18, జూన్ 2016, శనివారం

అమరావతి ట్రైన్

“ఎవరూ, సుబ్బారావు గారా! మీ ఫైల్ ఇప్పుడే  సికిందరాబాదులో రైలు ఎక్కగానే చూశాను. నల్గొండలో  ఏఎస్ చూసి డీఎస్ కుపంపుతారు. గుంటూరులో సెక్రెటరీ చూస్తారు. బెజవాడ స్టేషనుకు వచ్చి ఆర్డరు కలెక్టు చేసుకోండి”


5 కామెంట్‌లు:

palleturi chinnayya చెప్పారు...

అయ్యా పెద్దోరు, చాల నవ్విన్చేస్తున్నారు.

palleturi chinnayya చెప్పారు...

అయ్యా పెద్దోరు, చాల నవ్విన్చేస్తున్నారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఫైల్ సెక్రెటరీ గారు చూడడానికి భువనగిరి (బీబీనగర్ ??) నుండి గుంటూరు దాకా పడుతుందన్నమాట ☹️. పోన్లెండి, అదే సెక్రెటేరియట్లో కూర్చుని చూస్తే రోజుల తరబడి / నెలల తరబడి పట్టెయ్యదూ. అందుకని ట్రెయిన్లో ఫైళ్ళ పరిశీలన భలే ఐడియా 👌 .

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - ఏపీ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు పత్రికల్లో చదివాను. అన్ని గంటలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఫైళ్ళు క్లియర్ చేస్తే ఎలా వుంటుంది అన్న ఐడియాలో నుంచి పుట్టిన మొలక ఇది.

అజ్ఞాత చెప్పారు...

వహ్వా వహ్వా తాయిలాలే తాయిలాలు. చాలా తెలివిగా చంద్రబాబు గార్ని గిరికీలు కొట్టిస్తున్నారు, హైదరాబాద్ వదలకుండా, వాళ్ళను ఆయన వదిలి పెట్టకుండా. మొత్తానికి ఉద్యమ ప్రయోజనాల్ని సాధించలేకపోయినా, స్వప్రయోజనాలను బాగానే సాధించుకుంటున్నారు - సాధిస్తూ. రాష్ట్ర ప్రయోజనాలేవడిక్కావాలి మన జేబు నిండితే చాలు. రెండేళ్ళు గడిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా తాము కూడా ఒక చెయ్యేస్తున్నారు ఆంధ్రాను చంక నాకిస్తున్నారు, ఘనత వహించిన ప్రభుత్వోద్యోగులు, ఉన్న నాల్గు రూపాయలను అల్లాలు బిల్లాలు చేస్తూ, లేదంటే చేయిస్తూ ----------
సర్వం సమస్తం రాష్ట్ర ప్రభుత్యోద్యోగ ప్రీత్యర్డ సమర్పయామి --------
మంగళం.

అన్నట్లు రోజూ బాబు గారు బెజవాడ లోనే ఉంటారుగా, ప్రొద్దున్నే వెళ్లి వాళ్ళను రిసీవ్ చేసుకుని,
పెండింగ్ సమస్యలు (జీత భత్యాల పెంపు ఇత్యాదులన్న మాట), సాయంత్రాలు అలా ముద్దుగా సాగనంపుతూ తెల్లారి రమ్మంటూ విన్నపాలు, వేడికోళ్ళు చేసుకుంటుంటే సరి, మిగిలిన మూడేళ్ళు
అలాగ్గా సులాగ్గా ------------