30, సెప్టెంబర్ 2021, గురువారం

రేడియో రాంబాబు – భండారు శ్రీనివాసరావు

 నవ్వు ముందు కనబడుతుంది. తర్వాత ఆయన కనబడతాడు.


ఆయనే పేరే రాంబాబు. సీతా రాంబాబు. చెన్నూరి సీతారాంబాబు. ఆఫీసు రికార్డ్స్ లో వేరే పొడుగు పేరు ఏమైనా ఉందేమో తెలవదు. వున్నా ఆయన అందరికీ రాంబాబే. నాకయితే నవ్వుల రేడు.

నవ్వుకు రిటైర్ మెంట్ ఉంటుందా! వుండదు. వుండకూడదు.

అంచేత ఈరోజు రేడియోలో రాంబాబు గారికి ఇస్తున్న వీడ్కోలు ఓ లాంఛనం మాత్రమే. ఆయన చిరుదరహాసం మాత్రం పర్మనెంట్.

రాంబాబు గారి మందహాస వదనం చూడడానికి ఈరోజు పుట్టిల్లు రేడియోకి వెళ్ళాలనే వుంది. ఎలా కుదురుతుందో ఏమో!

రాంబాబు గారికి ముందస్తు  శుభాకాంక్షలు.

భండారు శ్రీనివాసరావు

(30-09-2021)

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

రేడియోలో నవ్వు కనబడదు కదా. అయినప్పటికీ మాట్లాడే పద్ధతి బట్టి తెలుస్తుంది లెండి (రాంబాబు గారు గనక రేడియోలో అనౌన్సర్ అయ్యుంటే) 🙂.

మా తరఫు నుండి కూడా రాంబాబు గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు, ప్రశాంత రిటైర్డ్ జీవనానికీ శుభాకాంక్షలు తెలియజేయండి 💐.