రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ కార్డు తీసి ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మన కార్డు తీసి పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.
జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ
నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన
వారికి.
పుట్టి
కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ
నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం.
ఇంకొంచెం ముదిరితే పాస్ పోర్టు,
వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.
పాతికేళ్ళు
వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే
వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.
హైదరాబాదులో
ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. అదీ పంచదార కోసం.
అందరిలాగే ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక
తప్పలేదు. వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి
పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా
తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన
ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని
స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి
వెళ్ళారు.
తరువాత
కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు
ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.
అమెరికా
వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై
ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న
ఉద్యోగం చలవే.
బ్యాంకు
కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ
ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్
కార్డు లేకపోతె బహుశా నాకు జీవితంలో బీపీ
రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా
డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే
తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.
ఆధార్
కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే
తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి
పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో decomposed dead body లాగా వుందని, ఇంటి నుంచి
కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు గుర్తింపు కార్డు.
విధిగా
తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు
వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు,
స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. ఈ మూడు కూడా
పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.
ఇక
వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత నలభయ్ ఆరేళ్లుగా.
దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు
కార్డు,
రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు
టిక్కెట్టు ధరతో తిరిగే మరో కార్డు. స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు
వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను.
వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. విజిటింగ్ కార్డు. ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే
కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు
అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే
ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.
పొతే, సగంధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే
పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.
మాస్కోలో వున్న అయిదేళ్ళూ మాస్కో రేడియో వారి గుర్తింపు
కార్డు (ప్రోపుస్కా) వుండేది. రేడియోలో ప్రవేశానికే కాదు, మాస్కోలో తిరిగేటప్పుడు కూడా గుర్తింపు కోసం హమేషా అది
దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది.
విచిత్రం ఏమిటంటే నేను సుదీర్ఘ కాలం పనిచేసిన రేడియో, దూరదర్సన్
లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను
తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా
జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.
రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు,
సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.
మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు
క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.
జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం
లేదు, ఎందుకంటే
అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ
అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని
దేశాలు తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు.
ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.
6 కామెంట్లు:
PMకి
// “ నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు.” //
నిజానికి బ్యాంకులు ఖాతా తెరవడానికి ఏనాటి నుండో అనుసరిస్తున్న సూత్రం ఇది. నేను ఫలానా అని నేనే చెప్పుకుంటే చాలదు, నేను నేనే అని మరొక ఖాతాదారుడు నన్ను ధృవీకరించాలి. దాన్నే “ఇంట్రడక్షన్” అంటారు. శతాబ్దం పై బడిన విధివిధానం ఇది. జనాలు విసుక్కున్నా, ఎగతాళి చేసినా కూడా ఈ పద్ధతి బేసిక్ అవసరం. సరే, ఇప్పుడు KYC అనే సరికి జనాలకు మారు మాట్లాడకుండా అలవాటై పోయింది. బ్యాంకులే కాదు, దాదాపు ప్రతి వాడికీ KYC జపం అయిపోయింది.
@విన్నకోట నరసింహారావు: “మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
కౌంటర్ లోని ఉద్యోగి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.
''రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.''
ONLY one rupee note is printed by Government of India and it is signed by the secretary,Ministry of finance.Government of India. All other notes are printed by Reserve Bank,hence they are called Bank notes or in general only promissory notes, signed by the Governor Reserve Bank of India.. ONE rupee note is not like that.
ONLY ONE rupee note printed by Government to show the sovereignty of the Government.
All coins are printed by RBI
“అజ్ఞాత” గారు,
బాగా చెప్పారు. అయితే చివరలో ఒక సవరణ - Coins are minted by Govt of India Finance Ministry and not by RBI.
RBI merely circulates the coins.
Chiru DreamsJuly 14, 2021 at 6:14:00 PM GMT+5:30
నీ ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడుకో....ఇంకో విషయం రా. నీ కూతిరి మైయిల్ ఐడీ త్రాక్ చెయ్యడం మొదలు పెట్టాం. అది దొరకగానే, నీ సంస్కృత వేద పటిమ అంతా దానికి చూపిస్తాం....నీలాంటి వుగ్రవాదులకి అదే శిక్ష.
hari.S.babu
అబ్బ,ఛా!
మొన్నటి దాక నేను నాస్తికుణ్ణి, హేతువాదిని అన్నావు,నిన్నటి పొద్దున్న "మా దేవుల్లు,మీ దేవుల్లు" అని ఆస్తికపు దళిత వీరత్వం చూపించావు. కాస్సేపటికే హిందువులు ఎర్రిపప్పలైనట్టు "ఈ హరిబాబు గాడు సాయిబ్బు, పాకిస్తాను నుంచొచ్చాడు.నేను మీ సాటి గిందువుని.నన్ను ఈడు ఏడిపిస్తన్నాడు.నిజవైన బార్తీయులు ఒవులన్న ఉంటె ఈణ్ణి సంపేసెయ్యుండ్రి.నా మానం కాపాడుండ్రి" అని యేడుపు కామెంట్లతో సెంటిమెంటు పండించావు.నిన్నటి మధ్యాన్నం నువ్వే రాముడివైపోయినట్టు "అసలు రాముళ్ళం మేమేనండీ, అసలు రావణుడు హరిబాబులేనండీ!మమ్మల్ని ఈళ్ళు పెతి రోజూ సంపేత్తన్నారండీ!" అని దీర్ఘాలు తీస్తూ వలవల మంటూ కన్నీటి దొంతరల బుడిబుడి యేడ్పులు కూడా యేడ్చేశావు.
ఓరి నీ యేశాలో!ఎన్ని దిక్కుమాలిన రూపాలు ఉన్నయ్యో అన్నీ బయటికి వచ్చేస్తన్నై,హయ్య, హయ్య!నాక్కావలసింది,నీ దగ్గీర ఉంది!నిన్ను నేనడిగింది కూడా ఇదే,నాకు నువ్వెలా కామెంట్లు యేస్తే బాగుంటుందో అలానే కామెంట్లు యేస్తూ గూడా నువ్వే ఏదో ప్లాన్ చేసినట్టు నువ్వు ఇచ్చే బోడి బిల్డప్పు ఏదైతే ఉందో అది ఎట్టా ఉందో సెప్పనా...నువ్వడిగంది ఏదైనా లేదన్నానా అని అప్పుడెప్పుడో సుప్రీ డాళీంగ్ కమల గాసను సుట్టూ తిరగతా గెంతులేసి పాడిన డేన్సు గుర్తొస్తంది.హారినీ!ఆ కిక్కు వల్లేనేమూ నా ఫ్రెండ్సు లిస్టులో ఆ పేరు దొరికింది నీకు.
"శ్రీరాముడ్ణి ఆఖర్లో తగిలించి, "చూశావా! రాముడు మాలాంటి దొంగనాకొడుకులకి దేవుడు. అలా రాముడ్ణి ఎధవని చేసి, గొడవలు రేపుతాం." అంటున్నావు, నిజంగా చేస్తావా!చేసి చూడు దిమ్మ దిరిగి బొమ్మ కనపడే ఎదురు దెబ్బ కొడతా.
వూరూ పేరూ చెప్పుకోలేని తొకడా గాడివి నీకే అంత దృశ్యం ఉంటే 190 దేశాలలో అభిమానులు ఉన్న నాకు ఉండదా?ఆహాఁ!నా కూతురి మెయిల్ ఐడీ ట్రాక్ పెట్టావా!అమ్మ బాబోయ్,ఇదంతా సూపిస్తవా!ఏదీ నువు నన్ను "నా కొడకా!" అనటం కూడా సూపిస్తవ, అది దాచేస్తవ!
నీకంత కషటం అక్కర్లే!ప్రతి రోజూ ఆ రోజుకి పడిన అన్ని కామెంట్లనూ స్క్రీన్ షాట్స్ తీస్తున్నా.నేనే నీమీద హిందూమతాన్ని అవమానించటం, మాత్సామరస్యాన్ని దెబ్బతియ్యటం,వేదమంత్రాలకు పెడర్ధాలు తీస్తూ వెకిలి కామెంట్లు వెయ్యటం,ప్రతికక్షుల్ని తాగుబోతులనీ మెంటలోళ్ళనీ వ్యక్తిగత దూషణ చెయ్యటం లాంటి అన్ని సెక్షన్లనీ ఉపయోగించుకుని కేసు వెద్దామని చూస్తున్నాను.సరే, నువ్వు వేస్తే మరీ భేషుగ్గా ఉంటుంది - నామీద కేసు వేసి నువ్వు బొక్కలోకి వెళ్ళటం భలే క్యామిడీగా ఉంటదిలే.
నేనయితే కూతురి మెయిల్ ఐడీలు ట్రాక్ చెయ్యటం లాంటి పిచ్చి పన్లు చెయ్యను.మంచి హ్యాకర్ని పెట్టుకుని నువ్వు దూల కొద్దీ కామెంట్లు వేసే బ్లాగులని జల్లెడ పట్టి నీ వివరాలు పట్టుకున్నాక నీ ముందుకే వస్తాను.బతికుంటే మీ అమ్మకి చూపిస్తా, పెళ్ళయి ఉంటే నీ పెళ్ళానికి చూపిస్తా.అదిరా దమ్మున్న మగాడు శత్రువు మీద పగ తీర్చుకునే పద్ధతి.నిజం మాట్లాడేవాడికే ఉంటుంది అలాంటి దమ్ము.నోరు తెరిస్తే అబద్ధాలు అత్ప్ప ఒక్క నిజం కూడా చెప్పని నీకు anta దమ్ము లేదు.ఒకసారి ఇప్పటికే నీకు జరిగిన డ్యామేజి చూసుకో ఎవడు ఎవణ్ణి కొట్టాడో తెలుస్తుంది.అంతే గానీ "కొట్టిందెవడో తెలియదు గానీ లేపింది మాత్రం నన్నే" అంటూ చింతామనీ నాటకంలో సుబ్బిశెట్టిలా బింకాలు సూపుస్తా బీరాలు సెప్పకు.
ఇప్పుడు నువ్వున్న పొజిషన్ యేంటి?మళ్ళీ "నేను హేతువాదిని, నాస్తికుణ్ణి" అని హిందూమతం మీద గానీ రాముడు మీద గానీ కారుకూతలు కుయ్యగలవా?ఇన్నేళ్ళు నువ్వు బూతులు తిట్టిన రాముడితో ఇప్పుడు నిన్ను నువ్వు పోల్చుకోవడం కన్న దౌర్భాగ్యం/నీచత్వం ఇంకొకటి ఉందా!పతనం అంచులకి వెళ్తూ కూడా ఇంకా నువ్వు చేస్తున్నది నీకే ప్రమాదం అని తెలియని వెర్రితనంతో రెచ్చిపోతున్నావు.
అదే, అదే, అదే నేను కోరుకున్నది!జారు, అలా జారు, జారడంలోనే ఉంది జోరు - భయంతో బొటబొట నువ్వు పోసుకున్న ఉచ్చలూ సూర్యుడి మీద ఉమ్మబోయి ముఖాన పడి జారిన ఉమ్ములూ కలిసిన బురదలో బూతుబాతులా ఈదులాడు.అలా జారు ఇలా జారు, భలే జోరు....
జై శ్రీ రాం!
కామెంట్‌ను పోస్ట్ చేయండి