ఇది ముళ్ళపూడి వారు సృష్టించిన పదం
“పెళ్ళయి పదేళ్లవుతున్నా పెళ్ళానికి పుట్టింటి
పేరు మీదనే ఉత్తరాలు వస్తుంటే ఆ మొగుడు ముండావాడిని ‘నస్మరంతిగాడు’
అంటారని అప్పుడెప్పుడో రాఘవయ్య గారి జ్యోతి పత్రికలో ఆయన రాశారు. అంటే, ఎవరూ పట్టించుకోని వాడిని గురించి
ముళ్ళపూడి వెంకట రమణ గారు తనదైన శైలిలో అలా భాష్యం చెప్పారు.
ఫోను సంభాషణలో ఈ విషయం నానుంచి విన్న మిత్రుడు
ఒకరు మరో ఆసక్తికరమైన విషయం దీనికి జోడించాడు.
“ఈ ఫేస్ బుక్ ప్రపంచంలో పోస్టు పెట్టి పది గంటలు అయినా
ఒక్క లైకు కానీ,
చిన్నమెత్తు కామెంటు కానీ రాకపోతే అతడ్ని కూడా నస్మరంతి అంటారుష”
1 కామెంట్:
>> పోస్టు పెట్టి పది గంటలు అయినా ఒక్క లైకు కానీ, చిన్నమెత్తు కామెంటు కానీ రాకపోతే అతడ్ని కూడా నస్మరంతి అంటారుష
ఫేస్‌బుక్ అనేమిటీ బ్లాగులకూ ఇది భేషుగ్గా వర్తిస్తుంది కదా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి