17, మార్చి 2025, సోమవారం

ఏకాంత శయనం

ఏకాంత శయనం – భండారు శ్రీనివాసరావు 

జీవితంలో ఎదగడానికి చాలా చాలా కష్టపడాలి. ఆ ఎదుగుదలలోనే  కొంత సంయమనం అవసరం. ఎదిగే వయస్సులో సమవయస్కులు, సహోద్యోగులు, మితృలు, బంధువులు అందరూ తోడుంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు చుట్టూ వున్న సన్నిహితులు,  స్నేహితులు, శ్రేయోభిలాషుల  సంఖ్య తరిగిపోతూ వుంటుంది. ఎందుకంటే ఎక్కేది పిరమిడ్. పైకి పోతున్న కొద్దీ, చుట్టూ వున్న చుట్టుకొలత చిన్నది అవుతూ వుంటుంది. వారికి జాగా వుండదు.
చివరికి చివరి మెట్టు ఎక్కిన తర్వాత చూసుకుంటే చుట్టూ ఎవ్వరూ కనబడరు.
ఏమి సాధించినట్టు?

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆ విషయం చివరి మెట్టు ఎక్కిన తరువాత మాత్రమే అర్థం అవుతుంది.
అదే మరి మాయ అంటే.

ఒంటరిగా ఉన్నా సమూహం లో ఉన్నా శాంతంగా ఉండడమే స్థిత ప్రజ్ఞత అనిపించుకుంటుంది.

Zilebi చెప్పారు...

ఎక్కాక తల క్రిందులుగా నిలబడి‌ చూడాలె
ఏమి సాధించిరో తెలియవచ్చును

అజ్ఞాత చెప్పారు...

భారతదేశం ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం .. అటువంటిది హిందీని దక్షిణాదిపై రుద్ది .. సంస్కృతిని నాశనం చేయాలని చూస్తున్న బిజెపి ..
అది ఆడమన్నట్లు ఆడుతూ పూటకో వేషం వేస్తున్న పవన్ కళ్యాణ్ ..

ఎందుకు వీళ్ళ ఆదరణ పెరిగిపోతోంది .. జనాలు ఏం కోరుకుంటున్నారు ???

అజ్ఞాత చెప్పారు...

ఓయీ అనానిమస్సూ

ఈ హిందీ తెలియక పోవడం వల్లే దక్షిణపు నేతలెంత మంది యున్నా, సత్తా వున్నా కూడా ప్రధానమంత్రి ప్రముఖ కేంద్రమంతులూ కాలేక పోతున్నారోయ్.

ఆ హిందీ యేడ్పేదో నేర్చేసుకుంటే సెంటర్ సౌత్ కాకుండా పోతుందా ?

తెలివి పెట్టండర్రా సోమరిపోతులూ







అజ్ఞాత చెప్పారు...

Demography is increasing in the Hindi belt and decreasing in South India. Like it or not migration of Hindi people and spread of Hindi is inevitable.

అజ్ఞాత చెప్పారు...

ఓసీ.. చెప్పావులే బోడి .. హిందీ మనం నేర్చేసుకుంటే .. ఉత్తరాది నుంచి ఇక్కడికి నేతలను దింపేద్దామని మీ మోడీ బాబాయ్ ప్లాను .. మనకు ఛాన్సు కూడా ఇస్తారా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

కామరాజ్ నాడార్ కు హిందీ భాష తెలుసునా ? ఆయనకు తమిళం తప్ప ఇతర భాషలేవీ రావని నేను విన్నది.