12, జూన్ 2021, శనివారం

పాత స్కేలు బద్దలం – భండారు శ్రీనివాసరావు

 చిన్నప్పుడు స్కూల్లో  చదువుకునే రోజుల్లో  చెక్కతో చేసిన స్కేలు వాడే వాళ్ళం. అందులో అంగుళం, అర అంగుళం,  పన్నెండు అంగుళాలు ఒక అడుగు ఇలా కొలతలు ఉండేవి. ఆ స్కేళ్ళ స్థానంలో ప్లాస్టిక్ స్కేళ్ళు వచ్చాయి. చూడముచ్చటగా వుండే వాటిని కొనుక్కోవాలని మనసు ముచ్చట పడేది. ఆ కోరిక తీరకుండానే స్కూలు చదువు ముగిసింది.

ఇప్పటి తరం పిల్లలు కూడా స్కేళ్ళు వాడుతున్నారు. కానీ వాటిల్లో కొలతలు మిల్లి మీటర్లు, సెంటి మీటర్లు. వీళ్ళకు అంగుళాల స్కేలు బద్దలు గురించి తెలియదు. అది సహజం. వాటిని వీళ్ళు ఎప్పుడూ చూసి కూడా వుండరు.

తరాల మధ్య అంతరం కూడా ఇంతే. ఈ వాస్తవాన్ని పాత తరం, అంటే నా బోటివాళ్ళు సదా గుర్తు పెట్టుకోవాలి.

‘మా కాలంలో అంటూ మొదలు పెడితే ఈ కాలంలో కుదరదు.

(12-06-2021)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అదేమిటండీ, ఈ కాలపు ప్లాస్టిక్ స్కేల్ నా దగ్గరుంది. దాని మీద సెంటిమీటర్ల క్రింద అంగుళాలు కూడా మార్క్ చేసున్నాయే 🤔? మెట్రిక్ సిస్టం అని చెప్పి ఈ
తరం పిల్లలకు స్కూళ్ళల్లో అంగుళాలు, అడుగులు,గజాల కొలమానం నేర్పెంచడం లేదేమో బహుశః 🤔?