ఈ
ఆధాన్ ప్రధాన్ ఎందుకయిందంటే
‘ఎందుకండీ
ఈ వెబ్ ఛానల్స్ కు ఇంతర్వ్యూలు. మీరు చెప్పినదానికి, వాళ్ళు పెట్టే హెడ్డింగులకు పొంతన
వుండదు’ అని చాలా మంది హితైషుల హితవచనాలు. ఇదిగో ఆ సమయంలో ఈ ఆధాన్ టీవీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు.
ఇందులో నాకు కనిపించిన ప్లస్ పాయింట్లు ఏమిటంటే :
ఇది
లైవ్ టెలికాస్ట్. మనం చెప్పింది చెప్పినట్టు అప్పటికప్పుడే గాలిలో కలుస్తుంది. మధ్యలో కత్తిరింపులు, యాడింగులు గట్రా వుండవు. శీర్షికల
తలనొప్పిలేదు.
చెప్పిన
ప్రతి మాటకు మనమే బాధ్యులం. నేను అలా అనలేదు అని చెప్పి తప్పించుకోవడానికి
వీలుండదు. అంచేత వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. అది మన మంచికేగా!
పొతే
అంతా జూమ్ వ్యవహారం. యాంకర్ ఒకచోట, మనం మన ఇంట్లో. గడపదాటి బయటకు
పోనక్కరలేదు, ఈ
కరోనా కాలంలో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి