కాలం పరిగెత్తుతుందని, దాని వేగం అందుకోవడం కష్టమని తెలిసివచ్చింది.
సంతోష్ చనిపోయి అప్పుడే సంవత్సరం అయిందా. అసలు వాడు పోయాడా, ఏదైనా దేశానికి ఉద్యోగానికి వెళ్ళాడేమో, రేపోమాపో తిరిగి వస్తాడేమో అనే ఆలోచన వుట్టి భ్రాంతే అని, విప్రవరులు ఉచ్చై స్వరంతో రెండు రోజులుగా ఏడూడి మాసికాలు పెడుతుంటే, వాళ్ళు చెప్పినట్టు వింటూ, చేస్తూ పిండాలు అగ్నిహోత్రంలో నేనే స్వయంగా వేస్తుంటే నమ్మకం పోవడం ఎలా!
నమ్మిచేసేది ఏముంది? నమ్మక చేయగలిగేది ఏముంది?
అష్ట ఐశ్వర్య సిద్ధిరస్తు అని పండితులు ఆశీర్వదిస్తుంటే నవ్వు వచ్చింది. నిజంగానే పైనున్న దేవతలు తథాస్తు అంటే, ఒక పక్క భార్య పోయి, కుడి భుజంగా ఉంటాడు అనుకున్న ఎదిగిన కొడుకు పోయి ఏం చేసుకోవాలి ఆ ఐశ్వర్యాలను?
కూతురు జీవికతో ఆడాల్సిన ఆటలు, పాడాల్సిన పాటలు పాడి తన దోవ తాను చూసుకున్నాడు.
పాపం కోడలు నిషా!
https://www.youtube.com/watch?v=9ijzemJPsCM
(22-01-2025)
1 కామెంట్:
Time and tide wait for none అన్న ఆంగ్ల సామెత మీకు తెలుసుగా ?
ఏమైనప్పటికీ ఈ వయసులో మీకు తగిలిన ఎదురుదెబ్బలు (భార్య, ఆ తరువాత కొడుకూ గతించడం) సామాన్యమైనవి కావు 🙏.
కామెంట్‌ను పోస్ట్ చేయండి