9, ఆగస్టు 2025, శనివారం

బోనసు జీవితం- భండారు శ్రీనివాస రావు

 

పెట్టి పుట్టిన వాళ్ళ జాబితాలో నేను ఖచ్చితంగా వుంటాను.
నేను 80 వ ఏట ప్రవేశించాను.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు పొద్దున్నే వచ్చి కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు.
నా కంటే పెద్దది అయిన మా వదిన విమలాదేవి గారు నాకోసం ఓపిక చేసుకుని తయారుచేసిన గోంగూర పచ్చడిని చిన్న డబ్బాలో పెట్టి పంపించారు.
చిన్నప్పటి నుంచి నాకు పచ్చళ్ళు, కారాలు ఇష్టం. ఆ సంగతి మా వదినకు తెలుసు.
ఉప్పూ కారాలు వద్దని, తగ్గించమని డాక్టర్లు చెబుతుంటారు. పెళ్లి విందుల్లో వంద రకాలు వడ్డించినా కూడా నేను తినేది ఇవే.
భారతీయుల సగటు జీవిత వయసు 70.
నాకిప్పుడు 80. పదేళ్లు బోనసు.
కాబట్టి ఇప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది?
కోడలు నిషా కటక్ నుంచి వీడియో కాల్ చేసింది. మనుమరాలు జీవిక 'హ్యాపీ బర్త్ డే తాతా' అంటుంటే కర్ణపేయంగా వినిపించింది.
అమెరికా నుంచి కోడలు భావన, కొడుకు సందీప్ ఫోన్ చేశారు. మనుమరాళ్లు సృష్టి, సఖి తెలుగులో శుభాకాంక్షలు చెప్పారు.
మా వదిన పంపించిన గోంగూర, పిల్లలు చెప్పిన గ్రీటింగ్స్ నా పుట్టినరోజున నాకు లభించిన బెస్ట్ గిఫ్ట్స్.
ఇంతకంటే ఏం కావాలి హాయిగా నిద్ర పోవడానికి.








కామెంట్‌లు లేవు: