17, జులై 2021, శనివారం

దేవుళ్ళు మిస్సింగ్

 ఏదో ఛానల్ కు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చేసరికి ముక్కోటి దేవుళ్ళందరూ హూష్ కాకి.మిస్సింగ్ కేసు కాదనీ,

వాళ్ళందరికీ మా ఆవిడ గ్రహణం విడుపు అభ్యంగనస్నానం చేయిస్తోందని ఆలస్యంగా అందిన సమాచారం.అమ్మయ్య! గ్రహణం విడుపు స్నానాలు పూర్తయి దేవుళ్ళందరూ తమ గూటికి చేరారు. పుష్పా‌లంకరణ ఒక్కటే ఈ పూటకి మిగిలింది.

ఆ పని కూడా పూర్తి చేస్తేనే కానీ మా ఆవిడ టీవీ రిమోట్ ముట్టుకోదు. సీరియళ్ళ రేటింగుల్లో కాస్త ఆటుపోట్లు వుండే అవకాశం వుంది.

 

17-7-2019

 

సరిగ్గా నెల తర్వాత ఆ దేవుళ్ళు అందరూ వున్నారు, ఒక్క మా ఆవిడ తప్ప.

 

కామెంట్‌లు లేవు: