మహాభారతంలో ఒక కధను ప్రసిద్ధ హాస్య రచయిత ఎంబీఎస్
ప్రసాద్ గుర్తుచేస్తున్నారు. ఇది చదివిన తరువాత భుజాలు తడుముకుంటే ఆయన పూచీ లేదు. కాకపోతే
హాయిగా నవ్వేసుకోవచ్చని మాత్రం పూచీ ఇస్తున్నాను. నవ్వగలిగిన వాళ్ళు మాత్రమే
చదవండి సుమా!
“దృతరాష్ట్రుడు పేరుకు రాజే కాని గుడ్డివాడు.
అతని తమ్ముడు పాండురాజు అతని పేరు మీద
యుద్ధాలు చేసి రాజ్యాన్ని వృద్ధి చేసాడు. అతని పిల్లలు ప్రజ్ఞావంతులు. దాంతో దృతరాష్ట్రుడికి దిగులు పట్టుకుంది. లక్క ఇల్లు దహనం తరువాత
పాండవులు వున్నచోటికి విదురుడిని పంపి వారిని హస్తినాపురానికి రప్పించాడు.
“ధర్మరాజుని పిలిచి - ‘రాజ్యాన్ని చీల్చి నీకూ, నీ
సోదరులకు అర్ధరాజ్యం ఇచ్చేస్తున్నాను. అయితే
నీకిచ్చే అర్ధరాజ్యం హస్తినాపురం కాదు. కొత్త చోటు. నా పిల్లలు మంచి వాళ్ళు కాదు.
మీకు హాని తలపెడతారు. అది నేను చూడలేను. అంచేత మీరు ఎంచక్కా ఖాండవ ప్రస్థం
వెళ్ళిపొండి. ఆక్కడ మిమ్మల్ని ఎవరో బాధించరు. ఎందుకంటే, అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ప్రస్తుతం అది దుర్గమం,
నిర్జనం. వెళ్లి దాన్ని హాయిగా ఏలుకొండి”
అని పాండవులను పంపేశాడు. శుభం భూయాత్!
Courtesy Shri M.B.S.Prasad (Great Andhra.com)
3 కామెంట్‌లు:
ఎంబీఎస్ గారి కాలం నేను ప్రతి రోజు తప్పకుండా చదువుతాను. మా బామ్మ చెప్పేది - మా అబ్బాయి మంచి వాడు కాదు వూరికె మొట్టికాయలేస్తాడు కాబట్టి మీ అబ్బయి నెత్తిన రేగి కంప పెట్టుకోండని.
Frankly MBS Prasad is an idiot. You should know better than to republish his nonsense!
ho ho ho ho ha ha ha ha ha ha ho ho ho ho ha ha ha ha kadupu chekkalautundi.
dharmaraju : kurnool aithene pota lepote le
arjunudu : naku 5 lakhs crores package kavali
beemudu : hastinanu UT cheyali
naludu : pednana mataki kattubadi unta
sahadevudu : na daggara brahmastram undi hastina naade....
కామెంట్‌ను పోస్ట్ చేయండి