ఏకాంత శయనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఏకాంత శయనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మార్చి 2025, సోమవారం

ఏకాంత శయనం

ఏకాంత శయనం – భండారు శ్రీనివాసరావు 

జీవితంలో ఎదగడానికి చాలా చాలా కష్టపడాలి. ఆ ఎదుగుదలలోనే  కొంత సంయమనం అవసరం. ఎదిగే వయస్సులో సమవయస్కులు, సహోద్యోగులు, మితృలు, బంధువులు అందరూ తోడుంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు చుట్టూ వున్న సన్నిహితులు,  స్నేహితులు, శ్రేయోభిలాషుల  సంఖ్య తరిగిపోతూ వుంటుంది. ఎందుకంటే ఎక్కేది పిరమిడ్. పైకి పోతున్న కొద్దీ, చుట్టూ వున్న చుట్టుకొలత చిన్నది అవుతూ వుంటుంది. వారికి జాగా వుండదు.
చివరికి చివరి మెట్టు ఎక్కిన తర్వాత చూసుకుంటే చుట్టూ ఎవ్వరూ కనబడరు.
ఏమి సాధించినట్టు?