9, మే 2016, సోమవారం

ఎలా అంటే ఇలా


“మా కుక్క పిల్ల పప్పీకి పాతికేళ్ళు” అన్నాడు ఏకాంబరం.
“ఎలా! అదెలా!” అడిగాడు లాయరు  పీతాంబరం
“ఎలా అంటే ఇలా. ఎప్పుడో విడుదల అయి బాక్సుల్లో వుండిపోయిన సినిమాకి పాతికేళ్ళు, ముప్పయ్యేళ్ళు అంటుంటే, మా పెద్దాడి పుటకలప్పుడే గుటుక్కుమన్న పప్పీకి పాతికేళ్ళు అంటే తప్పేమిటి?”

లా పాయింటు లాగాడు ఏకాంబరం    

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"ఏకాంబరం" చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. విసుగొచ్చేస్తోంది పాతసినిమాల పుట్టినరోజు కబుర్లు. మరీ హాస్యాస్పదంగా కూడా తయారయింది.