యాంకర్ : చర్చలోకి వెళ్ళే ముందు ఓ వార్తా కధనం ప్రసారం చేస్తాము. శ్రద్ధగా చూడండి. ఎందుకంటే మనం చర్చించబోయేది ఈ అంశం మీదనే.... చూసారు కదా! ఈ కధనానికి రుజువులు లేవు. సాక్ష్యాలు లేవు. సాక్షులు లేరు. ఇది ఎక్కడా మీడియాలో రాలేదు. కోర్టుకు పొతే నిలవదు. అది ముందే చెబుతున్నాను. కానీ ఇది నిజమని మా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. కానీ మా దగ్గరా ఆధారాలు లేవు.
ఆ ఇద్దరు రాజకీయ నాయకులు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. వున్నట్టుండి విడిపోయారు. బద్ధ శత్రువులుగా మారిపోయారు. వీళ్ళిద్దరూ విడిపోవడానికి డబ్బు లావాదేవీల్లో వచ్చిన తగాదా. అలా అనడానికి కానీ, డబ్బులు ఇచ్చి పుచ్చు కున్నారనడానికి చెప్పడానికి కానీ ఎలాంటి ఆధారాలు లేకపోయినా అదే కారణం అని మా నమ్మకం.
“ఇప్పుడు చెప్పండి మీమీ పార్టీల అభిప్రాయాలు. వాళ్ళు విడిపోవడానికి డబ్బే కారణం అని మీరు కూడా నమ్ముతున్నారా! నమ్మితే ఎందుకు నమ్ముతున్నారు. అందుకు మీ వద్ద వున్న ఆధారాలు ఏమిటి?”
భవిష్యత్తులో దీన్ని మించిన ఊహాగానాల చర్చలు వచ్చినా ఆశ్చర్యం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి