18, ఆగస్టు 2016, గురువారం

అక్షరాలా ఆరులక్షలు


కొన్నేళ్ళ క్రితం ఈ బ్లాగు ప్రపంచంలో కొత్తగా అక్షరాలు దిద్దడం మొదలు పెట్టినప్పుడు, ఇన్నిన్ని అంశాలపై ఇన్ని వ్యాసాలు రాస్తానని,  రాయగలుగుతానని నేను కలలో కూడా  అనుకోలేదు. ఎందుకంటే అప్పటికి నాకు అన్నీ కొత్తే. కంప్యూటర్ కొత్త. కంప్యూటర్ లో తెలుగు అక్షరాలు టైప్ చేయడం కొత్త. నేర్చుకున్న తరువాత కూడా వేగంగా రాయడం కొత్త.
అయినా కొన్నాళ్ళకే అన్నీ పాతపడిపోయాయి. నేనూ అలవాటు పడిపోయాను.
ఫలితం ఇదిగో ఇవ్వాళ కళ్ళారా చూస్తున్నాను.


ఆరు లక్షల హిట్లు. రెండు వేల రెండువందల పై చిలుకు పోస్టింగులు. పాఠకులనుంచి వందలాది వ్యాఖ్యలు, స్పందనలు, అభినందనలు, చురుక్కుమనిపించే విమర్శలు. అర్ధవంతమయిన సమీక్షలు. తప్పులు దిద్ది సరిదిద్దుకునేలా చేసిన హితవరులు. అబ్బో! చాలా సంపదే కూడబెట్టుకున్నాను.
రాయడం సంగతేమో కానీ, చదవడానికి మాత్రం చాలా కష్టపడాలి. అనుభవం బోధించిన వాస్తవం ఇది. అంచేత...

కష్టపడి నన్నింత  సంపన్నుడిని చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 

(COURTESY IMAGE OWNER)

15 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

రామదాసు గారి బాకీసంఖ్యకి సమానం అన్నమాట 🙂. అభినందనలు 👏.

sarma చెప్పారు...

మరిన్ని లకారాలు చేరుస్తాం లెండి Congratulations (the largest english word with 15 letters) :)

Bhandaru Srinivasrao చెప్పారు...

@sarma - ఇందులో మీ వాటా కూడా వుంది. ధన్యవాదాలు.

Bhandaru Srinivasrao చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు - ఇందులో మీ వాటా కూడా వుంది. ధన్యవాదాలు.

chavera చెప్పారు...

అక్షరాలతో లక్షలు గడించిన బహు లక్షాధికారికి శుభాకాంక్షలు

chavera చెప్పారు...

అక్షరాలతో లక్షలు గడించిన బహు లక్షాధికారికి శుభాకాంక్షలు
Mohan

chavera చెప్పారు...

అక్షరాలతో లక్షలు గడించిన బహు లక్షాధికారికి శుభాకాంక్షలు

Bhandaru Srinivasrao చెప్పారు...

@chavera- ధన్యవాదాలు

Zilebi చెప్పారు...


వాహ్ !శుభాకాంక్షలండీ భండారు వారు !


ఆరు లక్షల వీక్షణ లందు పంచు
కొనుచు తన యనుభవముల కోట గట్టె
గదర తెలుగు పంచదశ లోకమున మేలు
గాను సెహభేషు భండారు గడుసు వారు !

జిలేబి

అజ్ఞాత చెప్పారు...

'భండారు గడుసు వారు' ఏమిటి నీ పిండాకూడు జిలేబి ?
ఆరు లక్షలా? నమ్మబుల్ గా లేదు. ఎక్కడో తేడాకొట్టింది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"తేడా" ఏమిటంటారు? 2008 లో ప్రారంభించి పుంఖానుపుంఖాలుగా టపాలు వస్తున్న బ్లాగుకి ప్రాచుర్యం అధికమవుతుండడం మూలాన అంతకంతకీ వీక్షణల సంఖ్య పెరుగుతూ పోవడం పెద్ద ఆశ్చర్యం అనిపించడం లేదు. అయినా మీ కామెంట్ చూసిన తర్వాత కుతూహలం కొద్దీ ఈ బ్లాగులోనుంచే టపాల రూపంలో బ్లాగరు చెప్పిన సంఖ్యలు తీశాను గత మూడు సంవత్సరాలవి, చూడండి :-

(1). 30-08-2013 (టపా తేదీ) నాటికి 175 000
(2). 11-09-2014 నాటికి 345 678
(3). 16-09-2015 నాటికి 490 490
(4). ఇప్పుడు 600 000

అంటే పై సంఖ్యలు సగటున నెలకి పదివేల వీక్షణలవవూ! ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బ్లాగు కదా.

అజ్ఞాత చెప్పారు...

జిలేబీ జాలం

chavera చెప్పారు...

మంది ఎక్కువ ఐతే మజ్జిగ పలుచన కు వ్యతిరేకంగా,
బ్లాగులు సంఖ్య తగ్గితే,
మంచి బ్లాగులకు వీక్షకులు ఎక్కువౌతారన్న మాట

అజ్ఞాత చెప్పారు...

అనుమానం పక్షి జిలేబీ

Narasimha Rao Maddigunta చెప్పారు...

Congratulations Bhandaru garu