ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది.
“సీఎం ఆఫీసు నుంచి. శ్రీనివాసరావు గారా! సీఎమ్ గారు మాట్లాడుతారు,
లైన్లో వుండండి” అంది ఓ గొంతు.
ఓ ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం
లేదు. రిటైర్ అయి పదిహేను ఏళ్ళు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం.
“శ్రీనివాసరావు గారు, బాగున్నారా!
ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను,
ఇంటికి రండి”
కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు.
మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గర వున్నాను’
అన్నాడు.
రోజూ మూడున్నరకు నా మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం
సంధ్యా ప్రసక్తి వుండదు.
డ్రైవర్ ని ఉండమని చెప్పి అప్పటికప్పుడు తయారై,
గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు
వెళ్ళాడు. లిఫ్టులోపైకి వెళ్లేసరికి రండి రండి భోజనం చేద్దాం అని ఆహ్వానించారు
కేసీఆర్. చేసేవచ్చానని చెబితే, ఇలా మాతో వచ్చి కూర్చోండి అన్నారు. భోజనం టేబుల్
దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు
సంతోష్, ఎంపీ.
మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ.
భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి
వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు
ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి డ్రైవర్ డోర్ తీశాడు.
కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్
చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ
నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన. ఈలోగా ఎవరితోనో ముచ్చటిస్తున్న సీఎమ్ నా వైపు చూసి ఎక్కండి అన్నారు. నాకు కలయో
వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే.
రిటైర్ అయి పదిహేనేళ్లు. అందుకే ఆశ్చర్యం. పక్కన కూర్చోబెట్టుకున్నారు.
అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన
వెనకనే కూర్చోబెట్టుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ కూడా నాతోపాటు భండారు
శ్రీనివాసరావు కూడా వచ్చారు అని ఆయన చెబుతున్నప్పుడు మతి పోయింది.
సభ ముగిసింది.
తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి
సీఎం రెసిడెన్స్. పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో
ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు.
ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు
చెప్పాను.
ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రండి అన్నారు అక్కడ ఎవరితోనో.
ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను.
అప్పటివరకు సెక్యూరిటీ జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది.
కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్
మీటింగులో సీఎం తో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్.
అయితే నిజమే అన్నమాట.
ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు
వెళ్లినట్టు?
ఈ భేతాళ ప్రశ్నకు జవాబు లేదు, కేసీఆర్ గారి అభిమానం
ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడం తప్ప.
(21-02-2022)
6 కామెంట్లు:
ఉండదా మరి ?
మొన్నేమో మీకెలా తెలుసంట్రి :)
// “ ఇంతకూ ఎందుకు పిలిచినట్టు?” //
కూటమి ఏర్పాటు జరిగితే దాంట్లో మీకు కీలకమైన పదవి ఇచ్చే ఆలోచన ఏమయినా ఉందేమోనండీ?
All the best 👍
ఈ వివరాలు బ్లాగులో వెంటనే వ్రాయడం సరికాదేమో అనిపించింది.
>>కూటమి ఏర్పాటు జరిగితే దాంట్లో మీకు కీలకమైన పదవి ఇచ్చే ఆలోచన ఏమయినా ఉందేమోనండీ?
🤔🤔🤔
@అజ్ఞాత: వివరాలు రాయడం మంచిది కాదేమో అన్నారు. అవును నిజమే. ఏదో CUP AND LIP సామెత గుర్తుకు వచ్చింది. కొన్ని విషయాలు బయట పెడితే జరిగేది జరక్కపోవచ్చు. అదెప్పుడు అంటే ఏదో జరుగుతుందని ఆశ పడ్డప్పుడు. ఆశ లేకపోతే నిరాశకు వీలే వుండదు. మీరు పెట్టిన కామెంటుకు ధన్యవాదాలు. అది చదివిన తర్వాత ఓ పాత పోస్టు గుర్తుకు వచ్చింది. అదే ఇది: "అధికారం, హోదా, చదువు, డబ్బు, బ్యాంక్ బాలన్సులు ఇవి వ్యక్తుల భౌతిక స్తితిగతులకు కొలమానాలు కావచ్చు. కానీ అవన్నీ వారిని ఈ ప్రపంచంలో గొప్పవారిని చేయగలవేమో కానీ, పెద్దవారిని చేయలేవు. నిజానికి మనం యెంత చిన్నవాళ్ళమో, ఒకరకంగా చెప్పాలంటే పిపీలికాలమో తెలుసుకోవడానికి ఓ చిన్న చిట్కా వుంది. ఆకాశం నిర్మలంగా వున్న రాత్రి డాబా మీద వెల్లకిలా పండుకుని పైకి చూడండి. వేల కోట్ల మైళ్ళ దూరంలో వున్న నక్షత్రాలు మిణుకుమిణుకు మంటూ కానవస్తాయి. వాస్తవానికి అవి యెంత పెద్దవో ఈరోజుల్లో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి కూడా తెలుసు.
గగనాంతర రోదసిలో, అనంతకోటి నక్షత్ర రాశుల నడుమ, మనం వున్న ఈ సమస్త భూ మండలమే ఓ పిపీలికం. ఆ భూమండలంలోని ఒక దేశంలో, ఆ దేశంలోని ఓ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలోని ఓ నగరంలో, ఆ నగరంలోని ఓ ప్రాంతంలో, ఆ ప్రాంతంలోని ఓ నివాసంలో, ఆ నివాసంలోని డాబాపై పడుకుని పైకి చూస్తున్న మనం పిపీలికాలమా, లేక అంత కంటే మరుగుజ్జులమా?
ఆలోచించండి!" ఇదే ఆ పాత పోస్టు
Punjab Farmers death case lo Asish Mishra ki Bail with Z+Security.
Two murders chesi jail lo unna Dera chief Ram Ram Rahim ki Bail with Z+ Security.
Real face of Communal BJP. Sir, Please dont support BJP.
: Hindu
కామెంట్‌ను పోస్ట్ చేయండి