“డియర్ ఎడిటర్
“మీ పత్రిక నిర్వహించిన దీపావళి కధల
పోటీలో గెలుపొందిన రచనలను చదివి ఈ ఉత్తరం రాస్తున్నాను. రెండవ బహుమతి ఇచ్చిన కధ
మొదటి బహుమతికి అర్హత కలిగివుందని, మూడవ బహుమతి వచ్చిన కధకు రెండో బహుమతి ఇచ్చి
వుండాల్సిందని నా అభిప్రాయం”
సంపాదకుడి జవాబు:
“మీరు చెప్పినట్టుగా రెండో బహుమతి కధకు
మొదటి బహుమతి ఇచ్చివున్నట్టయితే ఖచ్చితంగా అప్పుడు కూడా మీరు ఇలాగే రాసివుండేవారు. పాఠకుల మనస్త్వత్వం
తెలిసిన కారణంగా ఆ విధంగా బహుమతులు ఇవ్వడం జరిగింది. గమనించగలరు”.
ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే నిన్న ఏడో తేదీ
నా పుట్టిన రోజున కాకతాళీయంగా ‘ఫ్రెండ్ షిప్ డే’ కూడా. మరునాడే అంటే ఆగస్టు ఎనిమిదో తేదీ మిత్రుడు వనం
జ్వాలా నరసింహారావు జన్మదినం. నిజానికి ఫ్రెండ్ షిప్ డే ఈరోజు అయినట్లయితే ఎంతో బాగుండేది. ఎందుకంటే స్నేహానికి జ్వాలా
మానవ రూపం కనుక.
మిత్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
1 కామెంట్:
Greetings to you and Sri Jwala garu on the occasion of your birthday and also for the Friendhip Day. Though you are close relatives, people knew both of you as friends only. Pray Almighty to shower His blessings on both of you for a very long life filled with health, wealth and happiness.
Prasad Sarma
కామెంట్‌ను పోస్ట్ చేయండి