27, జనవరి 2012, శుక్రవారం

రోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరంరోజుకో రూపాయితో కిడ్నీ బాధలు దూరం


మీరెప్పుడన్నా హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్ద వున్న జలశుద్ధి కేంద్రాన్ని చూసారా. నిజాం నవాబు కాలం నాటి ఆ జలాశయంలోకి  వాలున చేరే వాననీటితో పాటు నగర జీవితంలో భాగమయిన కాలుష్య జలాలన్నీ కలుస్తుంటాయి. అలాటి కలుషిత  నీటిని శుద్ధి చేయడంకోసం భారీగా నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన కేంద్రం ఇది. అపరిశుభ్ర జలాలను పరిశుభ్రం చేయడానికి నిరంతరం అనేక యంత్రాలు పనిచేస్తుంటాయి. అయినా ట్యాంక్  బండ్ కంపు  గురించిన కధలు అనేకం వినవస్తూనే వుంటాయి. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా వున్న ట్యాంక్ బండ్ జలాలు ఇప్పుడు వాడకానికి పనికిరాకుండా  కేవలం పడవ షికార్లకు మాత్రమే పరిమితమై పోయాయి.  దీనికి కారణం ఏళ్లతరబడి ఆ తటాకంలో  కలుస్తున్న వ్యర్ధ పదార్ధాలు, కాలుష్య జలాలు  గురించి ఎవరూ అంతగా  పట్టించుకోకపోవడమే.

మనిషి శరీర ధర్మం కూడా దాదాపు ఈ మాదిరే. తినే ఆహారం, తాగే నీరు ద్వారా శరీరానికి అవసరమయిన మాంసకృత్తులు, పోషక విలువలు సమకూరడంతో పాటు  రక్తంలో కలవని  లవణాల వల్ల అది  కలుషితమవుతూ వుంటుంది. ఒక్కోసారి రక్తం విషపూరితమయ్యే  ప్రమాదం కూడా వుంటుంది. ఇలా కలుషితమయిన రక్తాన్ని వడపోసి అనవసర లవణాలను తొలగించి వాటిని  మూత్రం, చెమట ద్వారా శరీరం నుంచి బయటకు పంపడానికి  మూత్రపిండాలు(కిడ్నీలు) పనిచేస్తుంటాయి. అయితే, హుస్సేన్ సాగర్ జలాల మాదిరిగానే, కాలం గడుస్తున్న కొద్దీ కొందరిలో అనవసర లవణాలు పేరుకుపోయి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. ఇవే కిడ్నీ సంబంధమయిన వ్యాధులు. ఇవి బాగా ముదిరితే, కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడం, మూత్రపిండాలు దెబ్బతిని వాటి స్తానంలో కృత్రిమంగా రక్తాన్ని శుద్ధిచేసే డయాలసిస్ వంటి ఖరీదయిన వైద్యం తప్పనిసరి అయ్యే ముప్పు పొంచుకుని వుంటుంది. కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిబారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముదిరిపోయిన తరువాత చేసే చికిత్స కంటే నివారణ మేలు కదా. 


ఈ రకంగా ఆలోచించినప్పుడు రూపాయి  కూడా ఖరీదు చేయని కొత్తిమీర కట్టతో కిడ్నీ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలగడం అన్న ఆలోచన ఆలోచించదగిన సంగతే. పెద్దగా ఖర్చు లేని వ్యవహారం అయినప్పుడు ప్రయత్నిస్తే పోయేది రూపాయే కదా.

ఇంతకీ ఈ రూపాయి వైద్యానికి కావాల్సింది ప్రతి ఇంటి  వొంటింట్లోనే దొరుకుతుంది కూడా.  కరివేపాకు, కొత్తిమిర అనేవి లేని ఇళ్లు, వాటిని వాడని ఇల్లాళ్ళు వుండరు కూడా.

కిడ్నీకి, కొత్తిమిరకు వున్న బాదరాయణ సంబంధం ఏమిటన్న మాట అటుంచి ఈ వైద్య విధానం ఏమిటో చూద్దాం.
ముందు కొత్తిమిర కట్టను మంచి నీటితో శుభ్రంగా కడగండి.

తరువాత కొత్తిమిర ఆకులను చిన్నగా కత్తిరించండి. ఆ ఆకులను పదినిమిషాల పాటు ఉడికించండి. ఆ నీటిని చల్లబరచి ఆకుల్ని తీసివేసి శుభ్రమయిన సీసాలో పోసి రిఫ్రిజిరేటర్ లో వుంచండి.
ఆ నీటిని ప్రతి రోజూ ఒక గ్లాసు తాగుతూ వుండండి. మీ రక్తంలో పేరుకుపోయిన ఉప్పు, ఇతర విష పదార్ధాలు మూత్రంతో పాటు బయటకు వెళ్ళిపోతాయి. కొద్ది రోజుల తరువాత మీలో కలిగే  మార్పును మీరే గమనించగలుగుతారు.

ఇంకెందుకాలశ్యం.  మొదలు పెట్టండి కొత్తిమిర వైద్యం. (27-01-2012)

14 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

రక్తంని హుస్సేన్ సాగర్ తో పోల్చి కిడ్నీ తో వచ్చే సమస్యలని గురించి చక్కగా చెప్పారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

సార్, మీరు రష్యా గురించి రాసిన వ్యాసాలు ఎక్కడ ఉన్నాయి? కొంచెం లింక్ ఇస్తారా? Thanks in advance.

SriRam

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - సాంకేతిక విషయాల్లో నా అజ్ఞానాన్ని మన్నించండి.అజ్ఞాత అని పేరు, ఈ మెయిల్ ఏదీ లేకుండా రాసినప్పుడు లింక్ యెలా పంపాలో తెలియడం లేదు. మీ కోసం నా మెయిల్ ఐ డి ఇస్తున్నాను. మీరు మెయిల్ పంపితే వ్యక్తిగతంగా జవాబు రాస్తాను - భండారు శ్రీనివాసరావు (చివర్లో ఇంగ్లీష్ లో శ్రీరామ్ అని వుంది.అది మీ పేరా?)bhandarusr@yahoo.co.in OR bhandarusr@gmail.com

vkbabu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
vkbabu చెప్పారు...

శ్రీనివాసరావు గారు ఇలా అడుగుతున్నందుకు అన్యధా భావించవద్దు. ఈ కొత్తిమీర వైద్యం నిజంగా పనిచేస్తుందా? మీరు స్వయంగా వాడారా లేక ఈ ఆర్టికల్‌ను ఎక్కడినుండైనా కాపీ అండ్ పేస్ట్ చేసారా? మీరు స్వయంగా వాడి చెబితే మాత్రం వేల్యుబుల్ ఆర్టికల్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@VK BABU - చాలా నెలలక్రితం నెట్లో కనబడ్డ ఇంగ్లీష్ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించడం ఒక్కటే నేను చేసింది. ప్రయోగించి అనుభవపూర్వకంగా తెలుసుకుని రాసింది కాదు.- భండారు శ్రీనివాసరావు

Unknown చెప్పారు...

అవునండి నిజమే... నేను కూడా ఈ మద్య టీవీ లో చూసాను... రుజువు లెందుకు... పనిచెయ్యక పొతే ....రూపాయి కర్చుతో పోయేదేమీ లేదు గా :) .... మంచి ఇన్ఫర్మేషన్ .

ధన్యవాదాలు.సుదీర్
http://techwaves4u.blogspot.in
తెలుగు లో టెక్నికల్ బ్లాగు

Kaay చెప్పారు...

మరి మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేదండి. అయినా ఒక సారి చేసి పది రోజులు తాగ వచ్చు అంటున్నారా ?

Rama Rao K చెప్పారు...

This article is highly misleading. If someone has damaged kidneys, this 'chitka' medicine will not work. And if someone has healthy kidneys (confirmed by blood tests and ultrasound etc) there is no need to resort to such gimmicks. Kidney damage is caused by various reasons specially if one has high blood pressure, diabetes etc. Also prolonged use of steriods, pain killers may also cause kidney damage. I strongly advocate people to stop resorting to chitka medicines and get proper medical care. Finally,before rushing to publish such unverified reports, ask for evidence, proper references, research papers, double-blind studies etc.

gajula sridevi చెప్పారు...

చాల బాగుంది సారు.

అజ్ఞాత చెప్పారు...

"కిడ్నీకి, కొత్తిమిరకు వున్న బాదరాయణ సంబంధం ఏమిటన్న మాట అటుంచి"

Why? Like Ramar Pillai's herbal Petrol, throwing something on public?

అజ్ఞాత చెప్పారు...

hoo

entamadi Kidny patients nayam chesaaru kottimira tO? adi koodaa chebite baagundedemo.

Siri చెప్పారు...

Thanks for sharing..You have written very well, I have written here Baby Names In Telugu