16, మే 2016, సోమవారం

పండుటాకులు రాలిపోతున్నాయి


మొన్నీ మధ్యనే తొంభయ్యవ పడికి దగ్గరయి కన్ను మూసిన మా శారదక్కయ్య, ఆమె పోయిన మూడో రోజునే ఆవిడకు ఇంచు మించుగా సమవయస్కురాలయిన మా బాబాయి కుమార్తె సుగుణక్కయ్య చూస్తుండగానే దాటిపోయారు.


(కీర్తిశేషులు అయితరాజు (మండవ) సుగుణక్కయ్య) 

మా ఏడుగురు అక్కయ్యలు, బాబాయి కుమార్తెలు ఇద్దరు, సుగుణక్కయ్య, మధురక్కయ్యలు సొంత అక్కాచెల్లెళ్లు మాదిరిగా ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్ళు. ఇప్పుడంటే చుట్టపక్కాలు పెళ్ళిళ్ళలో కలుస్తున్నారు. ఆ రోజుల్లో అలా కాదు మధ్య మధ్య విధిగా ఏదో ఒక కారణంతో రాకపోకలు సాగేవి.
అందుకే అన్నారు, చుట్టబెడుతుంటేనే చుట్టరికాలు, మాట్లాడుకుంటూ ఉంటేనే మిత్రత్వాలు అని.
ఇప్పుడో!
వావివరసలన్నీ, ‘కజిన్’ అనే ఒక్క ముక్కతో చెల్లు.     

4 కామెంట్‌లు:

vahini చెప్పారు...

ఈ యుగానికింతే కానీ ఎక్కడో మూలాలు పోకుండా కుటుంబాలు ఉన్నాయి. మొన్నెప్పుడో పేపర్లో 1000 మంది పైగా కుటుంబ సభ్యులు కలిసి ఉన్న పెద్ద మనిషి ఫోటో పేపర్లో వేశారు. కలిసి ఉన్నప్పుడు విలువలు తెలియవు విడి విడిగా ఉంటేనే తెలుస్తుంది ఒంటరి తనం. కొద్దిగా ఇలాంటి బ్లాగ్ స్నేహాలు మనసు మరీ రాయి అయిపోకుండా చేస్తాయి

అజ్ఞాత చెప్పారు...

రమణ గారి వాక్కు నిజం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Ramana vamaraju : జగమంత కుటుంబం ( నా బ్లాగు నుంచి)
జియోనా ఛానా
వినడానికి చాలా చిన్న పేరు. కానీ ఇతడి గురించి చెప్పడానికి చాలా వుంది.
ప్రపంచం మొత్తంలో అతడికున్నంత పెద్ద కుటుంబం మరెవ్వరికీ లేకపోవడమే ఇతగాడి గొప్పతనం.
39 మంది భార్యలు – 94 మంది పిల్లలు- 33 మంది మనుమలు మనుమరాండ్రు.
పరువంలో వున్నప్పుడు ఒక్క ఏడాదిలోనే పదిమంది ఆడవాళ్ళను పెళ్ళాడి తన ఘనతను పదిమందికి చాటిచెప్పాడు.
రెక్కలు వచ్చిన పక్షుల మాదిరిగా ఎగిరిపోకుండా అంతా కలసి ఉమ్మడిగా జీవిస్తున్నారు. ఒక్క ఇంట్లోనే వుంటున్నారు.
ఇందుకోసం జియోనా ఏకంగా వంద గదులతో నాలుగంతస్తుల ఇంటిని పర్వత సానువుల్లో నిర్మించుకున్నాడు.
ఇంతమంది భోజనం చేయాలన్నా, అందుకు ఏర్పాట్లు చేయాలన్నా మాటలు కాదు.
రోజుకు ముప్పయి కోళ్ళు తెగుతాయి.
వంద కిలోల బియ్యం వండి వారుస్తారు.
కూరగాయల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా ఓ రైతు బజారే కావాలి.
ఇంతకీ అసలు విశేషం ఏమిటంటే –
ప్రపంచం మొత్తంలో ఈ ఘన కీర్తి సంపాదించుకున్న జియోనా ఎవ్వరో కాదు.
మన తోటి భారతీయుడే. మిజోరాం రాష్ట్రంలో భక్త్ వాగ్ అనే గ్రామవాసి.
నలభై వేలమంది వున్న ఓ తెగకు నాయకుడు. ఆ తెగలో బహుభార్యత్వం మీద ఆంక్షలు లేకపోవడమే ఈ తెగ నాయకుడి తెగింపుకి కారణం.

అజ్ఞాత చెప్పారు...

ఆ తెగలో బహుభార్యత్వం మీద ఆంక్షలు లేకపోవడమే ఈ తెగ నాయకుడి తెగింపుకి కారణం.

ఆయనను వ్యాఖ్యానించటానికి మీరు అనర్హుషులు. మీరు ఒక భార్య కలిగి ఉండటం, అది చాలా గొప్ప విషమైనట్లు భావిస్తున్నారు. మూడు పెళ్ళిళు చేసుకొంటేనే ఏమాత్రాం కొత్త దనమే ఉండదు. స్రీ మీద మోహం నాలుగు పెళ్ళిళ తరువాత గాలికి ఎగిరి పోతుంది. 39 పెళ్ళిళు చేసుకోవటం సామాన్యమా? ఆయన దగ్గర ప్రేమ ఆకాశమంత పెద్ద స్థాయి లో ఉంది.