30, ఆగస్టు 2013, శుక్రవారం

ఎంతో బాధతో, ఆవేదనతో ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.


కేంద్రంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా జైపాల్ రెడ్డి గారు నాడు ఆకాశవాణి, దూరదర్శన్ లను ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి తొలగించి  ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన ‘ప్రసార భారతి ‘ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు సంతోషించిన ప్రజాస్వామ్య ప్రియుల్లో నేనూ ఒకడిని. కానీ, ఈ రోజు ఉదయం (30-08-2013) దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో ‘న్యూస్ అండ్ వ్యూస్’ అనే ఇంగ్లీష్ పేరు కలిగిన తెలుగు కార్యక్రమాన్ని చూసినప్పుడు ఆ సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగిగా సిగ్గుతో తల దించుకున్నాను.
చర్చలో  పాల్గొంటున్న  రాజకీయ పార్టీల ప్రతినిధులిద్దరు - బహిరంగంగా, బాహాటంగా. నిస్సిగ్గుగా – “ముయ్యి, నువ్వు  మూస్కో, నోరు ముయ్యి,  నువ్వు నోరు మూస్కో’ అంటూ ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఆ దృశ్యాలను చూడాల్సిన దయనీయమైన  పరిస్తితి దూరదర్శన్ వీక్షకులది కావడం ఎంతటి దురదృష్టం.

ఇదా దూరదర్శన్ కు  జనం కోరుకున్న ప్రత్యేక ప్రతిపత్తి. ఇదా ప్రజలు ఆశించిన స్వేచ్ఛ. రేటింగులతో నిమిత్తం లేని ప్రసార మాధ్యమం  కూడా ఈవిధమైన చౌకబారు విధానాలను అవలంబించడం ఎంతవరకు సమర్ధనీయం. వార్తల సేకరణలో, ప్రసారంలో స్వేచ్చను ఎవరూ తప్పుపట్టరు. కానీ, ప్రజాధనంతో నిర్వహించే సంస్థల్లో ఈరకమైన వైఖరి యెంతవరకు సబబో దూరదర్శన్ అధికారులే ఆలోచించుకోవాలి? స్వేచ్ఛకు సయితం హద్దులు వుంటాయన్న వాస్తవాన్ని గమనంలో వుంచుకోవాలి. – భండారు శ్రీనివాసరావు               

5 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

good one. విచ్చలవిడితనం స్వేచ్చ కాదు. స్వేచ్చ అంటే హద్దులలోనే ఉంటుంది. ఉండాలి. మనసు ప్రధానమైన మనిషి స్వేచ్చకు - మనసులేని జంతు స్వేచ్చకు తేడా అదే.

Chandu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Chandu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Chandu చెప్పారు...

inthaa ka mundhu ee private channels godavala ku thal nosthunte , ventane spathagiri petttuku ne vanni ... chusthunte aa avkasham kuda lekunda cheselaa vunnare

సూర్య చెప్పారు...

మీ పోస్టు చదివాక వెంకీ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ "మాట తప్పుతున్నారు.." గుర్తొచ్చింది. ఎందుకంటే నాలుగు మాటలు అని చెప్పి అంతకంటే ఎక్కువ పదాలే వాడారు. హిహిహి.
నవ్వులని కాస్త పక్కన పెట్టి ఆలోచిస్తే ఇది మన తెలుగువారిలో చాలామందిలో ఉన్న లోపం. అవతలివారు మన అభిప్రాయాన్ని అంగీకరించకపోతే చాలు ముయ్యి, మూస్కో అని మాటలు వాడేస్తుంటారు. పొరపాటున ప్రశ్నించామా "మా వైపు ఇలాగే మాట్లాడుతారు, ఇదే మా సంస్కృతి" అని కవర్ చేసుకుంటూ ఉంటారు. సినిమాలని చూసి కాలేజ్ కుర్రాల్లు అనుకరిస్తున్న దరిద్రాలలో ఇది ఒకటి. మన రాష్ట్రం లో ఉన్నంతవరకు ఇలాంటి ప్రవర్తన పెద్దగా అభ్యంతరకరం కాకపోవచ్చుగాని, రేప్పొద్దున్న బ్రతుకు తెరువుకోసం రాష్ట్ర హద్దులు దాటినపుడు మాత్రం మనవారు చాలా ఇబ్బందిపడతారు.