(నిన్న మంగళవారం మా అమ్మగారి తిధి. పితామహః, ప్రప్రితా మహః అంటూ పూర్వీకులను స్మరించేటప్పుడు ఈ విషయాలు స్పురణకు వచ్చాయి)
"ఖ్యాతి, భృగువు భార్య. ఆమె యందు భృగువు ఇద్దరు పుత్రులనుకన్నాడు. వారు పేర్లు ధాత, విధాత. వారి పుత్రులు ప్రాణుడు, మృకండుడు.
ఈ
ఇద్దరికీ జన్మించిన
పుత్రసంతానం
ఇలా వుంది....ప్రాణుని
కొడుకు ద్యుతిమంతుడు.
అతడి కుమారుడు
అజావంతుడు, అజావంతుని
పుత్రుడు వంశుడు.
పొతే, మృకండుముని
పుత్రుడు మార్కండేయుడు.
ఈ మహామునికి జన్మించినవాడు
వేదశిరుడు. ఇక్కడికి
ఇలా ఉండనీ!
నవబ్రహ్మల్లో
ఇంకొకడు మరీచి
మహర్షి. ఈ
మహర్షికి సంభూతి
భార్య. వీరి
సంతానం పౌర్ణమాసుడు.
ఇతడికే విరజుడు
పర్వతుడు అని
ఇద్దరు పుత్రులు.
ఇట్లాగే
మరొక బ్రహ్మ
అంగీరసుడున్నాడు. ఈతని
భార్య స్మృతి.
సినీవాలి, కుహువు, అనుమతి
అనే కన్య
వీరి సంతానం.
అత్రి
మహర్షి అనే
బ్రహ్మకు అనసూయ
సతి. మహాసాధ్వి
ఈమె. వీరికి
సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు
జన్మించారు. స్వాయంభువ
మన్వంతరంలో ఇతడే
అగస్త్యమహర్షి.
పులహునికి
క్షమ యందు
కర్దముడు, చార్వరీవంతుడు, సహిష్ణువు
అని ముగ్గురు
పుత్రులు జన్మించారు.
క్రతువునకు
సంనతి అనే
భార్య వల్ల
బొటనవ్రేలి కణుపు
ఎంత పరిమాణంలో
ఉంటుందో, అంత
ప్రమాణంలో వాలభిల్యుడు
మొదలైన 60 వేల
మంది పుత్రులు
కలిగారు.
వసిష్ఠునికి
ఊర్జవల్ల ఊర్థ్వబాహుడు, రజుడు, అనఘుడు, గోత్రుడు, సవనుడు, సుతపుడు, శుక్రుడు
జన్మించారు. వీరు
ఉత్తమ మనువుకాలంలో
సప్తర్షులు.
బ్రహ్మ
పెద్దకొడుకు వహ్నికి, స్వాహావల్ల
గొప్ప ఓజస్సంపన్నులైన
ముగ్గురు పుత్రులు
కలిగారు. వీరే
శుచి, పావకుడు, పవమానుడు.
వీరికి తిరిగి
జన్మించిన సంతానం 45 మందికి, ఈ
వహ్ని మొదలగు
అగ్నులు కలిసి
మొత్తం 49 మంది
అగ్నులుగా సుప్రసిద్ధులు.
బ్రహ్మవల్ల
సృజింపబడిన అగ్నిష్వాత్, బార్హిషద్, అనగ్న, సాగ్నాది
సంతతి తెలిసింది
కదా! స్వధాదేవికి
పితృదేవుని వల్ల
పితృగణాలు, మేన
- వైతరణి అనే
యిద్దరు బ్రహ్మవాదినులైన
కన్యలు కలిగారు.
సర్వశుభలక్షణలు, గొప్పజ్ఞానవంతురాళ్లు.
దక్షకన్యల గురించిన
సంగతులన్నీ విన్నావు
కదా! ఈ
వైనం శ్రద్ధగా
స్మరించిన వారికి
సంతానహీనత కలుగదు"
అని చెప్పాడు
"పరాశరుడు".
ఇదంతా
అందరికీ అర్ధం
అయ్యే రీతిలో
చెప్పింది ఎవరో
చెప్పాల్సిన పనిలేదు.
ఇలా చెప్పగలిగిన
ఒకే ఒక్కరు
అందరికీ తెలిసిన
బ్రహ్మశ్రీ చాగంటి
కోటేశ్వరరావు గారు.
ఇదంతా నేను
ఎందుకు చెబుతున్నాను
అంటే మా
గోత్రం "పరాశర"
- అదీ విషయం
- ఇంకో విషయం
ఇది మోచర్ల
కృష్ణమోహన్
గారి సౌజన్యం
- భండారు శ్రీనివాసరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి