తాళ పత్రాలు, ఘంటాలు, పుల్ల కలాలు, కరక్కాయ సిరాల కాలంలో బతికిన తెలుగు భాష, కలాలు, కాగితాల దశలో అంత్య దశకు చేరుకున్నదేమో అని భయపడ్డాను. అయితే ఇంటర్నెట్ రంగ ప్రవేశం చేసి సంజీవని పుల్లను తాకించి మళ్ళీ ప్రాణం పోసింది. చిన్నా పెద్దా అందరూ తెలుగులో ఎంచక్కా రాసేస్తున్నారు. ఇక భయం లేదు! తెలుగు భాషకు మరణం లేదు
మాతృభాష అంటే నాకు
తగని మమకారం. అందుకే నా అన్ని పోస్టులు తెలుగులో రాస్తున్నానంటే మాత్రం నన్ను నేను
మోసం చేసుకున్నట్టే. సరైన ఇంగ్లీషు నాకు వచ్చివుంటే నా పోస్టులకు రీచ్ కూడా చాలా
పెద్ద స్ధాయిలో వుండేది. కేవలం చక్కటి ఇంగ్లీషు రాదు అనే ఒకే ఒక్క కారణంగా నేను నా
వృత్తి జీవితంలో చాలా పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోయాను. అనేక మెట్లు కిందనే వుండిపోయాను.
జీవితం బోధించిన ఈ పాఠం వల్లనే నేను ఆంగ్ల మాధ్యమానికి మద్దతు పలికాను. కొన్నేళ్ల
క్రితం వరకు రష్యా, చైనాల్లో వారికి ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు. కానీ పోటీ ప్రపంచాన్ని
తట్టుకోవడానికి ప్రత్యేక పాఠశాలలు పెట్టి అక్కడివారికి ఆంగ్లం నేర్పిస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచం
ఎలా వున్నదంటే ఒక్కసారి వెనకపడితే ఇక అక్కడే వుండిపోవాల్సివస్తుంది. ఇది నా అనుభవం
మీద చెబుతున్న వాస్తవం. ఇందులో రాజకీయాలు లేవు
(04-09-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి