు సాయంత్రానికి మెసేజ్ వచ్చింది. అతడి మంచితనం
అర్ధం అయింది.
కానీ అర్ధం కానిదల్లా ఒక్కటే.
వేలకు వేలు జీతాలు తీసుకునే అక్కడి ఉద్యోగులు, బిల్లు కట్టాలని వచ్చే వారికీ
ఆ మాత్రం సాయం చేయలేరా?
4 కామెంట్‌లు:
మౌనమే నీ భాష యా ఓ ఏరు టెల్లు :)
కార్పొరేట్ కంపెనీల ఉద్యోగుల (ముఖ్యంగా వారి ఫ్రంట్ ఆఫీసుల్లోను, ఆన్‌లైన్లోను) నిర్లక్ష్య, అహంకారపూరిత ప్రవర్తన అనుభవంలోకి వచ్చినట్లుంది భండారు వారికి 🙂🙂. ప్రైవేట్ రంగం వాళ్ళకన్నా పబ్లిక్ సెక్టార్లోను, ప్రభుత్వ కార్యాలయాల్లోను ఉద్యోగుల ప్రవర్తనే కాస్త నయం అనిపిస్తుంటుంది చాలా సార్లు.
sir having retired from govt. service you should have taken bsnl mobile. Another option is online payment. Nowadays online payments are better than physical payments. Private sector appears to serve you better. Truth is they have no accountability. Even though govt. service is not good at least there is someone you can approach. In private sector, you don't even know whom we should approach. Most of the counter clerks are insensitive.
అజ్ఞాత (22-May-2016, 11.35 am) చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను, వారు అన్న insensitive అనే మాట సరిగ్గా సరిపోతుంది. ఆ కారణాల వల్లే నా లాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బాండ్ అన్నీ కూడా BSNL వారివే. మా ఏరియా కి సంబంధిత లైన్‌మన్, టెక్నీషియన్ ల పేర్లు ఫోన్ నంబర్లే కాక, వారి పై అధికారయిన JTO (also AE) గారి పేరు ఫోన్ నంబరు కూడా నేను తెలుసుకోగలిగాను శ్రమ పడకుండా. అదే ప్రైవేట్‌లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి చూడండి, గోడకేసి తల బాదుకోవడమే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి