ప్రతి నాలుగు లేదా అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే కాదు. ప్రజాస్వామ్య స్పూర్తి ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ స్పూర్తి కొట్టవచ్చినట్టు కనబడింది.
ఈరోజు పొద్దున్నే
మూడు నాలుగు పత్రికలు చూశాను. టీవీలో కనపడ్డ ఆ దృశ్యాలు, నేను తిరగేసిన ప్రధాన
పత్రికల్లో కానరాలేదు. ట్రంప్ అమెరకా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు
అంతకు నిమిషం ముందు వరకు అధ్యక్షుడిగా
వున్న బైడన్, ఉపాధ్యక్షురాలిగా వున్న కమల హారిస్ పక్కనే ఆసీనులయి కనిపించారు.
ట్రంక్ తనదైన శైలిలో పూర్వపు ప్రభుత్వాన్ని, దాని విధి విధానాలను తూర్పారపడుతూ
ప్రసంగిస్తున్నా, వారిద్దరూ చాలా నిగ్రహంతో, హుందాగా ఆ ప్రసంగాన్ని మౌనంగా
ఆలకించారు. అంతే కాదు, ఒక
సందర్భంలో సభికులు అందరూ నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నప్పుడు,వారిద్దరూ కూడా లేచి నిలబడి చేతులు
చరిచారు. ప్రజాస్వామ్య స్పూర్తికి కొలమానం అయిన ఈ దృశ్యాల ఫోటోలు నాకు ఈరోజు
పత్రికల్లో ఎక్కడా కనిపించలేదు.
(21-01-2025)
1 కామెంట్:
అది సభా మర్యాద అనుకుంటున్నాను.
ప్రజాస్వామ్యం గురించి అయితే ట్రంప్ అసలు అలా మాట్లాడకూడదు కదా?? అది వేదిక కాదు కదా ముందరి ప్రభుత్వం గురించి తిట్టడడానికి.
ఆయన , ఆయన మద్దతుదారులు ప్రజాస్వామ్యం ఎప్పుడు అనుసరించారో??
కామెంట్‌ను పోస్ట్ చేయండి