తెలుగు రేడియో వార్తలకు డెబ్బయ్ అయిదేళ్ళు.
ఇందులో ముప్పయ్యేళ్లకు పైగా నేను ఆ వార్తావిభాగంలో పనిచేసాను. నిజంగా నన్ను నేను అభినందించుకోవాల్సిన విషయమే! సెహభాష్ శ్రీనివాసరావు.
(దేవులపల్లి అమర్)
ఈరోజు ఉదయం సాక్షి టీవీ ఛానల్లో షరా మామూలు
రాజకీయ చర్చలు ప్రారంభించడానికి ముందు,
కార్యక్రమ సమర్పకులయిన శ్రీ దేవులపల్లి అమర్, ప్రజాశక్తి పత్రికలో ప్రచురించిన ఈ విషయాన్ని ప్రస్తావించి రేడియో వార్తలు
గురించి రెండు ముక్కలు మాట్లాడానికి అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషం అనిపించింది.
థాంక్స్ అమర్.
75 వసంతోత్సవాన్ని న్యూ ఢిల్లీ లో ఆకాశవాణి వారు నిన్న
నిర్వహించారు. 1938 లో
తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఆలిండియా రేడియో వార్తాప్రసారాలు మొదలు
పెట్టింది. ఈ భారతీయ భాషల్లో చిరకాలం వార్తలు చదివిన 14 మంది సీనియర్ న్యూస్ రీడర్లను ప్రసార భారతి సీ.ఈ.ఓ.
జవహర్ సర్కార్ ఘనంగా సత్కరించారు. తెలుగులో వార్తల ఘనాపాఠీలుగా పేరుతెచ్చుకున్న
శ్రీయుతులు కందుకూరి సూర్యనారాయణ, డి.వెంకట్రామయ్య, ఏడిద గోపాలరావులను
సన్మానించారు. వయోభారం కారణంగా శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య ఈ కార్యక్రమానికి హాజరు
కాలేకపోయారు.
రేదోయోకు, రేడియోలో పనిచేసిన, ఇంకా
చేస్తున్నవారికి గుర్తింపు, గౌరవం క్రమంగా తగ్గిపోతున్న రోజుల్లో ఈ పేరుతొ అయినా
గుర్తుచేసుకున్న ఆకాశవాణి వారు అభినందనీయులు.
సలాం రేడియో.
(02-10-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి