10, ఆగస్టు 2016, బుధవారం

?


చాలా ఏళ్ళుగా అజ్ఞాతంలో వున్నాడని ఓ పక్క  రాస్తారు.
కాల్చి చంపి కొన్ని గంటలు గడవకముందే అతడి హావభావాలు, అతగాడి ఫోను సంభాషణలు, మాట తీరు, నడక తీరు ఒహటా, రెండా  వైనవైనాలుగా కాలాలకు కాలాలు అన్ని పేజీల నిండా వార్తలు. ఏవిటో ఈ చిత్రం.
బుర్రలో బాగా మట్టి పేరుకుపోయింది గావల్ను.
నాకేమీ  అర్ధం కావడం లేదు.

మీకేమైనా అవుతోందా?

2 వ్యాఖ్యలు:

Surya చెప్పారు...

అంటే ఇన్నాళ్ళూ అతని హావభావాలూ అవీ మనకి కనబడుతున్నా అతడు 'ఇతడే' అని తెలీకపోవడంవల్ల పట్టించుకోలేదనీ, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో ఫోటోలవీ చూసి 'ఇతడా' అని తేరుకుని అతడి ఫ్లాష్ బ్యాకునంతా గుర్తుచేసుకుని వివరిస్తున్నారు గామోసని అర్ధంచేసుకోగలరు.

Arun చెప్పారు...

లో గుట్టు పెరుమాళ్ళకెరుక
మాఫీయా గుట్టు మంత్రులకెరుక
మంత్రుల గుట్టు మీడియాకెరుక
ప్రజలొట్టి అమాయకులుగనుక