7, ఏప్రిల్ 2021, బుధవారం

అద్దంలో మొహం ఎలా కనబడుతుంది? - భండారు శ్రీనివాసరావు


ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటె అద్దం అబద్దం చెప్పదు కనుక.

మరోలా కనబడాలంటే ఏమి చెయ్యాలి? ఊహించుకోవడం ఒక్కటే మిగిలినదారి.
అదే ఇప్పుడు జరుగుతోంది ఆంద్ర ప్రదేశ్ లో.

పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే!

ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే ఇందులోని విషాదం.

9 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

అసలువిషాదం వేరే ఉందండీ. అదే అన్ని రకాల విషాదాలకూ మూలం. ప్రజలకు ఈరోజున వినోదం తప్ప మరేమీ అక్కర్లేదు. నిండా మునిగిన వాడికి చలేమిటీ అన్న ధోరణిలో పడి ఉన్నారు. రాజకీయాల గురించి ఆలోచించటం అంటే తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్నది స్పష్టంగా ఆలోచించుకోవటం అన్న దృక్తథం ఎక్కడా కనిపించటం లేదు. రకరకాల ఆలోచనలు చేసి మేలుకీళ్ళు ఎంచుకోవటం లేదు. ముఖ్యంగా ఆంధ్రాలో ఐతే మనోడా పైవోడా అన్నది ఒకటే కొలబద్దగా పెట్టుకున్నారని అనుకోవచ్చునేమో. ఎందుకంటే వినోదం కోసం సమయమూ డబ్బూ వెచ్చించటానికి అలోచిస్తున్నారే తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించు కోవటానికి శ్రధ్ధ చూపుతున్నారని నాకైతే అనిపించటం లేదు. ఇలా అన్నందుకు నాకుతాటాకులు కట్టేందుకు కొందరు సిధ్ధంగా ఉండవచ్చును కాని నా అభిప్రాయం చెప్పటంలో తప్పు లేదని అనుకుంటాను.

అజ్ఞాత చెప్పారు...

ఇందులో తాటాకులు కట్టేదేముందిలేండి. బ్లాగరు అన్నది ఆంధ్రజ్యోతినే అనుకోని మీరు భుజాలు తడుముకుంటున్నారు. మీకు, సంకటక్రిస్నకి తప్ప ఆంధ్ర భవిష్యత్తుగురించి ఎవ్వరికీ ఏడుపులేదు.

అజ్ఞాత చెప్పారు...

@Pai ajnatha: ఏంటి ?? శ్యామలీయం గారు ఆంధ్రజ్యోతి అభిమానులా ?? you are kidding ??

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
Chiru Dreams చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
Unknown చెప్పారు...

హనుమంతులోరుమాత్రం, రామభజన చేసుకుంటూనే యుద్ధాలు చెయ్యలేదా? ఆయన రాములోరికోసం, ఈయన చంద్రులోరికోసం.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.