'వ్రతం చేసుకుందాం' అన్నాడు మా వాడు. 'సరే' అంది
మా ఆవిడ. రోజుకు పాతిక ముప్పయి టాబ్లెట్స్, మూడు ఇంజెక్షన్లు. అయినా సరే అంటుంది. అంత సుస్తీ చేసి, ఇప్పుడిప్పుడేకదా
నువ్వు కోలుకుంటోంది. 'వద్దులే' అన్నది నా మాట. కానీ అది పైకి అంటే కదా! చివరికి నేనూ సరే అనక తప్పలేదు.
మా పిల్లలు, మా అన్నయ్యగారి పిల్లలు. ఇల్లు కళకళ.
శ్రావణ మాసం డిమాండ్ వున్నప్పటికీ మంచి పురోహితులవారు దొరికారు. 'పాతిక
ముప్పయిమంది భోజనాలు మాకొక లెక్కా' అన్నారు మా కోడళ్ళు అత్తగారితో చేయికలిపి.
పొద్దున్న ఛానల్ కు వెళ్ళి వచ్చేసరికి 'అంతా తయార్!'
(చూశారా! మగబుద్ది. ఫోటోలో కూడా అంతా మగవాళ్ళే)
వ్రతం, భోజనాలు సలక్షణంగా, తృప్తిగా జరిగాయి. 'బాగా
చేశారు' అనబోయాను. అనేవుంటాను. 'మాదేవుంది, అంతా ఆయనే చూసుకుంటాడు. మనం
నిమిత్తమాత్రులం' అన్నారు అంతా కోరస్ గా.
చేసికూడా చెప్పుకోకపోవడం ఆడంగులకే
చెల్లింది.
1 కామెంట్:
so nice sir!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి