13, జూన్ 2016, సోమవారం

వావిలేని వరుసలు



ఏకాంబరం పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే అప్పటికే పెళ్ళయి విడాకులు  తీసుకున్న అమ్మాయిని ఎవరికీ చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. ఆ కొత్త పెళ్లి కూతురు  అమ్మాయి కాదు, అప్పటికే  అమ్మ. ఆ అమ్మడికి ఈడొచ్చిన ఒక అమ్మాయి వుంది. పెళ్లి అయిన రోజే ఒకమ్మాయికి తండ్రి అయ్యే అదృష్టం పట్టిన  ఏకాంబరానికి అతడి తండ్రి రూపంలో దురదృష్టం ఎదురయ్యింది. ఒకరోజు కొడుకును చూడ్డానికి ఏకాంబరం ఇంటికి వచ్చిన తండ్రి, సొంత కొడుక్కి సవతి కూతురు అయిన అమ్మాయిపై మనసు పారేసుకుని ఏకంగా పెళ్ళాడేసి కొత్త కాపురం పెట్టాడు.  ఆ విధంగా  కూతురు వరసయిన అమ్మాయి ఇప్పుడు సవతి తల్లి అవతారం ఎత్తింది.  కన్న తండ్రికే  పిల్లనిచ్చిన మామ అయ్యాడు. అలా ఏకాంబరం కట్టుకున్న పాత పెళ్ళాం తోనూ, అతడి తండ్రి కొత్త పెళ్ళాం తోనూ హాయిగా కాపురాలు  చేసుకుంటున్న రోజుల్లో  కధ మరో మలుపు తిరిగింది.   
ఏకాంబరానికి  సవతి కూతురు లేదా సవతి తల్లి వరుస అయిన  అయిన పాత తండ్రి కొత్త భార్య  నెల తప్పింది. చూస్తుండగానే నెలలు నిండడం, పండంటి పిల్లాడిని కనడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడా పిల్లవాడు మన ఏకంబారానికి ఒక రకంగా మనుమడు. ఎంచేతంటే సవతి కూతురు కన్న తల్లికి తాను మొగుడు కాబట్టి.  మరో రకంగా ఆ పిల్లవాడు ఏకాంబరానికి తమ్ముడు వరస, ఎందుకంటె అతగాడు  తండ్రికి పుట్టిన కొడుకు కాబట్టి.
దాంతో  ఏకాంబరం భార్య  పాత్ర  అమ్ముమ్మకు  మారింది. దీనికి కారణం ఆవిడ కూతురే  ఏకాంబరం నాన్నగారి భార్య కాబట్టి. ఈ వరస ప్రకారం  ఏకాంబరం తన భార్యకు మనుమడు అవుతాడు. ఈ తికమకల నడుమ ఏకాంబరం భార్య ఓ మంచి రోజు చూసుకుని ఒక పిల్లాడ్ని కని కూర్చుంది. అతడి కన్న కొడుకే అతడి  నాన్నకు బావమరిది అయ్యాడు. అంతేకాదు  ఏకాంబరానికి సవతి తల్లి వైపు వరస తీసుకుంటే అతడు అతడికే  తాత అయ్యాడు.
ఇలా వుండగా  ఏకాంబరం ఇంటికి జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో మొత్తం కుటుంబం ఇంట్లోనే వున్నారు.
లెక్కల వాడు అందర్నీ లెక్కపెట్టి చూసుకున్నాడు. తరువాత ఏకాంబరాన్ని అడిగాడు. ఆ కుర్చీలో కూర్చున్న పెద్దాయన ఎవరని.
‘ఆయనా ! ఆయన  మా నాన్న. కాదు కాదు మా అల్లుడు’
‘ఈ పెద్దావిడ?’
‘నా భార్య’
‘ఆ చిన్నావిడ?’
‘మా అమ్మాయి, కాదు కాదు మా అమ్మ’
‘ఈ పిల్లవాడు?’
‘నా మనుమడు కాదు కాదు కొడుకు’
‘యితడు అతడికేమవుతాడు?’
‘మనుమడు, కాదు కాదు బామ్మర్ది’
‘ఈవిడ?’
‘మా సవతి తల్లి కాదు కాదు కూతురు’
జనాభా లెక్కల వాడు, నీళ్ళు కూడా అడక్కుండా మూర్చపోయాడు.
(ఇంగ్లీష్ కధనానికి తెలుగు స్వేఛ్చానువాదం)     


12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

kasi majili story :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇటువంటి గందరగోళపు "వావి లేని వరసల" కథతో "అపూర్వ రాగంగళ్" అని తమిళంలోను, "తూర్పు పడమర" అని తెలుగులోను 1970వ దశకంలో సినిమాలు వచ్చినట్లు గుర్తు. ఏవిటో సమాజపు కట్టుబాట్లంటే గౌరవం లేకపోవడం.

అజ్ఞాత చెప్పారు...

కాశి మజిలి కథ ఇలా ఉంటుంది . .
ఒక తండ్రి కొడుకులు ఒక దారి లో వెళ్తుంటారు , ముందు రెండు జతల అడుగు జాడలు కనబడతాయి , ఒక జత చిన్నగా, మరొక జత పెద్దగా ఉంటుంది , చిన్న జత ఉన్న స్త్రీ చిన్న కాళ్ళతో ఉంది చిన్న అమ్మాయి అయి ఉంటుంది , పెద్ద జత ఉన్న స్త్రీ పెద్దావిడ అయి ఉంటుంది అని అలోచించి, చిన్న అమ్మాయిని కొడుకు వివాహం చేసుకోవాలని , పెద్ద ఆవిడ ని తండ్రి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వెళ్లి కలిస్తే వాళ్ళు తల్లి కూతుల్లు అని తెలుసుకుంటారు ....

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు, @ అజ్ఞాత:NOTE: This is the original English text I found in net.
To: The Social Security Commissioner
Dear Commissioner,
My name is Charles Wright and I live on First Street. I would like to present before you the following story:
'Many years ago, I married a widow out of love who had an 18-year-old daughter. After the wedding, my father came to visit a number of times, and suddenly he fell in love with my step-daughter. My father eventually married her without my authorization.
As a result, my step-daughter legally became my step-mother and my father my son-in-law. My father's wife (also my step-daughter) and my step-mother, gave birth to a son who is my grandchild because I am the husband of my step-daughter's wife. This boy is also my brother, as the son of my father.
All at once, my wife became a grandmother, because she is the mother of my father's wife. Therefore, it appears that I am also my wife's grandchild. A short time after these events, my wife gave birth to a son, who became my father's brother-in-law, the step-son of my father's wife, and my uncle. My son is also my step-mother's brother, and through my step-mother, my wife has become a grandmother and I have become my own grandfather

In light of the above mentioned, I would like to know the following: Does my son, who is also my uncle, my father's son-in-law, and my step-mother's brother fulfil the requirements for receiving childcare benefits?
Sincerely yours,
Charles Wright

అజ్ఞాత చెప్పారు...

why are u writing such waste topics

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : In fact of I am translating such topics to kill my time as well to waste your time.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత అజ్ఞాత అన్నారు...
kasi majili story :)

13 జూన్, 2016 10:59 [AM]

It is only to recall that there is a kasimajili story resembling this and not to hurt any of your feelings

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : కాశీమజిలీ కధ ప్రస్తావించిన మీ గురించి కాదు నా వ్యాఖ్య. మరొకరెవరో 'అజ్ఞాత' పేరుతొ "why are u writing such waste topics" అని రాసారు. వారికి జవాబుగా నేను "In fact of I am translating such topics to kill my time as well to waste your time." అని నేను రాసాను. అది మిమ్మల్ని ఉద్దేశించింది ఎంతమాత్రం కాదండీ.

sreeram chaturvedula చెప్పారు...

Kasi majili katha kaadu. Bhetala kathala lo aakhari khata.

అజ్ఞాత చెప్పారు...

తండ్రి కూతురు ని చేసుకున్నాడు, కొడుకు తల్లి ని చేసుకున్నాడు

అజ్ఞాత చెప్పారు...

బాగుంది

srinivasrjy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.