26, ఆగస్టు 2013, సోమవారం

పండిత సంవాదం



ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు,కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు.ఇంటర్వ్యూ రోజున విశ్వవిద్యాలయం  తెలుగు శాఖాధిపతిఅభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. 
తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు :  ("నన్నే గుర్తించ లేదాపైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని... ) విశ్వనాథ సత్యనారాయణ.
తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) నేనేం కావ్యాలువ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురానీలాంటి వాడు ఉన్నంతకాలం  విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను” ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)
తరువాత విశ్వనాథ వారు  విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం  దురదృష్టం
చాలా ఏళ్ళ తరువాత  విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ 

కొసమెరుపు :

విశ్వనాథ వారు  విషయాన్ని బయటపెట్టాకరిటైరైన  తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇదినిజమేనా? " అని అడిగాడుదానికి  సాహితీమూర్తి సమాధానం 
“ఆయన మహాకవి అని నాకు తెలుసుకాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడాఅభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు."


ఆయన ఆనాటి  తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.
సేకరణఆచార్య ఫణీంద్ర

3 కామెంట్‌లు:

Vinjamuri Venkata Apparao చెప్పారు...

నేను ఉస్మానియా లో చదవు కున్నాను... దివాకర్ల . నారయణ రెడ్డి గారు, రామరాజు గారు మా గురువులు.... ఈ సేకరణ సత్య దూరం... విజయవాడ లో సత్యనారయణ గారు SRR colleage లో పందితలు....ఇది ఒక కల్పితం...

Vinjamuri Venkata Apparao చెప్పారు...

నేను ఉస్మానియా లో చదవు కున్నాను... దివాకర్ల . నారయణ రెడ్డి గారు, రామరాజు గారు మా గురువులు.... ఈ సేకరణ సత్య దూరం... విజయవాడ లో సత్యనారయణ గారు SRR colleage లో పందితలు....ఇది ఒక కల్పితం...

hari.S.babu చెప్పారు...

అవును కల్పితమే కావచ్చు. విశ్వనాథ వారు విజయవాద యస్.ఆర్.ఆర్ లో పని చేసారు. యన్.టి.రామారావు ఆయన స్తూడెంట్.