ముఖ్యమంత్రి అంజయ్య అధికార నివాసంలో ఒక రోజు కౌలాలంపూర్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రయాణపు ఏర్పాట్ల గురించి అధికారులతో ముచ్చటిస్తున్నారు.
ముఖ్యమంత్రి భద్రాచలంలో రాములవారి కళ్యాణ తలంబ్రాలు ఇవ్వాల్సిన కారణంగా ఆయన ముందు హెలికాప్టర్ లో వెళ్లి, ఒకరోజు ఆలస్యంగా బొంబాయి నుంచి కౌలాలంపూర్ వెళ్ళాలని నిర్ణయించారు. ఆ టైములో అంజయ్యగారు నా వైపు చూసి నీ సంగతి ఏమిటి నువ్వు ఎలా వస్తున్నావు అన్నారు. నాకు పాసుపోర్టే లేదు, ఎలా సాధ్యం అవుతుంది అని జవాబు చెప్పాను. సీ ఎం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు గారెతో, శ్రీనివాస్ కు పాస్ పోర్టు లేదట ఆ విషయం ఏదో చూడండి అన్నారు. దానితో నేను ఖంగు తిన్నాను. రాఘవేంద్రరావు గారు నన్ను పక్కకు తీసుకువెళ్లి ‘రేపు మొయిన్ (సీ ఎం వ్యక్తిగత కార్యదర్శి, మొయినుద్దీన్) అన్నీ చూసుకుంటాడు’ అని చెప్పారు.
మర్నాడు మొయిన్ మా ఇంటికి వచ్చి అప్లికేషన్ ఫారం పూర్తి చేయించాడు. స్వయంగా నన్ను వెంటబెట్టుకు వెళ్లి పాస్ పోర్ట్ ఇప్పించారు. అప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు బర్కత్ పురాలో వుండేది. అయితే అది ఆరు మాసాలకు మాత్రమే పనికి వచ్చే తాత్కాలిక పాస్ పోర్టు. ఆ విధంగా నా మొదటి విదేశీ ప్రయాణం 1981 లో జరిగింది. పాస్ పోర్టు వచ్చింది. కౌలాలంపూర్ వెళ్ళడానికి విమానం టిక్కెట్లు ప్రతినిధులకు ఇచ్చే వ్యవహారం మంత్రి, మండలి వెంకట కృష్ణారావు గారు చూస్తున్నారు. నేను మద్రాసు వెళ్లి తిరిగి రావడానికి విమానం టిక్కెట్టు అప్పటి హోం మంత్రి కె. ప్రభాకరరెడ్డి గారు ఏర్పాటు చేశారు. మద్రాసులో పరిస్థితి చూస్తే నాకేమీ పాలు ప్లేదు. మంత్రి ఏమ్వీ కృష్ణారావు గారు, కౌలాలంపూర్ వెళ్లి తీరాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను సముదాయించే పనిలో మునగానాం తేలానాం అన్నట్టు వున్నారు. నన్ను చూడగానే ఆయన, తన జేబులో వున్న ఒక టికెట్టు తీసి ఇచ్చి, ‘ఎక్కువ టైం లేదు, శ్రీలంక మీదుగా కౌలాలంపూర్ వెళ్ళే విమానం. వెంటనే ఎయిర్ పోర్టుకు వెళ్ళండి అంటూ తొందరపెట్టారు. అంత పని ఒత్తిడిలో కూడా, కారిచ్చి ఎయిర్ పోర్టుకు పంపారు. అంత కష్టపడి తెలుగు సభలకోసం రాత్రింబవళ్ళు కృషిచేసిన మండలి వెంకట కృష్ణారావు గారు, చివరికి తాను కౌలాలంపూర్ రాలేకపోయారు. ఇది నన్ను చాలా బాధించింది.
మండలి వెంకట కృష్ణారావు గారికి ప్రపంచ తెలుగు సభల నిర్వహణ కొత్తకాదు, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన మంత్రివర్గంలో సభ్యులు అయిన కృష్ణారావు గారి సారధ్యంలోనే 1975లో హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహా సభలు నేత్ర పర్వంగా ఘనంగా, జయప్రదంగా జరిగాయి. ఎంతో ముందు చూపుతో, బాగా కసరత్తు చేసి నిర్వహించిన సభలు ఇవి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాసిన శంకరంబాడి సుందరాచారి గారు, తన కోకిల స్వరంతో ఆ పాటకు జీవం పోసి, విదేశంలో స్థిరపడిన గాయని టంగుటూరి సూర్యకుమారి గారు, సుందరాకాండ రాసి, గానం చేసిన సుప్రసిద్ధ గాయకుడు ఎం.ఎస్. రామారావు గారు ఈ సభల్లో పాల్గొనడం గొప్ప విశేషంగా ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఈ కీర్తి ప్రతిష్టలకు ప్రధాన భూమిక వహించింది నిస్సందేహంగా మండలి వెంకట కృష్ణారావు గారే. అలాంటి వ్యక్తి తాను తలపెట్టి, ప్రణాళికా రచన చేసి, నిర్వహించిన కౌలాలంపూర్ తెలుగు సభలకు రాలేని పరిస్థితి ఏర్పడడం విచారకరం.
మద్రాసులో నేనెక్కిన శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానం ఏప్రిల్ పద్నాలుగు ఉదయం ఆరున్నరకు శ్రీలంక (సిలోన్) మీదుగా కౌలాలంపూర్ బయలుదేరింది.
కింది ఫోటో: మండలి వెంకట కృష్ణారావు గారు
(ఇంకా వుంది)
21 కామెంట్లు:
మీపై అంజయ్య గారి అపాంగవీక్షణానికి కారణమేమిటి ?
ఎగ్జాక్ట్లీ . కారణమేమిటి ?
పైగా ఇంత వెలుగు వెలిగిన మీరు “అయాం ఎ బిగ్ జీరో” అంటారేమిటి, భండారు వారూ ? వినమ్రతా ?
అజ్ఞాత గారికి : అకారణ ద్వేషం మాదిరిగానే అకారణ వాత్సల్యం . కారణాలు వుండవు. అందుకే అకారణం అన్నారు.
విన్నకోట గారికి. చివరి అధ్యాయంలో కానీ జీరో ఎందుకు అనే విషయంలో వివరణ వుండవచ్చు. ఇది సస్పెన్స్ కోసం కాదు. ఎవరికీ వారికే అర్ధం అయ్యే రీతిలో ముగింపు వుండాలని నా అభిలాష
కొత్త సంవత్సరంలో “జిలేబి” గారి దర్శనం లేదే ?"
బాల్చీ తన్నేసారేమో
లేదు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిలేబీలు, సమోసాలు సప్లయి కోసం వెళ్లి ఉండవచ్చు.
జిలేబి పోయిందా?
పోతే పోనీ పోరా
ఈ పాపపు జగతి
శాశ్వతమెవరురా?
పోతే పోనీ పోరా
Why write obsequies so soon ? Jilebi will make a comeback like phoenix. This may be a brief sabbatical.
శ్యామలీయం గారు కూడా చాల రోజుల నుంచి మాలిక లో కనిపించలేదు.
బ్లాగుల్లో పాల్గొనడం గణనీయంగా తగ్గించేస్తున్నానని శ్లామలీయం గారు ఇదివరకే ప్రకటించేసారు కదా.
వారు తన రామకీర్తనలేవో తను వ్రాసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు.
ఊకదంపుడు
ఢంకాభారము - గిమస్యలు - 5000
దుంప తెగ! వీరిచ్చిన ప్రోత్స్ తోనే జిలేబీ భీకర బ్లాగ్ గిద్యాల విజృంబాయం జరిగి అందరూ బ్లాగొదిలేసి పారిపోయే దాకా వచ్చింది
బ్లాగు సంక్రాంతి సంబరాలు
జిలేబీ గిద్యాలు - గొబ్బి పిడకలు
విన్నకోట వ్యాఖ్యలు - తంగేడు పూలు
శ్యామలీయం రామ కీర్తనలు - రంగవల్లులు
శర్మ గారు సూక్తులు -- నేతి అరిసెలు
భండారు ముచ్చట్లు - మినప గారెలు
🔥🔥 భోగి మంటలు
🌾🌾 పాడి పంటలు
🍚🍱 పిండి వంటలు
🛕🔔 గుడి గంటలు
👫 👩❤️💋👨 కొత్త జంటలు
Wow 👌.
Thanks for the compliment.
సమస్యా పూరణం ఒక విధంగా మెదడు కు మంచిదే. అయితే అప్పుడప్పుడు బూతు పదాలు, తిట్లు , వికార మైన మాటలు ఉపయోగించి పద్యాలు అల్లడం జుగుప్స కలిగిస్తుంది.
నువ్వెవరివోయ్ జడ్జ్మెంటివ్వడానికి?
నీకు జడ్జిమెంటు ఒక గిద్యంతో చెబుతా.
వెకిలి మాటలు చేర్చి
వెర్రి పద్యాల కూర్చి
వికృతానందం పొందే
వింత మానవా !
చింత మానవా ?
ఓ యబ్బో ! గిద్యాలు బాగా గెలికేస్తున్నావే ?
నీవు నేర్పిన విద్యయే.
పద్య గద్య లకు మించిన
గిద్య విద్య.
గిద్యాన్ని ఆరగించి పళ్ళూడిండాలే ? :)
గిద్యాలు ఆరగించేవి కావు
భోగిమంటల్లో వేసే గొబ్బి పిడకలు
వింత మానవా
ఇంక మానవా
కొంత మారవా
అరిసెలు అరగించుమా
బూరెలు భక్షించుమా
గారెలు ఆరగించుమా
కామెంట్‌ను పోస్ట్ చేయండి