అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి
పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన
కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ
రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే
పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని
ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ
వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో
ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును
కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి
వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో
మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి
ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన
వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు
నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం
కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే
వారి సంఖ్య పెరిగింది.
సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న
విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతో, ఆమె
తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన
పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా
చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన
గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా ఆయనగారితోనే
కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ
అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ
పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు.
గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ
వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు.
4 కామెంట్లు:
//ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది//
యుద్దములో తుపాకీ పట్టుకుని వెల్లి, చచ్చిన వారినీ, క్షతగాత్రులైన వారినీ అస్సలు పట్టించుకోలేదన్న మాట ఈ దుష్ట కమ్యూనిష్టు ప్రభుత్వం.
నో వండర్, అతి త్వరగా కుప్పకూలింది.
మనుషులు చాలట్లేదు గనక అతివలకి అవకాశం పేరుతో పని రుద్దడం తప్ప నిజంగా స్త్రీజానోద్ధరణ వారి ఉద్దేశ్యం కాదని తెలుస్తూనే ఉంది.
నెలలు, సంవత్సరాలు ఇంటి పట్టున ఉండని మగాడితో కుటుంబానికి అనుబంధం ఎలా నిలుస్తుంది ఆరోజుల్లో? అందుకే కుటుంబ వ్యవస్థ కుంటుపడి సమాజం దెబ్బతినిపోయింది.
@అజ్ఞాత చెప్పారు...
యుద్దములో తుపాకీ పట్టుకుని వెల్లి, చచ్చిన వారినీ, క్షతగాత్రులైన వారినీ అస్సలు పట్టించుకోలేదన్న మాట ఈ దుష్ట కమ్యూనిష్టు ప్రభుత్వం.
@సూర్య చెప్పారు...
మనుషులు చాలట్లేదు గనక అతివలకి అవకాశం పేరుతో పని రుద్దడం తప్ప నిజంగా స్త్రీజానోద్ధరణ వారి ఉద్దేశ్యం కాదని తెలుస్తూనే ఉంది.
hari.S.babu
ఫెయిలైపోయిందని రూఢిగా తెలిశాక ఎన్ని వెక్కిరింతలైనా చెయ్యొచ్చు.కానీ,అది సక్సెస్ అవుతున్న రోజుల్లో అందరూ ఆకాశాని కెత్తెయ్యడం కూడా ఇలానే చేశారు - మానవత్వానికే మారురూపాలనీ హెవెన్లకే హెవెన్ అనదగ్గ అభివృద్ధి రైలుబండికి విజిల్ బ్లోయర్లనీ దోపిడీ దొంగల్ని కన్నంలోనే కనిపట్టేశారనీ వూదరగొట్టేశారు.దొందూ దొందే!
ఎవరు ?
బయటుండే తెలివిలేని కమ్మీలే కదా ?
ఆ ఎర్రడబ్బాలకు ఏమీ తెలీదని, ఓ పిచ్చి పుస్తకమే వాల్ల భగవద్గీత, ఖురాన్ అని ఎంతో మంది మొత్తుకుని చెప్పారు. ఒక్కసారి బాగా అణిగిన తరువాత, మూసుకుని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి