7, జూన్ 2016, మంగళవారం

మరపుల మడతల్లో ....


ఖమ్మం జిల్లాలో  మొట్టమొదటి కాలేజీని ప్రారంభించడానికి అప్పటి హైదరాబాద్  స్టేట్  ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఖమ్మం వచ్చారు. ఖమ్మం గుట్టల బజారులో వున్న గోడౌన్లలో కాలేజీ పెట్టారు. ముఖ్యమంత్రి వచ్చిన నాన్ ఏసీ అంబాసిడర్ కారులో ఆయనతో పాటు మాకు బాబాయి వరుస అయ్యే బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు కూడా వచ్చారు. ఎలాటి హడావిడీ లేదు.
బూర్గుల గారు తమ ఉపన్యాసంలో చెప్పారు.
‘తెలంగాణా మొత్తంలో అటు హైదరాబాదు, వరంగల్ మినహాయిస్తే ఎక్కడా కాలేజీలు లేవు. అందుకే జిల్లాకు ఒక కాలేజీ పెట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఖమ్మం వంతు. పెద్దలు బొమ్మకంటి గారు ఖమ్మం వచ్చి తీరాలని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాబద్ధుడనై వచ్చాను’.


శ్రీరామభక్త గెంటేల నారాయణరావు గారు ఇచ్చిన విరాళంతో ఖమ్మంలో మొదటి కాలేజీ వచ్చింది. SR & BGNR Government Arts College అని దీని పేరు. ఇప్పుడా కాలేజీని  కలెక్టర్ ఆఫీసు సమీపంలో విశాలమైన ప్రాంగణానికి మార్చారు.   

4 కామెంట్‌లు:

chavera చెప్పారు...

ఙ్ఞాపకాల పొరలలో, లాగా మరపుల మడతలలో మంచి ప్రయోగం!

Zilebi చెప్పారు...



మరపుల మడతల విడమరి
చిరిగద ! బూర్గుల విశేష చిత్రముజూపెన్ !
విరివిగ నాటి కథల తెలి
పిరి భండారు వివరముగ బిజిబిజి లయిఫున్ !

Unknown చెప్పారు...

Kudos to you sir, The narration is exciting. Appreciate. Reading your blog is like a screen play and, sequence of events roll. keep going. gentela diwaker

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@chavera @ Zilebi @ Gentela Diwaker - THANKS