19, జూన్ 2016, ఆదివారం

ఇండియా దటీజ్ భారత్ !


ఉయ్యాలలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అనే సామెతకు అతికినట్టు సరిపోయే ఉదంతం ఇది.
చైనాలోని సేద్యపు నీటి ప్రాజెక్టులను గురించి అధ్యయనం చేయడానికి, చాలాయేళ్ళ క్రితం భారత ప్రభుత్వం ఒక ఉన్నతాధికార బృందాన్ని ఆ దేశానికి పంపింది. పెద్ద పెద్ద డ్యాం లలో ఆనకట్టల వద్ద పేరుకుపోతున్న ఇసుక, మట్టి మేటల్ని తొలగించే విషయంలో, ఆ బృందంలో ఒక సభ్యుడికి కొన్ని సాంకేతికపరమైన సందేహాలు వున్నాయి. పనిలో పనిగా అక్కడి నిపుణులను ఈ విషయంలో సంప్రదించాడు.  అడిగిన వ్యక్తిని వారు ఎగాదిగా చూసి, ‘మీరు వచ్చింది ఇండియా నుంచే కదా’ అన్నారు. ఔనన్నాడు మనవాడు. మరీ పై సామెత చెప్పకపోయినా ఆ అర్ధం వచ్చేలా వాళ్ళు సమాధానం చెప్పారు.
“అయ్యా! మీ దేశంలోనే ఇందుకు సంబంధించిన నిపుణుడు ఒకరు వున్నారు. బెంగుళూరులో వుంటారు. ఆయన పేరు డాక్టర్ కే.జీ. రంగరాజు. సేద్యపు నీటి ప్రాజెక్టులలో మాకేవయినా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసుకోవడానికి వారినే సంప్రదిస్తాం”(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గతంలో కేంద్ర సేద్యపు నీటి మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన జంధ్యాల హరినారాయణ ఒకరోజు   మిత్రుడు డాక్టర్ గోపాల్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో చెప్పిన వృత్తాంతం ఇది. డాక్టర్ ఊట్ల బాలాజీ, జ్వాలా నరసింహా రావు కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా బాలాజీ తీసిన ఫోటో ఇది) 

1 కామెంట్‌:

Deepak చెప్పారు...

మంచి విషయం చెప్పారు. మన వారిలో చాలావరకు రచ్చ గెలిచి ఇంట గెలిచినవారే.