10, మే 2016, మంగళవారం

నెంబరు దొరకగానే సంబరపడిపోకూడదు


ప్రధానమంత్రి నరేంద్ర మోడీని  వివిధ పౌర సమస్యల విషయంలో ఫోన్  ద్వారా సంప్రదించడానికి ప్రధాని కార్యాలయంలో పనిచేసే కొందరు సీనియర్ అధికారుల టెలిఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఫోన్లో ప్రధాని కార్యాలయం స్పందించడం కంటే సామాన్యుడు కోరుకునేది ఏముంటుంది?
కాకపొతే ఇది చూసినప్పుడు ఒక పాత సంగతి గుర్తుకు వచ్చింది.

మీలో చాలామందికి గుర్తుండే వుంటుంది. దూరదర్సన్ లో ఒక ప్రకటన వచ్చేది. కేబుల్ ఆపరేటర్లు డీడీ ఛానల్  ని సరిగా కనబడేట్టు చూపక పొతే, వెంటనే స్థానిక జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లను సంప్రదించాలని అందులో సూచించేవాళ్ళు. మా ఇంట్లో దూరదర్సన్ సప్తగిరి సరిగా రావడం లేదని ఎవరయినా పొద్దున్నే ఎస్పీకి ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు.      

కామెంట్‌లు లేవు: