పెళ్ళికి పూర్వం తర్వాత నేనూ మా ఆవిడ – భండారు శ్రీనివాసరావు
పెళ్లి కాక ముందు నేను వీర
దైవభక్తుడిని కాకపోయినా చిన్నతనం నుంచి దేవుడంటే భయం భక్తీ పుష్కలంగా ఉండేవి.
పొద్దున్నే లేచి రాముడు మంచి బాలుడి మాదిరిగా స్నానం వగయిరా ముగించుకుని నుదుటి
మీద విభూతి పట్టీ వేసుకుని అలా నడుచుకుంటూ గవర్నర్ పేట చెట్ల బజారులోని
శివాలయానికి వెళ్లి ముమ్మారు ప్రదక్షిణలు చేసి, శివలింగం
ఎదుట సాష్టాంగనమస్కారం చేసి దైవ దర్శనం అనంతరం కాసేపు గుడి ప్రాంగణంలోనే
బాసింపట్టు వేసుకు కూర్చుని తెలిసిన స్త్రోత్రాలను బిగ్గరగా చదివిన తరువాతగానీ మరో
పని చేసేవాడిని కాను.
పెళ్ళికి ముందే మా ఆవిడ నాకు తెలుసు.
తలితండ్రులకి ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో ఆమె పెరిగిన తీరే వేరు. ఆడింది ఆటా పాడింది
పాటా. అంచేత ఈ భక్తి కాలమ్ ఆమెలో పూర్తిగా సున్నా.
అలాటిది పెళ్ళయిన తర్వాత పాత్రలు
తిరగబడ్డాయి. అన్నీ కనిపెట్టి చూసే భార్య దొరికిందని, ఇక దేవుడి అవసరం ఏముందని ఆయనపై నేను శీతకన్ను వేశాను. ఇలాటి మొగుడ్ని
కట్టుకున్న తర్వాత ఆ దేవుడే దిక్కనుకుందో ఏమో ఆవిడ భక్తి మార్గం పట్టింది.
ముప్పూటా ఆవిడ పూజలూ, వ్రతాలూ. నేను నా పద్దతిలో మిత్రులతో కలిసి సాయంకాలక్షేపాలు.
ఎవరి గోల వారిదిగా సాగిన మా సంసారం
ఇప్పుడు ఏ గోలా లేకుండా సద్దుమణిగింది.
2 కామెంట్‌లు:
>>ఇలాటి మొగుడ్ని కట్టుకున్న తర్వాత ఆ దేవుడే దిక్కనుకుందో ఏమో ఆవిడ భక్తి మార్గం పట్టింది.
మీలో ఇంత కామెడీ యాంగిలుందా!
పెళ్ళికి ముందే మా ఆవిడ నాకు తెలుసు అని సింపుల్ గా తేల్చేస్తున్నారు . కానీ మీకు ఆవిడ పరిచయం పెళ్లి వరకూ రావడం లాంటివి మీరు ఎప్పుడు రాయలేదు . ఆ పీరియడ్ తప్పిస్తే, మిగతా అన్ని మీరు రాసేశారు ఇంచు మించు
కామెంట్‌ను పోస్ట్ చేయండి